పోస్ట్‌లు

అక్టోబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

116. ఆధ్యాత్మికతకు సులభమైన మార్గం

చిత్రం
  ఆధ్యాత్మిక మార్గం గురించి ఒక సాధారణ భావన ఏమిటంటే దానిని అనుసరించడం కష్టతరమైనది. అందువలననే , చిన్న ప్రయత్నాల ద్వారా కర్మయోగంలో పెద్ద లాభాలను పొందగలమని శ్రీకృష్ణుడు ఇంతకుముందు హామీ ఇచ్చారు (2.40). దీనిని మరింత సులభతరం చేస్తూ శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పారు , "ఆహారవిహారాదులయందును , కర్మాచరణముల యందును , జాగ్రత్స్వప్నాదుల యందును , యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యాన యోగము సిద్ధించును" (6.17). యోగము లేదా ఆధ్యాత్మిక మార్గం అంటే ఆకలితో ఉన్నప్పుడు తినడం ; పని చేయడానికి సమయం వచ్చినప్పుడు పని చేయడం ; నిద్రించవలసిన సమయంలో నిద్రపోవడం మరియు అలిసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం అంత సులభం. ఇంతకు మించినది ఏదైనా మనకు మరియు ఇతరులకు మనం చెప్పే కథలు మాత్రమే. వృద్ధుల కంటే శిశువుకు ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. ఆహారానికి సంబంధించి మన అవసరాలు రోజులోని శారీరక శ్రమ ఆధారంగా మారవచ్చు. శ్లోకములో ఉల్లేఖించబడిన ‘యథాయోగ్యము ' అంటే వర్తమానంలో అవగాహనతో జీవించడము అని సూచిస్తుంది. దీనినే అంతకుముందు కర్తవ్య కర్మలు (6.1) లేదా శాస్త్రవిహిత కర్మలు (3.8) గా సూచించబడింది. దీనికి భిన్నంగా మన మెద...

115. ధ్యాన విధానము

చిత్రం
  శ్రీకృష్ణుడు , మీరు మీ స్వంత మిత్రుడు లేదా మీ స్వంత శత్రువు అని చెప్పారు (6.6). మన స్వంత స్నేహితుడిగా మారడానికి ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా (6.8) సుఖ-దుఃఖ భావాల పట్ల (6.7) , బంగారు-రాయి వంటి వస్తువుల పట్ల (6.8) మరియు స్నేహితులు-శత్రువుల వంటి వ్యక్తుల పట్ల (6.9) , సమానత్వ భావముతో ఉండాలని శ్రీకృష్ణుడు సూచించారు. దీనితోపాటు ధ్యాన మార్గమును కూడా అనుసరించవచ్చని శ్రీకృష్ణుడు చెప్పారు (6.10-6.15). శ్రీకృష్ణుడు సౌకర్యాల మీద ఆశ లేకుండా ఏకాంతంగా ఉంటూ (6.10) , అతి తక్కువగా లేదా ఎత్తుగా లేని పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని (6.11) , మనస్సును నియంత్రణలో ఉంచుకొని , వెన్నెముక , మెడను నిటారుగా ఉంచి , చుట్టూ చూడకుండా (6.12-6.13) , నిశ్శబ్దంగా , భయం లేకుండా , ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పారు (6.14). నిరంతరం తన అంతరాత్మతో ఐక్యతను కోరుకోవడం ద్వారా ఒక వ్యక్తి పరమ శాంతిని పొందుతాడని శ్రీకృష్ణుడు చెప్పారు (6.15). ఇంద్రియ , ఇంద్రియ విషయముల సంయోగము తో కలిగే తాకిడి వలన మనకు సమత్వాన్ని సాధించడం కష్టమవుతుంది. అందువలన ఏకాంతం తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనం శారీరకంగా ఒంటరిగా ఉన్నప్పటికీ మనము చేసే పనులను...

