120. తనలోనే విశ్వం, విశ్వమంతా తానే


 అస్తిత్వం అనేది వ్యక్తమైన మన శరీరం మరియు అవ్యక్తమైన ఆత్మ యొక్క పొందిక. మనము ఈ అస్తిత్వాన్ని వ్యక్తమైనవాటి ద్వారా లేదా అవ్యక్తము ద్వారా అర్ధం చేసుకొనవచ్చు. మన ఇంద్రియాలు వ్యక్తమైన వాటిని మాత్రమే గ్రహించగలవు కాబట్టి మనకు వ్యక్తుల, పరిస్థితుల, వస్తువుల మధ్య తారతమ్యమును గుర్తించే వ్యక్తమైన ప్రపంచంతో పరిచయం ఉంటుంది. ఆయా వ్యక్తీకరణల వెనుకనున్న అవ్యక్త రూపాన్నీ మనం తేలిగ్గా గుర్తించలేము ఎందుకంటే అది మన ఇంద్రియ సామర్ధ్యాలకు అతీతమైనది.

ఉదాహరణకు, మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మహిళా లేక పురుషుడా అన్నది గమనిస్తాము. తర్వాత ఎంత మంచి వస్త్రధారణతో ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి పలుకుబడి ఎంత, స్థితిమంతులా కాదా అన్నది గమనిస్తాము. తర్వాత వారితో మనకున్న మంచి జ్ఞాపకాలు, చెడు అనుభవాలను గుర్తు తెచ్చుకుంటాము. ఈ రకమైన విభజనల ఆధారంగా మనం చేసే నిర్ధారణలను బట్టి వారితో మన ప్రవర్తన ఉంటుంది.

ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ శ్రీకృష్ణుడు ఆత్మతో లీనం అయిన వాడు సర్వత్రా ఆత్మనే చూడగలడు అని చెప్తున్నారు. ఆత్మలోనే సర్వస్వాన్నీ, సకల విశ్వాన్నీ చూడగలడని వివరిస్తున్నారు (6.29).  ఇది పంచేంద్రియాల పరిధిని దాటి పురోగమించే మార్గం. ఇది ఒక బావి తవ్వటం లాంటిది. తవ్విన తక్షణమే మనకు నీరు కనపడదు. ముందు కనిపించేది రాళ్లూ రప్పలే కానీ అలా తవ్వుతూ పోతే తప్పకుండా నీళ్లు కనిపిస్తాయి. పంచేంద్రియాల పరిధిని అధిగమించే ప్రయత్నం కూడా అలాంటిదే.

ఈ శ్లోకం మనం అవ్యక్తమైన ఆత్మను గుర్తించి దాన్ని చేరుకొన్న తర్వాత ఆ స్థాయి నుండి వ్యక్త రూపాలను ఎలా అర్థం చేసుకోవచ్చొ వివరిస్తుంది. మన కళ్లకు కనిపించే ప్రతి మనిషీ, ప్రతి వస్తువు వెనక కనిపించని అవ్యక్తరూపం దాగి ఉంటుందన్న వాస్తవాన్ని వివరించటానికే శ్రీకృష్ణుడు 'సర్వత్రా ఒకదాన్నే చూడగలగటం' అని అంటారు. మరో ఉదాహరణగా చెప్పాలంటే ఒకే చెట్టుకున్న రెండు పళ్లు తమను పోషిస్తున్న చెట్టు ఒక్కటేనని తెలియక కొట్లాడుకోవటం వంటిది. ఇది గ్రహించినప్పుడు అంతా అవ్యక్తమైన వేదికపై ఆడే నాటకం అని అర్ధమవుతుంది.

శ్రీకృష్ణుడు ముందుగా సూచించినట్లు అన్ని జీవులలో అదే ఆత్మను మరియు తన ఆత్మలోనే అన్ని జీవాత్మలను చూడాలనే దృఢ సంకల్పంతో నిరంతర సాధన చేయవలెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక