పోస్ట్‌లు

148. వివేకముతో శక్తి ఉపయోగం

చిత్రం
  ఒకసారి ఇద్దరు బద్ధ శత్రువులు దేవుడిని ప్రార్థించారు. దేవుడు ఒక వ్యక్తి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి రెండో వ్యక్తి కోరికల గురించి దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు రెండవ వ్యక్తి వద్దకు వెళితే అతను మొదటి వ్యక్తిని మొదట ఆశీర్వదించమని దేవుడిని అభ్యర్థించాడు. మొదటివాడు రెండోవాడు కోరిన దానికంటే రెట్టింపు కావాలని దేవుడిని కోరుకున్నాడు. ఈ విధంగా , శత్రుత్వంతో అంధుడైన రెండోవాడు ఒక కన్ను కోల్పోవాలని ప్రార్థిస్తాడు , తద్వారా మొదటివాడు రెండు కళ్ళు కోల్పోతాడు ; ఒక కాలును పోగొట్టుకోవడం వల్ల మరొకరు రెండు కాళ్లను కోల్పోతాడు. ద్వేషంతో తన సమయము , శక్తిని ఉపయోగించినప్పుడు ఒకరినొకరు నష్టపరుచు కోవడం అనే ఆట కొనసాగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు కర్మలను త్యజించకుండా ద్వేషాన్ని త్యజించమని చెప్పారు (5.3). ఈ కథ నుండి మరొక పాఠం ఏమిటంటే , మన స్థాయిలో పరిమితంగా ఉండే సమయాన్ని , శక్తిని వివేక పూర్వకంగా ఉపయోగించు కోవాలని అర్ధం చేసుకోవడం. ఈ విషయం గురించి వివరిస్తూ పరమాత్ముడు రెండే శాశ్వత మార్గాలున్నాయని , మొదటిది వెనక్కి తిరిగి రాని ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణించటం , రెండోది పదేపదే చీకటి లోకాలకు తిరిగి ప్రయాణ...

147. భిన్నత్వంలో ఏకత్వం

చిత్రం
  సత్యమూ , వాస్తవము , దేవుడూ ఒక్కటే. భగవత్‌ దర్శనం చేసుకున్న వాళ్లు ఆయన్ను వేర్వేరు భాషల్లో , వేర్వేరు పదాలతో , పేర్లతో పిలుస్తారు , కొలుస్తారు. క్రిస్మస్‌ పర్వదినాన జీసస్‌ క్రైస్ట్‌ యొక్క బోధనను గుర్తు చేసుకొని బైబిల్‌ గ్రంధం కూడా గీతోపదేశాన్ని ప్రతిధ్వనిస్తోందని అర్ధం చేసుకోవచ్చు. సమత్వము అనేది భగవద్గితకు పునాది. సకల విషయాలను , మనుషులును (బంధువులు , కుటుంబ సభ్యులు , మిత్రులు , శత్రువులు) మనోభావాలను (పొగడ్తలు , విమర్శలు) అన్నిటినీ సమదృష్టితో చూడాలన్నది శ్రీకృష్ణ పరమాత్ముని బోధన. ఏసు క్రీస్తు కూడా ' ఇతరులు మనపట్ల ఏ విధంగా వ్యవహరించాలని కోరుకుంటామో అదే విధంగా మనము కూడా ఇతరుల పట్ల వ్యవహరించాలి ' అని చెప్పారు. మన యజమాని మన పట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నామో మనం కూడా మనకంటే దిగువన ఉన్న వారి పట్ల కూడా అదే విధంగా వ్యవహరించాలి. మన ఇరుగుపొరుగు వారు మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో మనం కూడా వారితో అలానే వ్యవహరించాలి. ఈ చిన్నపాటి దృక్ఫధం మనల్ని సమత్వ దృష్టిని అలవర్చుకుని శిఖరాగ్రానికి చేర్చటంలో సహాయపడుతుంది. అదేవిధంగా బైబిల్‌ గ్రంధంలో (మాథ్యూ 25:29) ' నిండుగా ఉన్న వాడికి స...

146. ఫోటాన్ మీద స్వారీ

చిత్రం
  మనిషికి ప్రతి ఉదయమూ ఓ కొత్త జీవితమే , సరికొత్త జననమే. ఈ విషయాన్ని వివరిస్తూ సృష్టికర్త   అయిన బ్రహ్మకు కూడా పగలు , రాత్రి ఉంటాయనీ అయితే వాటి వ్యవధి భిన్నంగా ఉంటుందని (8.17) శ్రీకృష్ణుడు చెప్తున్నారు. తెల్లవారుతూనే బ్రహ్మ సృష్టించిందంతా కనిపిస్తుంది. బ్రహ్మకు చీకటి పడేనాటికి మాయమవుతుంది (8.18). ఇది ఒక చక్రీయ ప్రక్రియ (8.19). గమనార్హం ఏమిటంటే కాలానుగుణంగా నడిచేదంతా చక్రీయమే. అవ్యక్తమైన దానికంటే ఉన్నతమైన మరో అవ్యక్త , శాశ్వతమైన , పరమపదమైన , కాలచక్రం ప్రభావానికి అతీతమైన అవస్థ ఉంటుంది (8.20). విత్తనాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ శ్లోకాన్ని మరింత తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. విత్తనంలో అవ్యక్తరూపంలో ఉన్న మహా వృక్షం దాగి ఉంటుంది. విత్తనం నుండి చెట్టు , చెట్టు నుండి విత్తనం అన్న వలయం నిరంతరముగా సాగుతూనే ఉంటుంది. వాటన్నింటి వెనుక ఈ వలయాన్ని నడిపించే ఒక సృజనాత్మక శక్తి కూడా ఉంటుంది. కాలచక్రం పరిధి బయట ఉన్న ఈ సృజనాత్మక శక్తిని గుర్తించాలని శ్రీకృష్ణ పరమాత్ముడు సూచిస్తున్నారు.   కాలచక్ర ప్రభావానికి అతీతమైనదాన్ని గుర్తించటం , అర్థం చేసుకోవటం మన మెదడు సామర్ధ్యానికి మించిన పని. ఈ సంక...

