పోస్ట్‌లు

మార్చి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

108. కోపాన్ని అధిగమించడం

చిత్రం
“ కామ క్రోధరహితులకు , చిత్తవృత్తుల జయించినవారికి , పరబ్రహ్మయైన పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు ( 5.26). కోరికలు నుంచి , కోపము నుంచి ఎలా స్వేచ్ఛను పొందడం అనే ప్రశ్న ఉదయించడం సహజం . ప్రతి తుఫాను యొక్క కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు , కోపం అనే తుఫాన్ కి కూడా ఒక కోరికలు లేని , క్రోధము లేని కేంద్రం మనలోనే ఉంటుంది. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షం. ఈ ప్రక్రియలో కోరికలకు మూల కారణమైన ' నేను ' అనే భావనను త్యజించడానికి ఎంతో ధైర్యం కావాలి. రోజువారి జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి రెండు సులభ పద్ధతులను పాటించవచ్చు. ఈ ప్రక్రియలో గతంలో మనం కోరికతో నిండిన అవస్థను గాని , కోపం తెప్పించిన ఒక పరిస్థితిని గాని మళ్ళీ గుర్తు తెచ్చుకుని సాక్షిగా గమనిస్తూ ఆ పరిస్థితుల్లో కృత్రిమంగా తిరిగి జీవించడమే. ‘ అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినా ప్రతి ఒక్కరూ అదే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు ’ అన్న మెరుగైన అవగాహనతో దీన్ని పునరావృతం చేయాలి. భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని ' లీల ' అ...

107. పరమానందం కోసం ధ్యానం

చిత్రం
బఠానీ గింజ పరిమాణములో ,  శంకు ఆకారంలో ఉండే పీనియల్ గ్రంథి మెదడు యొక్క కేంద్రంలో సరిగ్గా రెండు కనుబొమల మధ్యన ఉంటుంది. శారీరకంగా ఇది మెలటోనిన్ , సెరటోనిన్ అనే నాడీ ప్రసారకాలను ( neurotransmitters) ఉత్పత్తి చేసి మన నిద్రకు , భావోద్వేగాలకు కారణమవుతుంది. దీనిలో మామూలు కంటిలాగే కాంతి గ్రాహకాలు ( photo receptors) ఉంటాయి కనుక దీనిని ' మూడవ కన్ను ' అంటారు. ఇది ఆత్మకు పీఠమని , ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి కారణమని ; పంచేంద్రియాలకు అందని భావనను అందుకోగలిగే ఆరో ఇంద్రియమని ; ఆధ్యాత్మిక జాగృతికి సంకేతమని ; భౌతిక , ఆధ్యాత్మిక జగతికి మధ్య సంధానమని అనేక సంస్కృతులు దాన్ని అనేక విధాలుగా వర్ణించాయి. భారతీయ పరిభాషలో కనుబొమల మధ్య ఉండే ప్రదేశాన్ని ' ఆజ్ఞా చక్రం ' అంటారు. ఇది పీనియల్ గ్రంథి ఉండే స్థానాన్ని సూచిస్తుంది. ఇంద్రియాలు , మనస్సును అదుపులో పెట్టేమార్గంలో శ్రీకృష్ణుడి విధానాన్ని అర్థం చేసుకోవడానికి పై వివరణ మనకు ఉపకరిస్తుంది. “బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలె...