పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

42. అహంకారపు వివిధ కోణాలు.

చిత్రం
  అహంకారం (నేను కర్తని అన్న భావన) అర్జునుడిని ఆవహించిందని , అదే అతని విషాదానికి కారణమని శ్రీకృష్ణుడు గమనించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికి , అంతరాత్మ దాకా చేరుకోడానికి పొందికైన బుద్ధిని ఉపయోగించమని సలహా ఇస్తారు (2.41). అహంకారానికి అనేక రూపాలున్నాయి. గర్వం అహంకారంలో ఒక చిన్న భాగం. ఎవరైనా విజయం/గెలుపు/లాభం అనే ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని పొగరు అంటారు. ఎవరైనా నష్టం , వైఫల్యం , ఓటమి అనే బాధాకరమైన ధ్రువాల గుండా వెళుతున్నప్పుడు ఆ అహంకారాన్ని నిరాశ , దుఃఖం , క్రోధం అంటారు. ఇతరులు విజయాలను , గెలుపులను , సుఖాలను పొందినప్పుడు మనలోని అహంకారం అసూయగా మారుతుంది. ఎవరైనా దుఃఖంలో ఉంటే అదే సానుభూతిగా మారుతుంది. మనము భౌతిక ఆస్తులను కూడబెట్టు - కోవడానికి అహంకారం ప్రోత్సహిస్తుంది , వాటిని వదిలివేయడానికి కూడా కారణం అవుతుంది. ఇది లోకంలో కర్మ చేయడం లేక సన్యాసం స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. ఇది సృష్టితో పాటు వినాశనానికి కూడా కారణం. అది జ్ఞానంలోనూ , అజ్ఞానంలో కూడా ఉంటుంది. ప్రశంసలు అహంకారాన్ని పెంచుతాయి , విమర్శలు బాధ పెడతాయి. ఈ రెండు దశలూ మనల్ని ఇతరులకు దా...

41. అంతర్గత యాత్రకు సమగ్రమైన బుద్ధి

చిత్రం
  యోగం అంటే మన లోపలి , వెలుపలి భాగాల కలయిక. కర్మయోగ , భక్తియోగ , సాంఖ్యయోగ , బుద్ధియోగ మార్గాల ద్వారా దీనిని పొందవచ్చు. ఒకరి స్వభావాన్ని బట్టి వారికి తగిన మార్గాల ద్వారా యోగాన్ని పొందుతారు. “ఈ సమత్వబుద్ధి యోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున , నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనన , ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు , కృపణులు” అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు (2.49). అంతకుముందు , శ్రీకృష్ణుడు కర్మయోగంలో బుద్ధి పొందికగా ఉంటుందని మరియు అస్థిరమైన వారి బుద్ది నిలకడ లేకుండా ఉంటుందని చెప్పారు (2.41). ఒకసారి సమగ్ర బుద్ధి సాధిస్తే భూతద్దం కాంతిని కేంద్రీకరించినట్లు బుద్ధి జ్ఞానోపాసనలో సమర్ధతను పొందుతుంది. ' స్వయం ' వైపు ప్రయాణంతో సహా ఏదైనా ప్రయాణం దిశ , గమనం కలిగి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అంతరాత్మ వైపు ప్రయాణం యొక్క దిశ గురించి ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా మనం బాహ్య (భౌతిక) ప్రపంచంలో కోరికలను నెరవేర్చుకోవడానికి తెలివిని ఉపయోగిస్తాము . అయితే మనం ' స్వయం ' వైపు మన ప్రయాణాన్ని కొనసాగించడానికి బుద్ధిని ఉపయోగించాలని భగవద్గీత బోధిస్తుంది...

40. కర్తృత్వ భావనను విడనాడడం

చిత్రం
  “ యోగ స్థితుడవై ఆసక్తిని వీడి , సిద్ధి-అసిద్దుల యెడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు ( 2.48). మరో మాటలో చెప్పాలంటే మనల్ని మనం ద్వంద్వాలతో గుర్తించుకోవడం మానేసినప్పుడు మనం ఏమి చేసినా సమంజసంగా ఉంటుంది. మన రోజువారీ జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాము , ఎంపికలు చేస్తూ ఉంటాము. నిరంతరం నిర్ణయాలు తీసుకునే మనస్సు అందుబాటులో ఉన్న వికల్పాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఈ వికల్పాలను సుఖం/దుఃఖం , లాభం/నష్టం , గెలుపు/ఓటమి మరియు విజయం/వైఫల్యంగా వర్గీకరిస్తారు ( 2.38). ' సమత్వం ' అనేది పరస్పర విరుద్ధ ధృవాలను సమానంగా పరిగణించడం. దీనిని సాధారణంగా ద్వంద్వాలను అధిగమించడమని పిలుస్తారు. ఈ అవగాహన లోతుగా నాటుకున్నప్పుడు మనస్సు శక్తిహీనమై ఎంపిక లేని అవగాహనను పొందుతుంది. మనం నిద్రలో లేదా మత్తులో ఉన్నప్పుడు విభజన చేసే , నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాము. మనకు సామర్థ్యం ఉన్నప్పటికీ విభజన చెయ్యకుండా ఉండగలగడమే సమత్వ స్థితిని సాధించడం. ఇది కేవలం పరిశీలకుడిగా ఉంటూ వర్తమానంలో జీవించడం. కర్మ చేస్...

