పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

89. స్వీయ ముక్తిని పొందడం

చిత్రం
  అనాసక్తి , వీతరాగం వంటి కొన్ని పదాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి , విరక్తి రెండు ధ్రువాలు అయితే అనాసక్తి ఈ ధ్రువాలను అధిగమించడం. అదేవిధంగా వీతరాగం అనేది రాగం లేదా విరాగం కాదు ; రెండింటినీ అధిగమించడం. ఈ ధ్రువణాలు అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు. ' అహం ' ఒకసారి మాయమైనప్పుడు ఆ వ్యక్తి అన్ని ధ్రువాలను అధిగమిస్తాడు. ఈ దశనే మనము ముక్తి , మోక్షము అనే పేర్లతో పిలుస్తాము. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ ఆసక్తి , దేహాభిమానము మమకారము ఏమాత్రం లేనివాడును , జ్ఞానంలో స్థిరపడిన వాడును , కేవలం యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అయిన మనుషుని కర్మలన్నియును పూర్తిగా విలీనమగును” (4.23). ' అహం ' అనేది మన సంపదలు , ఆస్తులతో గుర్తింపు , స్నేహితులు , శత్రువులు ; ఇష్టాలు , అయిష్టాలు ; ఆలోచనలు , భావాలతో గుర్తింపు. వాటిని వదిలివేయడం వల్ల బాధ , భయం , ఆగ్రహానికి దారితీసే తాత్కాలిక శూన్యత ఏర్పడుతుంది. కాబట్టి ' అహం ' ను వదిలివేయడం అంత తేలికైన పని కాదు. గుర్తింపదగిన విషయం ఏమిటంటే యాజమాన్యం , గుర్తింపు , కర్తృత్వం యొక్క ఆలోచనను , భావాలను వదిలివేయాల్సిన అవసరమే ...

88. పాపం యొక్క కోణాలు

చిత్రం
  వికర్మ (నిషిద్ధ కర్మ) లేదా పాపం అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో ఉండి యుద్ధంలో బంధువులను చంపడం ద్వారా పాపం కలుగుతుందని భావిస్తాడు (1.36). వేరువేరు నాగరికతలు , సంస్కృతులు విభిన్న కర్మలను పాపాలుగా  నిర్వచించాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూ వచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమ శిక్షాస్మృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలు లేదా పాపాలుగా నిర్దేశిస్తాయి. ఆ పనులకు పాల్పడినప్పుడు శిక్షిస్తాయి. అటువంటి నిషేధించిన కర్మలు మనం చేసినప్పుడు అపరాధం , పశ్చాత్తాపం , అవమాన భారంతో మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ అంతః కరణమును , శరీరేంద్రియములను జయించినవాడు , సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు , ఆశారహితుడైన యోగి కేవలం శారీరిక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు (4.21).” శ్రీకృష్ణుడు అంతకుముందు పాపం గురించి మాట్లాడుతూ అర్జునుడితో ఇలా చెప్పారు , “ జయాపజయములను , లాభనష్టములను , సుఖదుఃఖాలను సమానంగా భావించి , యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు” (2.38). పాపాన్ని మూల్యాంకనం చేయడంలో అర్థం చేసుకోవలసిన సూక్ష్...

87. నిత్యతృప్తి

చిత్రం
  ఆకలితో ఉన్న నక్క పైన వేలాడుతున్న ద్రాక్ష కోసం ప్రయత్నించి , విఫలమై అందని ద్రాక్ష పుల్లగా ఉంటుందని భావించింది. ఈ సుపరిచితమైన కథ మనము జీవితంలో అనుభవించే నిరాశ , అసంతృప్తి , ఆనందాల గురించి అనేక అంశాలను ప్రస్తుతిస్తుంది. సమకాలీన మనస్తత్వ శాస్త్రం క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మానవ మెదడు యొక్క విధుల్లో ఒకటైన ' ఆనందాన్ని సంశ్లేషణ చేయడం ' గురించి మాట్లాడుతుంది. ద్రాక్ష పుల్లగా ఉంటుందని తనని తాను తృప్తి పరచుకుని ముందుకు సాగుతూ నక్క కృత్రిమ ఆనందాన్ని సృష్టించుకుంది. తృప్తి గురించి వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు ' సృష్టించుకున్న ఆనందాన్ని ' అధిగమించాలని ఇలా చెప్పారు , " సమస్త కర్మలయందును , వాటి ఫలితములు యందును సర్వదా ఆసక్తిని వీడి , సంసార-ఆశ్రయ రహితుడై , నిత్యతృప్తుడైన పురుషుడు , కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికినీ వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు” (4.20). స్వయంతృప్తి అనేది భగవద్గీతలోని మూలోపదేశాలలో ఒకటి. చాలా సందర్భాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మవానుడు అవ్వమని , ఆత్మతృప్తితో ఉండమని సలహా ఇస్తారు. ఇది మన అంతరాత్మతో సంతృప్తి చెందడం తప్ప మరేదీ కాదు. ఆత్మవ...

86. కామం, సంకల్పం రెండింటినీ త్యజించాలి

చిత్రం
ప్రతి ఒక్క నాగరికతలోనూ సమాజ శాంతి , సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా , మరికొన్నింటిని చేయకూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు శిక్షార్హమైన నేరాలుగా మారాయి. న్యాయశాస్త్రం ప్రకారం ' ఉద్దేశం ', ' అమలు ' రెండిటి మీదా ఆధారపడి నేరనిర్ధారణ జరుగుతుంది. ' ఉద్దేశం ' అనేది నేరం చేయాలనే ఆలోచన అయితే అమలు అనేది తప్పుడుపని చెయ్యడం. ఏ వ్యక్తినైనా దోషిగా నిరూపించడానికి ఈ రెండు భాగాల రుజువు అవసరం. ఉద్దేశాన్ని సంకల్పంగా , అమలును కామంగా గుర్తిస్తే శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. “ఎవని కర్మలన్నియును , శాస్త్ర సమ్మతములై , కామసంకల్పవర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4. 19). సాధారణంగా సమాజంలో ఎవరైనా నేరపూరిత ఉద్దేశ్యంతో తిరుగుతున్నప్పటికీ నేరం చేయనంత వరకు ఏ విధమైన సమస్య ఉండదు. కానీ మనం ఉద్దేశ్యాన్ని వదిలి వేయడంతో పాటే సంకల్పాన్ని కూడా వదులుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పారు. చట్టం పట్ల భయం , ధనము మొదలైన వనరుల కొరత లేదా తమ...

85. కర్మ, అకర్మ మరియు వికర్మ

చిత్రం
' చేసిన పని-విస్మరించిన పని ' (Acts of commission and omission) అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలము అయితే అది దుర్ఘటనకు దారితీస్తుంది. ఈ ' విస్మరించటం ' లేదా అకర్మ (క్రియ చేయకపోవడం) దుర్ఘటన అనే కర్మకి దారి తీస్తుంది. ఉదాహరణకు ఏదైనా చర్య చేస్తున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న విభిన్న సాధ్య-అసాధ్యాల నుండి మనం ఒకదాన్ని ఎంచుకుంటాము. మనం ఈ సంభావనలలో ఒకదానిని అమలు చేసినప్పుడు మిగిలిన అన్ని సంభావనలు మనకు అకర్మగా మారతాయి. ప్రతి కర్మలోనూ అకర్మ దాగి ఉంది అనే నిర్ధారణకు ఇది దారి తీస్తుంది. “ కర్మయందు అకర్మను , అకర్మలో కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి , సమస్త కర్మలు చేయువాడు ( 4.18)” అనే శ్రీకృష్ణుడి క్లిష్టమైన బోధనను అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి. " కర్మ అనగానేమి ? అకర్మ అనగానేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు ; తికమక పడుచున్నారు” కనుక ఈ విషయం క్లిష్టమైనది అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నారు ( 4.16). " కర్మ తత్త్వమును తెలుసుకొనవలెను. అట్లే ...

84. ముముక్షువుల ఆచరణ

చిత్రం
“ నాకు కర్మఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మబద్దులు కారు ” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 4.14). ' కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు ' అనే శ్రీకృష్ణుడి బోధనలను ఇది గుర్తు చేస్తుంది ( 2.47) . పరమాత్మగా ఆయన కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించారు ( 4.13). " అర్జునా! ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్త్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము” అని శ్రీకృష్ణుడు వివరించారు ( 4.15). మన జీవితంలో కర్మఫలాన్ని పొందేందుకే మనం కర్మలను చేస్తాము. అయితే కర్మఫలాన్ని వదులుకోమని చెప్పినప్పుడు మనం కర్మలను చెయ్యడం మానేస్తాము. శ్రీకృష్ణుడు ఇక్కడ పరిత్యాగానికి పూర్తిగా భిన్నమైన అర్ధాన్ని , మార్గాన్ని వెల్లడించారు. కర్మఫలం , కర్తృత్వం రెండింటితో అనుబంధాన్ని వదిలివేసి మనల్ని కర్మలు చేస్తూనే ఉండమని సలహా ఇచ్చారు. అర్జునుడి లాంటి వీరుడికి ఒక కర్మ మాత్రమే అయిన యుద్ధాన్ని చేయమని  శ్రీ...

83. అసత్యం సత్యం మీదే ఆధారపడుతుంది

చిత్రం
      మనకు తెలిసిన ప్రపంచంలో సత్యం , అసత్యం రెండింటినీ చూస్తూ ఉంటాము. అసత్యము అనేది మన పరిస్థితుల వల్ల లేదా మన ఇంద్రియాలు , మనస్సు యొక్క పరిమితుల వల్ల సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప మరొకటి కాదని నిశిత పరిశీలన ద్వారా తెలుస్తుంది. సుప్రసిద్ధమైన తాడు , పాము ఉదాహరణలో తాడు సత్యం. పాము సత్యమైన తాడు మీద ఆధారపడిన అసత్యం. కానీ సత్యమైన తాడును గ్రహించే వరకు మన ఆలోచనలు , చర్యలన్నీ అసత్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి అసత్యాలు సమాజంలో తరతరాలుగా కొనసాగుతూ ఉంటాయి. ఏదైనా సాంకేతికత పరిజ్ఞానాన్ని సత్యంగా పరిగణించినట్లయితే దాని దుర్వినియోగమే అసత్యం. లౌడ్ స్పీకర్ ను మంచిని ప్రచారం చేయడానికి , అమాయకులను మోసపూరితంగా హింసకు ప్రేరేపించడానికి కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా నేటి సోషల్ మీడియా అనేది సత్యమైతే దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అది అసత్యం అవుతుంది. “నేను గుణ కర్మలను అనుసరించి నాలుగు వర్ణాలను సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైననూ , శాశ్వతుడను , పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా ' అకర్త ' గా తెలుసుకొనుము” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.13). అటువంటి విభజన గ...