పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

135. యోగ మాయ

చిత్రం
  తన సాధారణ స్వభావం (అపరా ప్రకృతి) వ్యక్తీకరించబడుతుంది , అత్యున్నత స్వభావం (పరా ప్రకృతి) జీవన తత్త్వము అయిన అవ్యక్త రూపం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. త్రిగుణాల కారణంగా జనించే యోగ మాయ ఈ పరా ప్రకృతిని , అపరా ప్రకృతిని వేరు చేస్తుంది. దీని వలన జనన మరణాలు లేని వాడిగా (7.25) , భూత భవిష్యత్‌ వర్తమాన  కాలాల గురించి అవగాహన కలిగిన ఆ పరమాత్మను గురించి మనము తెలుసుకో లేకపోతున్నామని (7.26) శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. యోగ మాయ అద్దాలతో పూర్తిగా నిండిన గదిలాంటిది. ఎటు తిరిగి చూసినా మనమే కనిపిస్తాము. ఆ అద్దాల వెనక ఏముందో తెలుసుకోవటం అసాధ్యమవుతుంది. ఈ అసమర్ధత కారణంగా ప్రతి ఒక్కరి వెనకా ఉన్న జీవన తత్త్వాన్ని గుర్తించలేకపోతాము . ఇటువంటి అవగాహన మూర్ఖపు అవగాహన అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (7.24). ఇది దానవుల మార్గం , పరమాత్మ పట్ల నిర్లక్ష్యంతో మనిషి-మనిషి మధ్య పరస్పర చర్య తప్ప మరొకటి కాదు (7.15). అధిక వోల్టేజీ దశ నుండి తక్కువ వోల్టేజీ దశకు విద్యుత్తు ప్రయాణిస్తూ   మార్గమధ్యంలో అనేక సాధనాలకు శక్తినిస్తుంది , కాంతివంతం చేస్తుంది. పరమాత్మను అనంతమైన వోల్టేజ్ బిందువుగా తీసుకుంటే ఈ ...

134. తనతో తన పోటీ

చిత్రం
  తనను కొలిచే వారిలో నాలుగు రకాల భక్తులు ఉంటారని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. తమ కష్టాలు తొలగించాలని ప్రార్ధించేవారు (ఆర్తులు) , సుఖసంపదులను చేకూర్చమని ప్రార్ధించేవారు (అర్థార్ధులు) , జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించేవారు (జిజ్ఞాషులు) , జ్ఞానులు (7.16). ఇక్కడ జ్ఞానిని గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు తదేక ధ్యానంలో నిమగ్నమైన నిత్యయుక్తుడైన జ్ఞాని ఈ భక్తులందిరిలో శ్రేష్ఠుడు అని చెప్పారు. అటువంటి జ్ఞానులు తనకు ప్రియమైనవారని , వారికి నేను ప్రియమైనవాడినని చెబుతారు (7.17). అనేక జన్మల చివరిలో అటువంటి వ్యక్తి జ్ఞానాన్ని పొంది నన్ను చేరుకుంటాడు (7.19) అని చెప్పారు. ' అనేక జన్మలు ' అనగా మనం జ్ఞానిగా మారడానికి అనేక జన్మలు ఎత్తాలని సాధారణంగా భావిస్తాము. అయితే దీనికి కారణం ఏమీ లేదు. మన భౌతిక శరీరం యొక్క జన్మకు పరిమితము కాకుండా ' జన్మ ' ని సాధారణ పదంగా తీసుకోవడం ద్వారా మరింత స్పష్టత వస్తుంది. ఈ జన్మ మన చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క ' జన్మ ' కావచ్చు. ఇది నిరంతర ప్రక్రియ . ఇవి అనుకూలమైనవి లేదా బాధాకరమైన పరిస్థితులు కావచ్చు . కానీ అవన్నీ మనకు బోధించగల , నేర్పించగల సామర్థ్యాన్ని...

