పోస్ట్‌లు

డిసెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

37. అదే అర్జునుడు అదే బాణం

చిత్రం
  ‘ అదే అర్జునుడు అదే బాణం ’ అన్నది ఒక సామెత. విజయవంతమైన , సమర్ధుడైన వ్యక్తి ఎప్పుడన్నా తన కర్మ క్షేత్రములో విఫలమైనప్పుడు ఆ స్థితిని వర్ణించడానికి తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. యోధునిగా అర్జునుడు ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోలేదు. కానీ అతడు జీవితపు చరమాంకంలో కొంతమంది కుటుంబ సభ్యులను బందిపోట్ల సమూహం నుండి రక్షించడానికి చేసిన ఒక చిన్న యుద్ధంలో ఓడిపోయాడు. ఆ స్థితిని తన సోదరుడికి వివరిస్తూ ఇలా అంటాడు , ‘ ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను అదే అర్జునుడిని , ఇవి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచిన అవే బాణాలు . కానీ ఈసారి నా బాణాలు వాటి లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి లేదా వాటి శక్తిని కోల్పోయాయి ’ . అప్పుడు కుటుంబాన్ని కాపాడుకోలేక పారిపోవాల్సి వచ్చిందని ఆయన శోకించాడు. మనలో ఎవరికైనా ఇలా జరగవచ్చునని జీవిత అనుభవాలు చెబుతున్నాయి. చాలా సార్లు ప్రతిభావంతులైన క్రీడాకారులు కొంతకాలం తమ క్రీడా సామర్థ్యాన్ని ( form) కోల్పోతారు. ఒక నటుడు , గాయకుడు విఫలమవుతారు. ఇది అదృష్టం , చెడు సమయం మొదలైన వాటికి ఆపాదించబడుతుంది కానీ అసలు కారణం ఎవరికీ తెలియదు. అనుమానాలు , ఊహాగానాలు తప్ప దీనికి శాస్త్రీయ వివరణ లేదు. ఈ సందర్భంలో కర్మ-కర్...

36. కనిపించేది కర్మఫలం కాకపోవచ్చు

చిత్రం
  ప్రస్తుత క్షణంలో మనం కోరుకునే కర్మఫలాలు మనకు మంచివో కాదో అర్థం చేసుకునేంత తెలివితేటలు , సామర్ధ్యం మనకు సాధారణంగా ఉండవు. విఫలమైన ఒక జంట లాగా , ఒక సమయంలో వారు ప్రేమించుకుని కలిసి ఉండాలని కోరుకుంటారు . కానీ కొంత సమయం తర్వాత వారు విడిపోవాలనుకుంటారు. వాస్తవానికి , నేడు మానవజాతి పశ్చాత్తాప పడటానికి కారణం వారు గతంలో తీవ్రంగా కోరుకున్న కర్మఫలాన్ని పొందిన తరువాత , కాలక్రమేణా అలా దక్కించుకున్న కర్మఫలం వినాశకరమైనదిగా మారడం వల్లనే. అలాగే గతంలో ఏదో ఒక సమయంలో వారు కోరుకున్న కర్మఫలాన్ని పొందకపోవడమే తమకు జరిగిన గొప్ప మేలని చాలామంది అంగీకరిస్తారు. జీవితకాలంలో పొందిన అనుభవాలు భగవద్గీతలోని ప్రఖ్యాత శ్లోకం 2.47 ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలంపై అధికారం లేదని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ అనుభవాలు ఈ శ్లోకాన్ని ' ద్వంద్వం ' మార్గం ద్వారా అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడతాయి. ప్రపంచం ద్వంద్వమైనది అంటే ప్రతి ఒక్క విషయానికి వ్యతిరేక స్థితి కూడా ఉంటుంది. ఇది కర్మఫలానికి కూడా వర్తిస్తుంది. పైన చెప్పిన ఉదాహరణలో , ప్రేమ యొక్క సంతోషం (సుఖం , విజయం ...

