పోస్ట్‌లు

డిసెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

124. కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

చిత్రం
  మనం జీవించే విధానం ఏదైనా గాని ఏకత్వములో స్థాపించుకొనడము ద్వారానే పరమానందాన్ని పొందగలమని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (6.3 1 ). ఏకత్వాన్ని సాధించడానికి మనం చేసే ప్రయత్నాల్లో ప్రధానంగా మూడు రకాలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏకత్వాన్ని భిన్న సంస్కృతులు వేర్వేరు పేర్లతో పిలుస్తాయి. తరచూ ఆయా సంస్కృతుల బోధనలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు ఉండి ఈ సమస్యను మరింత జఠిలం చేస్తాయి. రెండవది , మన మనస్సు విభజించడానికి శిక్షణ పొందింది. ఈ విభజన తత్త్వము మనను ఏకత్వాన్ని పొందడాన్ని నిరోధిస్తుంది. మనకు తెలియని దాన్ని తిరస్కరించటానికి అలవాటు పడ్డాము. ఈ ఏకత్వము కోసం చేసే సాధన మనకు పూర్తిగా కొత్తది అవడం వలన తిరస్కరించడానికి మొగ్గు చూపుతాము. ఈ కష్టాల గురించి ఆలోచిస్తూ అర్జునుడు మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలి అని అడుగుతాడు. "నిస్సందేహంగా , మనస్సు చంచలమైనది. దానిని వశపరుచుకోవటం చాలా కష్టం , కానీ అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దానిని వశపరుచుకోవటం   సాధ్యం (6.35). క్రమశిక్షణ లేని వారు యోగ సాధన చేయలేరు కానీ నిరంతర సాధన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు" (6.36) అని శ్రీకృష్ణుడు చెప్పారు. చంచలమైన మనస్సు...

123. సౌకర్య స్థితిని దాటడం

చిత్రం
  కొన్ని శతాబ్దాల క్రితం అమెరికా అనే ఖండం భూమ్మీద ఉందని యూరోపులో ఎవ్వరికీ తెలీదు. కొలంబస్‌ అక్కడికి చేరుకున్నప్పుడు అంత పెద్ద విశాల భూభాగం కనుగొనబడటానికి వేచి ఉందన్న విషయం అతని అవగాహనకి మించినది. అతని జ్ఞానం ఆనాటి భౌగోళిక శాస్త్రానికి పరిమితం కావడంతో , అతను దానిని ఆసియా అని తప్పుగా భావించాడు. అటువంటి ధోరణి గురించి వివరిస్తూ , సమకాలీన మనస్తత్వశాస్త్రం రెండు ఆలోచన విధానాల గురించి చర్చిస్తుంది మరియు వాటిని రెండు వ్యవస్థలుగా పరిగణిస్తుంది. మొదటి వ్యవస్థ ఆకస్మికంగా , స్వయంచాలకంగా ఉండి మన భౌతిక మనుగడకు బాధ్యత వహిస్తుంది. రెండవ వ్యవస్థ సంక్లిష్ట సమస్యలకు సమాధానం పొందడానికి పని చేస్తుంది కాబట్టి చాలా కృషి , సమయము , ధ్యాసను మళ్లించాల్సి ఉంటుంది. తరచూ ఈ రెండో వ్యవస్థకు అవసరమైన శ్రమ చేయడానికి బదులు రెండో వ్యవస్థ యొక్క పనులను మనం మొదటి వ్యవస్థ ద్వారా చేయించి తక్షణ నిర్ధారణలు , నిర్ణయాలకు వస్తుంటాము. తరచూ అటువంటి నిర్ధారణలు , నిర్ణయాలు కొలంబస్‌ నిర్ణయంలా పొరపాటు ఫలితాలకు దారితీస్తాయి. ఒక అర్థవంతమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కావల్సిన ఆధారాలను సమకూర్చే పని రెండో వ్యవస్థ వలన జరుగుతుంది. అటువంటి ...

122. 'అంతా ఆయనే' అనే మంత్రం

చిత్రం
  పరమాత్ముని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు , " సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచుపురుషునకు , అట్లే ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడుని కాను , అతడును నాకు అదృశ్యుడు కాడు" అని చెప్పారు (6.30). ఈ శ్లోకం భక్తి యోగానికి పునాది , ఇక్కడ అభ్యాసకులు ప్రతిచోటా మరియు ప్రతి పరిస్థితిలోనూ పరమాత్మను దర్శించగలుగుతారు. ' అంతా అయనే ' అనే మంత్రంలో , ' అంతా ' అనేది ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా పరిస్థితి కావచ్చు. ఈ మంత్రాన్ని పునరావృతం చేస్తూ , ఈ విషయము గురించి లోతైన అవగాహన కలిగితే అది అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత మిత్రుడులోనైనా , శత్రువులోనైనా , సహాయం చేసినవారిలోను , కష్టాన్ని కలిగించినవారిలోను , పొగడ్తలోనూ , విమర్శలోనూ , బంగారంలోనూ , రాయిలోనూ లేదా అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోనూ , సంతోషంలోనూ , ఆందోళనలోనూ , సంతృప్తిలోనూ , దు:ఖంలోనూ , జయాపజయాల్లోనూ పరమాత్మను చూడగలుగుతాము. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పరస్పర విరుద్ధ అంశాలలో మనము పరమాత్మను దర్శించుకోగలుగుతాము. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగ...

