పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

94. నేర్చుకోవడం అనే కళ

చిత్రం
  జీవితాంతం నేర్చుకోగల , అభ్యసించగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి , ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం , ప్రశ్నించడం , సేవ చేయడం ద్వారా తత్త్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు సూచించారు (4.34). సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత , వినయం , ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం , విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది ; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని , చెబుతున్నవాటిని , చేస్తున్నవాటిని అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. సేవ చేయడం అంటే కరుణామయము అయిన జీవనం. ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు ? వారిని ఎలా కనుగొనడం అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తారు. ఆ జ్ఞాని , భూమి నుంచి క్షమను ; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని ; గాలి నుంచి నిస్సంగాన్ని ; తేనెటీగల నుంచి నిల్వ చేయడాన్ని నిరోధించే లక్షణాన్ని ; సూర్యుడి న...

93. సంతృప్తే అమృతం

చిత్రం
  శ్రీకృష్ణుడు రెండు సందర్భాలలో (3.9 - 3.15 , 4.23 - 4.32) యజ్ఞరూపమైన నిష్కామ కర్మల గురించి వివరించారు. ప్రేరేపిత కర్మలు మనల్ని కర్మబంధాల వలలలో చిక్కుకుపోయేలా చేస్తాయని ఆయన హెచ్చరించారు (3.9). అందుకే ఆసక్తి , విరక్తికి అతీతమైన అనాసక్తితో కర్మలను చేయమని సలహా ఇచ్చారు. యజ్ఞం అనే నిస్వార్ధ కర్మలు అత్యున్నత శక్తిని కలిగి ఉంటాయని (3.15) ; ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించి సృష్టికర్త సృష్టించారని ఆయన సూచిస్తారు (3. 10). ఆయన యజ్ఞానికి సంబంధించిన అనేక ఉదాహరణలను ఇచ్చారు (4.23-4.32). అవన్నీ నిష్కామ కర్మల వేర్వేరు రూపాలని , ఈ సాక్షాత్కారం మనకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు (4.32). మోక్షం గురించిన భగవంతుని యొక్క ఈ హామీ మనకు శిరోధార్యం. పాపం గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు సుఖదుఃఖం , లాభనష్టం , జయాపజయాలు అనే ద్వంద్వాల మధ్య అసమతుల్యత నుండి ఉత్పన్నమయ్యే చర్యే పాపం అని సూచించారు (2.38 , 4.21). దీనివల్ల గాఢమైన పశ్చాత్తాపం , పగ , ద్వేషం వంటి కర్మబంధనాలలో మనం చిక్కుకుపోతాము. “అంతఃకరణమును , శరీరేంద్రియ ములను జయించినవాడు ; సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు ; ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక క...

92. శ్వాస ద్వారా ఆనందం

చిత్రం
గుండె కొట్టుకోవడం వంటి మానవ శరీరంలోని కొన్ని కార్యకలాపాలు నిర్ణీత లయను అనుసరిస్తూ స్వయంచాలకంగా జరుగుతాయి. కాళ్లు , చేతుల వంటి కొన్ని అవయవ వ్యవస్థల కార్యకలాపాలను మనం నియంత్రించవచ్చు. కానీ శ్వాస అనేది స్వయంచాలకమైనది అలాగే దాన్ని మనం నియంత్రించగలం కనుక ఇది ప్రత్యేకమైనది. యజ్ఞం (నిష్కామ కర్మ) , శ్వాస సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ కొందరు అపానవాయువునందు ప్రాణవాయువును , మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేస్తారు ; కొందరు ప్రాణ , అపాన వాయుగతిని నిరోధించడం ద్వారా ప్రాణాయామంలో లీనమవుతారు” (4.29). శ్వాస యొక్క వ్యవధి , తీవ్రత మానసిక స్థితిని సూచిస్తాయి. ఉదాహరణకు , మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస దానంతటదే వేగం అవుతుంది. దీని అర్థమేమిటంటే మనం మన శ్వాసను నెమ్మదిగా , లోతుగా మార్చడం ద్వారా మన కోపాన్ని నియంత్రించుకోవచ్చు. శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సును నియంత్రించవచ్చని ఇది సూచిస్తుంది. ఇది ధ్యానం , ప్రాణాయామం వంటి అనేక పద్ధతులకు దారితీసింది. శివుడు పార్వతికి 112 ధ్యాన పద్దతులను వివరిస్తూ శ్వాసపై ఆధారపడిన కొన్ని పద్ధతుల గురించి పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో శ్వాసను గమనించ...