133. శ్రద్ధ వరదాయిని

చిత్రం
  వ్యక్తము (మనుషుడు) , అవ్యక్తము (పరమాత్ముడు) మధ్య ఉన్న సమన్వయమే అస్తిత్వానికి మూలం. పరమాత్ముడిని మరిచిపోయి మనిషికి మనిషికి మధ్య జరిగే సంపర్కాలు దానవ లక్షణాలని శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తు చేస్తున్నారు (7.15). తదుపరి స్థాయి మనిషికి - పరమాత్మకు మధ్య జరిగే సంపర్కం , ఏర్పడే సంబంధం. మనిషి ఎండమావుల వెంట పరుగెత్తి అలసిపోయినప్పుడు లేదా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు పరమాత్మను గుర్తు చేసుకుంటాడు. మనిషికి భగవంతునికి మధ్య ఏర్పడే సంబంధాలు అంటే మనిషి భగవంతుని కొలిచే మార్గాలు నాలుగని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. స్థూలంగా భక్తులు నాలుగు రకాలు. మొదటి రకం భక్తులు తమకున్న కష్టాలు తొలగిపోతే చాలని అనుకుంటారు. రెండో రకం భక్తులు సంపాదన ద్వారానో లేదా విజయాల ద్వారానో మానసిక ప్రశాంతతను పొందాలని కోరుకుంటారు. మూడో రకం భక్తులు జ్ఞానాన్ని పెంచుకోవాలని ఆశిస్తారు. నాల్గో రకం భక్తులు జ్ఞానులు (7.16). అజ్ఞానులైన మొదటి మూడు రకాల భక్తులూ తమ కోరికలు నెరవేర్చుకోవటానికి వేర్వేరు దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రార్థిస్తారు (7.20). రోగ నివారణకు గాను వచ్చిన రోగానికి అనుగుణంగా సంబంధిత వైద్యుడిని సంప్రది...

132. దుర్గతి దుర్గతిని తెస్తుంది

చిత్రం
  మూడు గుణాలకు అతీతమైన జీవన తత్త్వమే తన పరా ప్రకృతి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించారు. అపరా ప్రకృతి అనేది అగ్ని , భూమి , నీరు , వాయువు , ఆకాశము , మనస్సు , బుద్ధి మరియు అహంకారమనే ఎనిమిది విధముల కలిగి ఉంది . ఇవన్నీ  గుణాల ప్రభావానికి లోబడి పని చేస్తాయనీ గుర్తుచేస్తున్నారు. పరా ప్రకృతి అవ్యక్తమైనది , శాశ్వతమైనది , నాశనము లేనిది , కొలవలేనిది అయితే అపరా ప్రకృతి పరిమిత మోతాదులో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. సులభంగా అర్థం చేసుకోవడానికి , మనిషిని వ్యక్తముగా మరియు ఇంద్రియాలకు అతీతుడైన పరమాత్మని అవ్యక్తముగా తీసుకోవచ్చు. పరస్పర చర్య యొక్క మొదటి స్థాయి మనిషికి - మనిషికి మధ్య ఉంటుంది . ఇది వ్యక్తంతో మన గుర్తింపు యొక్క ఫలితం. తదుపరి స్థాయిలో మనిషికి పరమాత్మకి మధ్య ఉండే పరస్పర సంబంధం అని గుర్తించాలి. మనిషి - మనిషి స్థాయిలో వస్తువులు , వనరులు ఒక చెరువులో నీటి వలె పరిమితముగా ఉంటాయి . అయితే పరమాత్మ స్థాయిలో వనరులు , సౌకర్యాలు సముద్రంలో నీరు లాగా అనంతముగా ఉంటాయి. విభజించడానికి , పోల్చడానికి శిక్షణ పొందిన మనస్సు సిరిసంపదులు , అధికారం , పేరు ప్రతిష్టల విషయాలలో మన వద్ద ఉన్నవాటిని , ఇతరులకు ఉ...