96. జ్ఞానం 'స్వయం'లో ఉంది
' దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదో అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ దాచాలా అని సృష్టికర్త ఆలోచించారు. ఎత్తయిన పర్వతాల మీదో , లోతైన సముద్రంలోనూ దాచమని ఆయన భార్య సలహా ఇస్తుంది. కానీ మనిషి ఎక్కగలడు , ఈదగలడు కనుక ఆ రెండూ సరికావు అనుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మనిషి లోపలే దాచాలని నిర్ణయించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి జీవితాంతము దాన్ని బయట వెతుకుతూ ఉంటాడు. ఈ ఉదాహరణ శ్రీకృష్ణుడి బోధనను అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది. "ఖచ్చితంగా , ఈ ప్రపంచంలో జ్ఞానం వలె పవిత్రమైనది ఏదీ లేదు. తగిన సమయంలో యోగంలో పరిపూర్ణత సాధించినవాడు దానిని తనలోపలే కనుగొంటాడు” , అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 4.38). సారం ఏమిటంటే జ్ఞానం మనతోపాటు అందరిలో సమపాళ్లలో ఉంది. దాన్ని మనలో సాధించుకొనడమే కాకుండా ఇతరులలో ఉన్నదని కూడా గుర్తించాలి. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు , “ శ్రద్ధావాన్ , జితేంద్రియుడు ఈ జ్ఞానం పొందడం ద్వారా పరమ-శాంతిని పొందుతాడు ( 4.39). శ్రద్ధ లేని అజ్ఞాని నాశనమవుతాడు , అతనికి ఇహలోకంలో లేదా మరెక్కడా కానీ సుఖం ఉండదు” అని ఆయన హెచ్చరిస్తున్నారు ( 4.40). భగవద్గీతలో ' శ్రద...