31. కర్మయోగం ఫలితాలు ఇస్తుంది
కర్మయోగాన్ని ఏ మాత్రం సాధన చేసినా కూడా ఫలితాలను ఇస్తుందని , ఈ ధర్మం (క్రమశిక్షణ) మహా భయాల నుండి మనలను రక్షిస్తుందని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారు (2.40). సాంఖ్యయోగం స్వచ్ఛమైన అవగాహన అయితే కర్మయోగంలో ప్రయత్నం చేయవలసి ఉంటుందని గమనించాలి. ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన వారికి , ఈ యాత్రని కఠినంగా భావించే సాధకులకు ఇది శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన హామీ. మన కష్టాన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఒక చిన్న ప్రయత్నం కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలదని హామీ ఇచ్చారు. నిష్కామ కర్మ (ప్రేరణలేని చర్య) ద్వారా సమత్వ మార్గాన్ని అనుసరించమని ఆయన మనల్ని ప్రేరేపిస్తారు. ఒక మార్గం ఏమిటంటే , శ్రీకృష్ణుడు చెప్పినదానిపై శ్రద్ధ కలిగి ఉండి కర్మయోగంపై ఆయన బోధనలను ఆచరించడం. మన అనుభవాలను కర్మయోగ దృష్టితో చూడడం అభ్యసించినప్పుడు మన అనుభూతులు మరింత లోతుకు వెళుతూ చివరకు మన అంతరాత్మను చేరుకుంటాము. ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే మన భయాలను అర్థం చేసుకోని కర్మయోగ సాధన వాటిని ఎలా తొలగించగలదో తెలుసుకోవడం. మన అంతర్గత అపేక్షలకు , వాస్తవ ప్రపంచానికి పొంతన కుదరకపోవడమే భయానికి మూలం. కర్మయోగం మనకు నిష్కామ కర్మ గురించి బోధిస్తుంది. ఇది మ...