35. కర్మయోగమే జీవన మార్గం

చిత్రం
  శ్రీకృష్ణుడు మనకు కర్మ చేసే హక్కు ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని అంటారు (2.47). మన బంధు మిత్రులలో ఎవరికైనా శస్త్రచికిత్స అవసరమైతే నిజాయితీ గల , సమర్థుడైన సర్జన్ కోసం చూస్తాము. అతని యోగ్యత శస్త్రచికిత్స విజయాన్ని నిర్ధారిస్తుంది , అతని నిజాయితీ అనవసరమైన శస్త్రచికిత్సను చేపట్టకుండా ఉండేలా చేస్తుంది. సంక్షిప్తంగా మనము కర్మయోగి అయిన సర్జన్ కోసం వెతుకుతాము. ఈ పరిస్థితి మనకు ఈ శ్లోకాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనకు సేవచేసే వారందరూ కర్మయోగులుగా ఉండాలని , సర్వోత్తమ ఫలితాలను అందించాలని ఆశిస్తాము. సమత్వ సూత్రాన్ని మనకు అన్వయించుకుంటే , మనం కూడా మన దైనందిన జీవితంలో ఇతరులకు సేవ చేస్తూన్నప్పుడు కర్మయోగులమై ఉండాలి. మనం కర్మక్షేత్రములోను , కుటుంబ వ్యవహారాల్లోనూ ఏ బాధ్యత నిర్వహిస్తున్నా కూడా మన వంతు సర్వశ్రేష్ట కృషి చెయ్యాలని ఈ శ్లోకం చెబుతోంది. శ్రీకృష్ణుడు , కర్మయోగ సాధనలో వేసే చిన్న చిన్న అడుగులు మనలను సమత్వానికి దగ్గరగా తీసుకువచ్చి మనలో ఆనందాన్ని కలిగిస్తుందని హామీ ఇస్తున్నారు. మళ్లీ కలుసుకునే అవకాశం లేని వారికి మనం మన అత్యుత్తమ సేవలను అందించగలిగినప్పుడు మనం కర్మయోగిగా మా...

34. కర్మ పై దృష్టి కర్మఫలంపై కాదు.

చిత్రం
  “ మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై అధికారం లేదని” , భగవద్గీతలోని ప్రఖ్యాతమైన శ్లోకం 2.47 లో శ్రీకృష్ణుడు చెప్పారు. కర్మఫలం మన కర్మలకు ప్రేరణగా ఉండకూడదని , అదే సమయంలో మనం అకర్మ వైపు మొగ్గకూడదని కూడా ఆయన చెప్పారు. జీవితంలోని వివిధ కోణాలను , అనుభవాలను ఈ శ్లోకములో చూస్తాము కనుక ఇది భగవద్గీతయందు ఎక్కువగా ప్రస్తావించబడే శ్లోకం. శ్రీకృష్ణుడు శ్రద్ధ అద్భుతాలు చేస్తుందని హామీ ఇస్తారు ( 7.21-7.22). ఈ శ్లోకాన్ని సంగ్రహించడానికి శ్రీకృష్ణుడి మీదే శ్రద్ధ పెట్టి తర్కంలోకి వెళ్లకుండా , దానిని విశ్లేషించడానికి ప్రయత్నించకుండా ఈ బోధనను అమలు చేయడం ప్రారంభించడమే సులభమైన విధానం. ఈ శ్లోకాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా కర్మయోగం యొక్క పరాకాష్టకు మనము చేరుకొనగలము. మన కర్మల యొక్క కర్మఫలంపై దృష్టి కేంద్రీకరించడం వలన మనం కర్మమీద ధ్యాస కోల్పోయేలా చేస్తుంది. దాని ఫలితంగా కర్మఫలం అందకుండా పోతుంది. ఒక విద్యార్థి చేత పేలవంగా చేయబడిన కర్మ (అధ్యయనం) ఎప్పటికీ కోరుకున్న కర్మఫలం (పరీక్షా ఫలితాలు) ఇవ్వదు. మనకు ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా మనకు సాధ్యమైన కృషి చేయడంపై మాత్రమే ధ్యాస పెట్టాలని శ్రీకృష్ణుడు...

