12. మనసును నియంత్రించడం
అర్జునుడు మనస్సును గాలితో పోలుస్తూ , సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ , వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు. జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా లేదా సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామ క్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి , అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది. మనస్సుకున్న ఈ సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి ఉపయోగిస్తే దానినే జాగరూకత అని కూడా అంటారు. ఈ సామర్ధ్యం ద్వారా మన ఆలోచనలు , భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని ఆలోచన యొక్క మరియు నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు. నేటి ఆధునిక యుగంలో , ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించడానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసం) ద్వారా , కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే ' ఫీడ్ బ్యాక్ లూప్స్ ' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనుక , ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ...