పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

111. మనతో మన స్నేహం

చిత్రం
  "మనుజులు ఈ సంసారసాగరమునుండి తమను తామే ఉద్ధరించుకోనవలెను. తమకుతామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు , తమకు తామే శత్రువులు” (6.5) అని శ్రీకృష్ణుడు అంటారు. స్నేహం లాగే ఈ అస్తిత్వగత శ్లోకానికి విభిన్న వ్యాఖ్యానాలు సంభవం అవుతాయి. మొదటిది , ఇది ప్రతి వ్యక్తికి తమను తాము ఉద్ధరించుకొనే బాధ్యత వారి మీదే ఉందని చెబుతుంది. కుటుంబం , స్నేహితులు , సహోద్యోగులు , పరిస్థితులు , దేశం మొదలైన వారిని మన వైఫల్యానికి నిందించే ధోరణి మన అందరికి ఉంటుంది. అదేవిధంగా కర్మలు నుండి ఆశించిన కర్మఫలం పొందనప్పుడు లేదా చెడుగా చిహ్నించబడ్డ కర్మలు చేసినప్పుడు మనము మనల్ని నిందించుకుంటూ ఉంటాము. ఫలితంగా జీవితాంతం ఇతరులపై కక్ష తీర్చుకోవడంలో నిమగ్నమై ఉంటాము లేదా మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము. పరిస్థితులు ఏమైనప్పటికీ ఈ శ్లోకం మనల్ని మనం ఉద్ధరించుకోవాలని చెబుతుంది. సాష్టాంగ ప్రణామం , ప్రశ్నించడం మరియు సేవ అనే మూడు గుణాలను మనం పెంపొందించుకున్నప్పుడు గురువు మనకు సహాయం చేస్తారని శ్రీకృష్ణుడు అంతకుముందు హామీ ఇచ్చియున్నారు (3.34). రెండవది , ఇది మన పరిపక్వత , అపరిపక్వతలను స్వీకరించి మన పశ్చాతా...

110. నిష్కామ భావముతో కర్మలను చేయడం

చిత్రం
  "సన్యాసమని పిలవబడినదియే , యోగమని   తెలుసుకో , ఎందుకంటే సంకల్ప త్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు (6.2)" అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇదే విషయం 4.19 శ్లోకంలో , ఒక సన్యాసి యొక్క జీవనం కామం మరియు సంకల్పం నుండి విముక్తమని చెప్పబడింది (కామసంకల్ప వర్జితాః). "యొగారుఢ స్థితిని పొందాలనే కోరికగల మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన   పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము (6.3).   ఇంద్రియభోగములయందును , కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్ప - ములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును" (6.4) అని శ్రీకృష్ణుడు చెప్పారు. కర్మఫలాన్ని ఆశించడం వలన మనకు కర్మ చెయ్యాలన్న సంకల్పం కలుగుతుంది , లేకపోతే కర్మ చేయాల్సిన అవసరం లేదు కదా అని మనము భావిస్తాము. గమనించవలసిన విషయం ఏమిటంటే , మనకు ఏదైనా విషయము గురించి తెలియకపోయినా లేదా దాని గురించి అనుభవం లేకపోయినా , ఆ విషయం సంభవం కాదు అని భ్రమించరాదు. ఈ మార్గంలో మొదటి అడుగు మన గత కర్మల యొక్క అనుభవాలను విశ్లేషించడం. సుఖదాయకమైన కర్మఫలాలను ఆశించి చేయబడిన కర్మలలో   ఎక్కువ కర్మలు దుఃఖాన్న...

109. కర్మఫలాలను త్యజించినవాడే సన్యాసి

చిత్రం
  జీవితంలో మనము అనేక సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము. కష్టాలను ఎదురుకున్నప్పుడు మనము నిరాశ చెంది కర్మలను త్యజించడం వైపు ఆకర్షితులవడం సహజం ఎందుకంటే మన కర్మలతో పాటు ఇతరుల కర్మలు మనకు సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలిగిస్తాయనే భ్రమలో ఉంటాము. అర్జునుడు కూడా అదే సందిగ్ధావస్థ వలన యుద్ధం అనే కర్మను త్యజించాలనుకుంటున్నాడు. "కర్మఫలమును      ఆశ్రయింపక కర్తవ్యకర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి , నిజమైన యోగి. కాని కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు , యోగియు కాడు" అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశారు (6.1). కర్తవ్య కర్మ అంటే చేయదగిన కర్మ . దానిని గురించి ఎంత ఎక్కువ వివరణ ఇస్తే అది మరింత సందిగ్ధాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది అనుభవాత్మకమైనది. ఈదడం నేర్చుకోవాలంటే నీటిలోకి దూకాలి. అదేవిధంగా , కర్తవ్య కర్మలను అర్థం చేసుకోవడానికి జీవిత అనుభవాలు మనకు సహాయ పడతాయి. ఇంద్రియాల సహాయం లేకుండా ఆనందంగా ఉండటమే ఈ మార్గములో మన పురోగతిని కొలవడానికి కొలమానం. విత్తనం యొక్క టెంక యొక్క కర్తవ్య కర్మ ఏమిటంటే లోపల ఉన్న పిండాన్ని కాపాడాలి కానీ అనుకూల పరిస్థితులలో అంకురోత్పత్తికి (మొ...