121. నమస్కారం యొక్క శక్తి

చిత్రం
  భారతీయులు తారసపడినప్పుడు ఒకరికొకరు నమస్తే , సమస్కారం అని అభినందించుకుంటారు. ' నీలోని దైవత్వానికి వందనం ' అన్నది ఈ పదానికి అసలైన అర్థం. విభిన్న సంస్కృతులలోని శుభాకాంక్షలు ఇదే విధమైన సందేశాన్ని అందిస్తాయి. "అన్ని జీవులలో తన ఆత్మను మరియు అన్ని జీవులని తన ఆత్మలో చూడటం మరియు ప్రతిచోటా అదే చూడటం" (6.29) అన్న శ్రీకృష్ణుడు ప్రభోధాన్ని ఆచరణలో పెట్టటడమే ఈ పదము యొక్క ప్రయోగం. ఈ అవగాహనతో మనము ఈ విధంగా పరస్పరం అభినందించుకున్నప్పుడు మనలోనూ , ఇతరుల్లోనూ ఉన్న దైవత్వాన్ని గ్రహించే దిశగా అడుగులు వేస్తున్నట్లే. ‘ప్రతిచోటా అదే చూడటం ' అనేది నిరాకార మార్గం. ఇది కఠినమైన మార్గంగా పరిగణించబడినది. శ్రీకృష్ణుడు వెంటనే దానిని సులభతరం చేస్తూ ‘సర్వత్రా నన్నే చూడు , నాలోనే సర్వస్వాన్నీ చూడు’ (6.30) అని చెప్తున్నారు. ఇది ' రూపం ' లేదా సాకార మార్గం. ఈ శ్లోకాలు ' సాకార ' మరియు ' నిరాకార ' మార్గాల ద్వారా పరమాత్మ ప్రాప్తిని పొందచేసే మార్గాలు. ప్రతి సంస్కృతీ పరమాత్మను చేరుకోవటానికి ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ప్రబోధిస్తుంది. అవ్యక్తం అనంతము , అపరిమితము కానీ భౌతికం...

120. తనలోనే విశ్వం, విశ్వమంతా తానే

చిత్రం
  అస్తిత్వం అనేది వ్యక్తమైన మన శరీరం మరియు అవ్యక్తమైన ఆత్మ యొక్క పొందిక. మనము ఈ అస్తిత్వాన్ని వ్యక్తమైనవాటి ద్వారా లేదా అవ్యక్తము ద్వారా అర్ధం చేసుకొనవచ్చు. మన ఇంద్రియాలు వ్యక్తమైన వాటిని మాత్రమే గ్రహించగలవు కాబట్టి మనకు వ్యక్తుల , పరిస్థితుల , వస్తువుల మధ్య తారతమ్యమును గుర్తించే వ్యక్తమైన ప్రపంచంతో పరిచయం ఉంటుంది. ఆయా వ్యక్తీకరణల వెనుకనున్న అవ్యక్త రూపాన్నీ మనం తేలిగ్గా గుర్తించలేము ఎందుకంటే అది మన ఇంద్రియ సామర్ధ్యాలకు అతీతమైనది. ఉదాహరణకు , మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మహిళా లేక పురుషుడా అన్నది గమనిస్తాము. తర్వాత ఎంత మంచి వస్త్రధారణతో ఉన్నారు , వారి ప్రవర్తన ఎలా ఉంది , వారి పలుకుబడి ఎంత , స్థితిమంతులా కాదా అన్నది గమనిస్తాము. తర్వాత వారితో మనకున్న మంచి జ్ఞాపకాలు , చెడు అనుభవాలను గుర్తు తెచ్చుకుంటాము. ఈ రకమైన విభజనల ఆధారంగా మనం చేసే నిర్ధారణలను బట్టి వారితో మన ప్రవర్తన ఉంటుంది. ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ శ్రీకృష్ణుడు ఆత్మతో లీనం అయిన వాడు సర్వత్రా ఆత్మనే చూడగలడు అని చెప్తున్నారు. ఆత్మలోనే సర్వస్వాన్నీ , సకల విశ్వాన్నీ చూడగలడని వివరిస్తున్నారు (6.29).   ఇది పంచేంద్రియాల పరి...