144. మనస్సు, హృదయము
శ్రీకృష్ణుడు అర్జునుడిని గమనిస్తు సాగించే సంభాషణే భగవద్గీత. తన కర్తవ్యం అయిన కురుక్షేత్ర యుద్ధాన్ని చేయడానికి సిద్ధముగా లేని అర్జునుడు అన్ని వేళలా పరమాత్ముని స్మరణ చేస్తూ యుద్ధం చేయమని (8.7) శ్రీకృష్ణుడు బోధించినప్పుడు అర్జునుడి మనస్సులో వెల్లువెత్తిన సందేహాలను ఆయన గుర్తించారు. చేతిలో ఉన్న పని పూర్తి చేయటానికి ఎదరయ్యే ప్రతిఘటన నేటికీ మనలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురించి వివరిస్తూ తాను "సర్వజ్ఞుడు , సనాతనుడు , అందరిని శాసించు వాడు , అణువు కంటేను సూక్ష్మమైనవాడు , అందరిని పోషించువాడు , అచింత్య రూపుడు , సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడు , అజ్ఞానాంధకారమును పారద్రోలువాడైన పరమేశ్వరుడు" అని చెప్పారు (8.9). ఈ అస్థిత్వము తనను తాను వివరించటానికి పూనుకున్నప్పుడు పదాలు సరిపోవు. తనను స్మరించుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు మార్గాలున్నాయని చెప్తున్నారు. మొదటిది అవగాహనతో కూడిన మార్గం. "యోగము ద్వారా స్థిరచిత్తం సాధించి పరమాత్మయందు ధ్యానం నిలిపిన వాడు సర్వ శక్తివంతుడైన ఆ పరమాత్మను చేరుకోగలడు’’ అని అవగాహన మార్గము గురించి చెప్పారు (8.8). ఇంద్రియాల ద్వారా స్వీకర...