పోస్ట్‌లు

మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

141. శక్తి, పదార్థాల పొందిక

చిత్రం
  శక్తి మరియు పదార్ధాల మధ్య పొందికే జీవితం. సృష్టి పురోగమన క్రమం శక్తితో మొదలై వివిధ దశల్లో భౌతిక పదార్ధాలు ఉద్భవిస్తూ వచ్చాయి. అణువుల యొక్క కలయిక విభిన్న లక్షణాలతో ఉన్న అనేక రకాల పదార్ధాలకు దారితీసింది. ఫలితంగా అనూహ్యమైన , వైవిధ్యభరితమైన ప్రపంచము సృష్టించబడినది. మన భౌతిక శరీరం అటువంటి కోటానుకోట్ల  భౌతిక పదార్ధ రూపాల్లో ఒకటి. ఈ భౌతిక శరీరం తన మనుగడ కోసం ఆహారంపై ఆధారపడుతుంది. ఈ ఆహారమే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. చెట్లకు సూర్యకాంతి యొక్క శక్తిని ఆహారంగా మార్చుకోవటం ఎలాగో తెలుసు. జంతువులు తమ ఉనికి కోసం వృక్షాలు తయారు చేసే ఆహారంపై ఆధారపడతాయి. స్థూలంగా చూస్తే ఈ సృష్టి అంతా పదార్థము మరియు శక్తి మధ్య పొందికే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడో అధ్యాయంలో 29 , 30 శ్లోకాల్లో ఉపయోగించే బ్రహ్మ , కర్మ , అధ్యాత్మ , అధిదైవం , అధిభూతం , అధియజ్ఞం వంటి పదాలకు అర్థం తెలుసుకోవడానికి పై వివరణ సహాయ పడుతుంది. వీటి గురించి అర్జునుడు తెలుసుకోగోరతాడు (8.1 & 8.2 శ్లోకాలు). అర్జునుడికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ‘‘కాలముతోపాటు నాశనం అయ్యేది అధిభూతం , పురము అంటే శరీరములో శక్తి రూపములో ఉండే పు...

140. కర్మ అంటే ఏమిటి

చిత్రం
  ' కర్మ అంటే ఏమిటి ' అనేది అర్జునుడి తదుపరి ప్రశ్న. ఇది ఒక వ్యక్తి తనను ఆశ్రయించడం ద్వారా విముక్తి కోసం ప్రయత్నించినప్పుడు ‘ అఖిలం-కర్మ ’ (కర్మ , అకర్మ మరియు వికర్మ యొక్క అన్ని అంశాలు) తెలుసుకుంటాడన్న శ్రీకృష్ణుడి హామీకి ప్రతిస్పందనగా అడిగిన ప్రశ్న ( 7.29). " సృష్టికి కారణమైన విశ్వశక్తి యొక్క త్యాగము లేదా వేరు అవ్వడానికి (భూత-భావ-ఉద్భవ-కరో విసర్గః) కర్మ అంటారు" అని శ్రీకృష్ణుడు సమాధానమిస్తారు ( 8.3). ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటం కష్టతరమైనది. దీన్ని వివరించేందుకు చేసే ప్రయత్నాలు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్నించేవారికి మరిన్ని సంక్లిష్టతలు తెచ్చిపెట్టె అవకాశము ఉంది. కర్మ అంటే గొప్ప పని అనీ , సృష్టి అనీ , యజ్ఞం అని సాధారణంగా చెప్తుంటారు. కానీ కర్మ అంటే శ్రీకృష్ణుడు చెప్పిన నిర్వచనాన్ని , అర్థాన్నీ ఈ అవగాహన సంపూర్ణంగా గ్రహించలేదు. ' కర్మ ' కు సంబంధించి శ్రీకృష్ణుడి సమాధానం ' అస్తిత్వం ' స్థాయిలో ఉండగా , మనం దానిని ' చేయడం ' స్థాయిలో అర్థం చేసుకుంటాము. అందుకే ' మనం చేసేది ' ' కర్మ ' అనే మన అవగాహనతో కర్మను అర్ధం చేసుకోలేము ఎంద...

139. బ్రహ్మ యొక్క అవస్థ

చిత్రం
  నన్ను ఆశ్రయించి విముక్తి కోసం నిరంతరం ప్రయత్నం చేసిన వాడే బ్రహ్మమును దర్శించగలుగుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు (7.29). ఆ మాట విన్న అర్జనుడు బ్రహ్మ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తాడు (8.1). అక్షరము , (శాశ్వతమైనది , ధ్వంసం చేయబడనిది , నాశనం కానిది) పరమమూ అయినది బ్రహ్మము (8.3) అని శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానమిచ్చారు. అంటే దీనికి మించి మరేమీ లేదని , ఏ బాహ్య కారకాలపైనా ఆధారపడనిదని అర్థం. మనం నిరంతరం మారుతూ ఉండేది , నాశనమయ్యేది , అశాశ్వతమైనవి మాత్రమే చూస్తూ ఉంటాము. అందువలన బ్రహ్మమును అర్ధము చేసుకొనుట కష్టతరం అవుతుంది. ఉదాహరణకు , మన భౌతిక శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. మన శరీరంలో 95 శాతం మనకు తెలీకుండానే ఏడేళ్లల్లో మారిపోతుంది. కానీ మన జన్యు నిర్మాణం ( DNA) మాత్రం యథాతథంగా ఉంటుంది. సౌర వ్యవస్థ నాలుగు బిలియన్ల సంవత్సరాల్లో నాశనం అవుతుంది , విశ్వం కూడా 150 ట్రిలియన్ సంవత్సరాల్లో నాశనం అవుతుంది. అదేవిధంగా మన ఆలోచనలు కూడా నిరతరం మారుతూ ఉంటాయి. వ్యక్తులు , వస్తువులు , విషయాలు , పరిస్థితులు వంటి వాటి గురించి మన అభిప్రాయాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. ఐదుగురు గుడ్డి వాళ్లు ఏనుగును ఎలా భిన...