33. వేదాలను అధిగమించి అంతరాత్మను పొందడం

చిత్రం
  ఒకసారి ఒక మిత్రబృందం ప్రయాణిస్తూ ఒక పెద్ద నదిని దాటాల్సి వచ్చింది. వారొక పడవను తయారుచేసి నదిని దాటారు. ఆ తర్వాత ఆ పెద్ద పడవ తమకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మిగతా ప్రయాణమంతా దాన్ని మోసుకు వెళ్లాలని అనుకున్నారు. ఇందువల్ల వారి ప్రయాణం నెమ్మదించింది ; ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ నది ఒక బాధాకరమైన ధృవం అనుకుంటే పడవ ఆ ధృవాన్ని అధిగమించేందుకు ఉపయోగపడే పరికరం. కానీ నది లేనిచోట సాగే ప్రయాణములో ఆ పడవే భారంగా మారుతుంది. ఇలాగే మన దైనందిన జీవితాల్లో మనం ఎదుర్కొనే అనేక బాధాకరమైన పరిస్థితుల నుంచి మనకు విముక్తి కలిగించే అనేక పరికరాలు , అనుష్ఠానాలు ఉన్నాయి. ఇటువంటి తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందడం కోసం వేదాలు అనేక అనుష్ఠానాలను వివరించాయి. ఈనాటికీ ఈ ఆచారాలు అందుబాటులో ఉన్నాయి ; ఆచరించబడుతున్నాయి. ఆరోగ్యం , వ్యాపారం , పని , కుటుంబ రంగాలలో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ అనుష్ఠానాల సహాయం తీసికొనడం తార్కికంగా అనిపిస్తుంది. వేదాల బాహ్య అర్థాన్ని వివరిస్తు ఈ జీవితంలో సుఖాన్ని , మరణానంతర స్వర్గాన్ని వాగ్దానం చేసే తెలివితక్కువ వారి మాటలలో చిక్కుకోవద్దని శ్రీకృష్ణుడు ఉపదేశించారు ( 2.42-2.46). శ్రీకృష్ణుడ...

32. మనశ్శాంతికి పునాది

చిత్రం
  కర్మయోగంలో బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుందని , అలా లేని వారి బుద్ధి బహు శాఖలుగా (అనేక భేదాలతో) ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పారు (2.41). శ్రీకృష్ణుడు సమత్వమే యోగమని చెప్పారు (2.48 & 2.38). జీవితంలో మనం ఎదుర్కొనే సుఖం-దుఃఖం , గెలుపు-ఓటమి , లాభం -నష్టం వంటి రెండు ధ్రువాల కలయిక ఇది. కర్మయోగం ఈ ధ్రువాలను అధిగమించే మార్గం. ఇది చివరికి నిశ్చయాత్మక బుద్దిగా మారుతుంది. మరోవైపు సంతులనం లేని బుద్ధి మన మానసిక అశాంతికి కారణం అవుతుంది. సుఖం , విజయం , లాభం పొందినప్పుడు మనశ్శాంతి దానికదే కలుగుతుందని మనం అనుకుంటాము. కాని శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా తీసుకురాబడిన నిశ్చయాత్మక బుద్ధి ద్వంద్వాలను అధిగమించేందుకు సహాయపడి మనకు మనశ్శాంతిని ఇస్తుందని అంటారు. అస్థిరమైన బుద్ధి పరిస్థితులు , ఫలితాలు , వ్యక్తులను విభజించి భిన్నంగా వ్యవహరిస్తుంది. మన కార్యాలయంలో మన క్రింది ఉద్యోగులకు ఒక కొలమానాన్ని , మన పైన ఉండే అధికారులకు మరొక కొలమానాన్ని వర్తింపజేస్తాము. కుటుంబాల్లో విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వివిధ ప్రమాణాలను ఉపయోగిస్తాము. మనకు ఇష్టమైన వారి కోసం ఒక నియమం ఇతరుల కోసం మరొక నియమం పాటించడం చూడడం వలన...