39. పునరావృతం ప్రావీణ్యానికి కీలకం

చిత్రం
  కర్ణుడు , అర్జునుడు కుంతికి జన్మించారు కానీ వ్యతిరేక పక్షాలలో పోరాడారు. కర్ణుడుకి ఉన్న శాపము కారణముగా అర్జునుడితో కీలకమైన పోరాటంలో అతని జ్ఞానము , యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. అతను యుద్ధంలో ఓడిపోయి , హతుడయ్యాడు. ఈ పరిస్థితి మనందరికీ వర్తిస్తుంది ఎందుకంటే మనము తరచుగా కర్ణుడి లాగానే ఉంటాము. మన జీవితంలో మనం చాలా నేర్చుకుంటాము ; జ్ఞానాన్ని , అనుభవాన్ని పొందుతాము. కానీ కీలకమైన సమయాల్లో మనం అవగాహనకు బదులు మన ప్రవృత్తులను బట్టి ఆలోచిస్తాము , పని చేస్తాము. ఎందుకంటే మన అవగాహన అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటుంది కనుక. శ్రీకృష్ణుడికి దీన్ని గురించి పూర్తిగా తెలుసు కనుకనే భగవద్గీతలోని వివిధ కోణాల నుండి వాస్తవికతను , సత్యాన్ని పదేపదే వివరిస్తారు. తద్వారా లోతైన అవగాహన అవసరమైన స్థాయికి చేరుకుంటుంది. ఒక నదికి ఉండే రెండు తీరాల్లా మనలో అంతరాత్మ , భౌతిక శరీరము అనే రెండు భాగాలున్నాయని భగవద్గీత చెబుతుంది. సాధారణంగా మనం మన భౌతిక శరీరం , మన భావోద్వేగాలు , ఆలోచనలు , బాహ్య ప్రపంచంతో గుర్తించబడతాము. శ్రీకృష్ణుడు మనల్ని అన్ని జీవులలో వ్యాపించి ఉన్నది , శాశ్వతమైనది , మార్పులేనిది అయిన మన అంతరాత్మను గుర్...

38. క్రియ, ప్రతిక్రియ

చిత్రం
  మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని శ్రీకృష్ణుడు చెప్పారు. దీనికి అర్థం మనల్ని అకర్మ (పని చేయకపోవడం) వైపు ఆకర్షితులవమని కాదు ; నిష్క్రియాత్మకత లేదా కేవలం పరిస్థితులకు ప్రతిస్పందించే వాళ్ళంగా మారిపోవడం కాదు. శ్రీకృష్ణుడు అకర్మ అనే పదాన్ని ఉపయోగించి నప్పటికీ (దీని యొక్క సాహిత్యపరమైన అర్థం నిష్క్రియాత్మకత) సందర్భపరంగా అది ‘ ప్రతిస్పందన ' ను కూడా సూచిస్తుంది. శ్లోకం 2.47 అవగాహన , కరుణల గురించి మాట్లాడుతుంది ; కర్మ , కర్మఫలాలు వేరు అనే అవగాహన ; మనకు ఇతరుల పట్ల , మన పట్ల కరుణా భావం కలిగి ఉండాలని చెబుతుంది. కర్మ చేయకుండా మన మనుగడే అసాధ్యమని శ్రీకృష్ణుడు చెప్పారు (3.8). భౌతిక శరీర నిర్వహణకు తినడం మొదలైన కర్మలు అవసరం. దానితోపాటు గుణాలు (సత్వ , తమో , రజో) నిరంతరం మనలను కర్మలను చేయడానికి ప్రేరేపిస్తాయి (3.5). అందుచేత అకర్మకు బహుశ ఎక్కడా చోటు లేదు. వార్తలు చదువుతున్నప్పుడు , వింటున్నప్పుడు మనం మన ధోరణులను గమనిస్తే మతం , కులం , జాతీయత మొదలైన మన కృత్రిమ విభజనలు , నమ్మకాల గురించి మనం చూసినప్పుడు , విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఈ కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పన్నమయ్యే అనుకూల ...