91. స్వీయ అధ్యయనం

చిత్రం
  ' కడుపులో కాలటం ' అంటే భౌతిక ప్రపంచంలో తన కోరికలు తీర్చుకోవడానికి , అభిరుచులు , విధులను నిర్వహించడానికి కావలసిన శక్తి , ఉత్సాహంతో నిండి ఉండటం. అటువంటి శక్తిని ఆత్మసాక్షాత్కారం కోసం ఉపయోగించినప్పుడు దానిని ' యోగ-అగ్ని ' అంటారు. ఈ సందర్భంలో , “ మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను , ప్రాణముల క్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు” ( 4.27) అని శ్రీకృష్ణుడు చెప్పారు. రోజువారీ జీవితంలో , మనం పరమాత్మకు అందమైన పువ్వులు , రుచికరమైన ఆహారం వంటి ఇంద్రియాకర్షక వస్తువులను సమర్పిస్తాము. కేవలం ఇంద్రియ వస్తువులను మాత్రమే అర్పించడం కాకుండా రుచి , అందం లేదా వాసన వంటి ఇంద్రియ కార్యకలాపాలను కూడా అర్పించడమని ఈ శ్లోకం చెబుతుంది. ఇంద్రియాలు , ఇంద్రియ వస్తువుల యందు ఆసక్తి , విరక్తి ద్వారా మనల్ని బాహ్య ప్రపంచంతో కలుపుతూనే ఉంటాయి. రుచి , వాసన వంటి ఇంద్రియ కార్యకలాపాలను త్యాగం చేసినప్పుడు ఆసక్తి , విరక్తి నశించిపోయిన తర్వాత మిగిలేది పరమాత్మతో ఐక్యతే. “ కొందరు ద్రవ్యసంబంధ యజ్ఞములను , మరికొందరు తపో రూప యజ్ఞములను , కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. ...

90. త్యాగాన్ని త్యజించడం

చిత్రం
  యజ్ఞమనేది త్యాగం లేదా నిష్కామ కర్మలకు ప్రతీకం. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ కొందరు యోగులు దేవతల కోసం త్యాగం చేస్తారు. మరికొందరు త్యాగం అనే భావనని బ్రహ్మ యొక్క అగ్నిలో త్యాగం చేస్తారు” (4.25). అవగాహన లేని వ్యక్తికి జీవించడం అంటే ధనాన్ని ప్రోగు చేసి దానిని సంరక్షించడం. వస్తువులు , ఆలోచనలను , భావాలను త్యాగం చేయడం జీవితం యొక్క తదుపరి దశ. ఇది అహంకార బీజాలను మనస్సు యొక్క సారవంతమైన నేలపై నాటడానికి బదులు అగ్నికి ఆహుతి ఇవ్వడం లాంటిది. మూడవ దశలో అంతా బ్రహ్మమే అని గ్రహించి త్యాగం అనే భావననే త్యాగం చేయడం. మనస్సు ఆధారిత కర్మయోగి కర్మలను చెయ్యడానికి చూస్తూ ఉంటాడు కాబట్టి యజ్ఞం చేయడం అతనికి మార్గమని చెప్పవచ్చు. బుద్ధి ఆధారిత జ్ఞానయోగి స్వచ్ఛమైన అవగాహన కోసం చూస్తూ త్యాగాన్నే త్యాగం చేస్తాడు. మొదటిది క్రమానుగతం అయితే రెండోది చాలా పెద్ద ఘటన కానీ అరుదైనది. ఈ రెండు మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి. శ్రీకృష్ణుడు ఈ వాస్తవికతను ఇంద్రియాల సందర్భంలో ఇలా వివరిస్తారు , “ కొంతమంది యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదురు. మరి కొందరు యోగులు శబ్దాది సమస్త విషయముల...