106. సంతోషపు కళ్లాలు
ఒకసారి మధ్య ఆసియా నుంచి ఒక ఆక్రమణదారుడు వచ్చి ఢిల్లీని ఆక్రమించుకుని విజయోత్సవము జరపాలనుకున్నాడు. అందుకు గాను ఒక ఏనుగుని అలంకరించి సిద్ధం చేశారు. దాన్ని అధిరోహించగానే ఏనుగు కళ్లాలు తనకు ఇవ్వమని అతడు అడిగాడు. ఏనుగును మావటి తన అంకుశం ద్వారా నియంత్రిస్తారని తెలుసుకోగానే అతను క్రిందికి దూకి తన గుర్రాన్ని పిలిపించుకొని కళ్లాలు తన చేతిలో లేని దాన్ని తాను అధిరోహించనని అన్నాడు. అలాగే మన సంతోషము , భావోద్వేగాల యొక్క కళ్లాలు మన చేతుల్లో ఉన్నాయా లేక ఇతరుల చేతుల్లో ఉన్నాయా అని మనం ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. వీటి కళ్లాలు మన వద్దే ఉన్నాయని మనం భావిస్తాము కానీ నిజానికి ఈ కళ్లాలు తరచుగా ఇతరుల చేతుల్లో ఉంటాయి. అది ఒక స్నేహితుడు కావచ్చు ; కుటుంబంలో ఎవరైనా కావచ్చు ; సహోద్యోగి కావచ్చు ; వారి మనస్థితి , భావాలు , మాటలు , పొగడ్తలు , విమర్శలు మనల్ని సంతోషానికి లేక బాధకు గురిచేస్తాయి. వీటిలో ఆహారం , పానీయాల వంటి వస్తువులు ; భౌతిక సంపదలు ; అనుకూల , ప్రతికూలమైన పరిస్థితులు ; చివరికి మన గతం , భవిష్యత్తు కూడా ఉండవచ్చు. “ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకోగల సాధకుడ...