114. అతిని విసర్జించాలి

చిత్రం
  శ్రీకృష్ణుడు బంగారం , రాయి మరియు మట్టిని సమదృష్టితో చూడమని చెప్పిన తర్వాత (6.8) , అయన ఈ సమత్వాన్ని గురించి మరింత విస్తారంగా ఇలా చెప్పారు , " సుహృదులయందును , మిత్రులయందును , శత్రువులయందును , ఉదాసీనులయందును , మధ్యస్థుల యందును , ద్వేషింపదగినవారి యందును , బంధువుల యందును , ధర్మాత్ములయందును , పాపులయందును , సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు" (6.9). శ్రీకృష్ణుడు బాహ్య విషయాలను , పరిస్థితులను సమదృష్టితో చూడమని చెప్పారు. ఆ తర్వాత మన జీవితాల్లోని వ్యక్తుల గురించి ఉల్లేఖిస్తూ స్నేహితులు మరియు శత్రువులు ; ధర్మాత్ములు మరియు పాపులు ; అపరిచితులు మరియు బంధువులను సమానంగా పరిగణించమని చెప్పారు. నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను వర్గీకరిస్తామని మరియు వారి పట్ల మన ప్రవర్తన ఈ వర్గీకరణ మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనకు స్నేహితుడు మరొక వ్యక్తికి శత్రువు కావచ్చు ; మన స్నేహితుడు రేపు మనకు శత్రువు కావచ్చు. అంటే ఈ వర్గీకరణలన్నీ సందర్భోచితమైనవి లేదా పక్షపాతంతో ఉంటాయని సూచిస్తుంది. అందువల్ల , ఈ వర్గీకరణలను , విభజనలను వదిలివేసి వాటిని సమతుల...

113. పరిస్థితులను స్వీకరించడం

చిత్రం
  "పరమాత్మ ప్రాప్తిని పొందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు , ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. అతడు మట్టిని , రాతిని , బంగారమును సమానముగా చూచును" అని శ్రీకృష్ణుడు చెప్పారు (6.8). జ్ఞానమంటే తన గురించిన అవగాహన . దానిని సాధించినప్పుడు మనము సంతృప్తి చెందుతాము. విజ్ఞానాన్ని సైన్స్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తువులను , వ్యక్తుల గురించి అర్ధం చేసుకోవాలనే కుతూహలం. ఈ కుతూహలంతో పొందిన సమాధానాలు గతానికి సంబంధించినవి , మరియు పుస్తకాలలో లభించే జ్ఞానం తప్ప మరేమి కాదు. అంతర్గత ప్రయాణం యొక్క ప్రారంభ దశలలో ఈ కుతూహలం మనకు సహాయపడుతుంది కానీ దానికి పరిమితులు ఉంటాయి. కణాలు ( particle) మరియు తరంగాలకు ( waves) సంబంధించిన ద్వంద్వత్వం మరియు అనిశ్చితి సూత్రము (Principle of Uncertainty) వంటి ఈ పరిమితుల గురించి విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది.      మరోవైపు , అస్తిత్వం నిరంతరం పరివర్తన చెందుతూనే ఉంటుంది. పరిస్థితులను సృష్టించి తద్వారా అనుభవాలను మనకు ఇస్తుంది. ఈ   అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఏ మార్గం లేదు ఎందుకంటే ఈ అను...

112. లోనున్న శత్రువు పట్ల అప్రమత్తత వహించండి

చిత్రం
  మనను ఉద్ధరించుకోవడానికి లేదా అధోగతిపాలు ఆవడానికి మనమే కారణం అవుతామని చెప్పిన తర్వాత (6.5) , శ్రీకృష్ణుడు ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ఒక మార్గాన్ని ఇస్తారు. "తనను తాను జయించినవాడు , తనకు తానే మిత్రుడు , కానీ తనను తాను జయింపనివాడు , తనకు తానే శత్రువు" (6.6). తనను తాను జయించుకోవడమే కీలకం. ' ఆత్మ ' అంటే ' స్వయం ' అనే పదం , 6.5 మరియు 6.6 శ్లోకాలలో పన్నెండు సార్లు కనిపిస్తుంది. దాని వలన అనేక వివరణలకు సంభావన కలుగుతుంది. ఒక సాధకుడుకి తరువాత శ్లోకాలలో చెప్పిన వివరణ ' స్వీయ ' ను జయించటానికి సంబంధించిన స్పష్టతను అందిస్తుంది.   శ్రీకృష్ణుడు ఇలా అంటారు , " శీతోష్ణములు , సుఖదుఃఖములు , మానావమానములు మున్నగు ద్వంద్వముల   యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి , స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు” (6.7). పరస్పర భిన్న ధ్రువణాలను అధిగమించాలని అర్థం.    అర్జునుడు అంతకుముందు అనేక యుద్ధాలను గెలిచాడు. ఆ గెలుపు అతనికి సంతోషాన్ని కలిగించింది. కానీ కురుక్షేత్ర యుద్ధంలో ,...