145. పునర్జన్మ గురించి పునరాలోచన

చిత్రం
నాలో లీనమైన నా భక్తులకు పునర్జన్మ ఉండదనీ (8.16) , పరమాత్మలో లీనం కానీ వారి జీవితం నిత్య దు:ఖదాయకంగా ఉంటుందని (8.15) శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. అందువలన పునర్జన్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అవసరం. పునర్జన్మ అంటే మరణించిన తర్వాత మళ్లీ పుట్టడం అని సాధారణ అర్ధముగా చెప్పుకుంటాము. మరో విధముగా చుస్తే ఇది మన చుట్టూ ఉన్న కొత్త పరిస్థితి యొక్క పుట్టుకగా కూడా అర్థం చేసుకోవచ్చు. రోజువారీ జీవితంలో మన చుట్టూ అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో మన ఇంద్రియాలు గ్రహించే తీరును బట్టి , మనం స్పందించే తీరును బట్టి తలెత్తే పర్యవసానాలు అనేక సరికొత్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇటువంటి చక్రీయ ప్రక్రియనే శ్రీకృష్ణుడు దు:ఖ వలయమని అంటారు. కానీ పరమాత్మను చేరుకున్న వారికి ఈ ఇంద్రియ స్పందనలు సముద్రంలో కలిసిన నదిలాగా మాయమవుతాయి. అందువల్ల మన ద్వారా కొత్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉండదు . అయితే అస్థిత్వము వాటిని సృష్టించడం కొనసాగించవచ్చు. బాహ్య పరిస్థితులపై మనకు నియంత్రణ ఉండదు. కానీ మనలను మనము నియంత్రించు - కున్నప్పుడు ఆయా పరిస్థితులు మన మీద ఏ ప్రభావము చూపించలేక శక్తిహీనులుగా మారతాయి. మనం కేవ...

144. మనస్సు, హృదయము

చిత్రం
  శ్రీకృష్ణుడు అర్జునుడిని గమనిస్తు సాగించే సంభాషణే భగవద్గీత. తన కర్తవ్యం అయిన కురుక్షేత్ర యుద్ధాన్ని చేయడానికి సిద్ధముగా లేని అర్జునుడు అన్ని వేళలా పరమాత్ముని స్మరణ చేస్తూ యుద్ధం చేయమని (8.7) శ్రీకృష్ణుడు బోధించినప్పుడు అర్జునుడి మనస్సులో వెల్లువెత్తిన సందేహాలను ఆయన గుర్తించారు. చేతిలో ఉన్న పని పూర్తి చేయటానికి ఎదరయ్యే ప్రతిఘటన నేటికీ మనలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురించి వివరిస్తూ తాను "సర్వజ్ఞుడు , సనాతనుడు , అందరిని శాసించు వాడు , అణువు కంటేను సూక్ష్మమైనవాడు , అందరిని పోషించువాడు , అచింత్య రూపుడు , సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడు , అజ్ఞానాంధకారమును పారద్రోలువాడైన పరమేశ్వరుడు" అని చెప్పారు (8.9). ఈ అస్థిత్వము తనను తాను వివరించటానికి పూనుకున్నప్పుడు పదాలు సరిపోవు. తనను స్మరించుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు మార్గాలున్నాయని చెప్తున్నారు. మొదటిది అవగాహనతో కూడిన మార్గం. "యోగము ద్వారా స్థిరచిత్తం సాధించి పరమాత్మయందు ధ్యానం నిలిపిన వాడు సర్వ శక్తివంతుడైన ఆ పరమాత్మను చేరుకోగలడు’’ అని అవగాహన మార్గము గురించి చెప్పారు (8.8). ఇంద్రియాల ద్వారా స్వీకర...

143. పనియే పూజ అయినప్పుడు

చిత్రం
  ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని మరణ సమయంలో తెలుసుకొనే సందర్భంలో , అయన అర్జునుడితో ఇలా అంటారు , " నీవు సర్వదా నన్నే స్మరించుచు ఉండుము (సర్వేషు-కాలేషు-అనుస్మర). యుద్ధమును కూడా చేయుము. నీ మనోబుద్ధులను నాయుందే నిల్పియున్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు" (8.7). రోజులో ఏదో ఒకసారో లేదా అప్పుడప్పుడు ప్రార్ధనా స్థలాలకు వెళ్లటం ద్వారా మనం దేవుడిని స్మరించుకుంటాము. వేర్వేరు విశ్వాసాలకు అనుగుణంగా మనం పూజించే దేవుళ్లు , పాటించే ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు. మనకు ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవటానికి మనం దేవుడిని స్మరించుకుంటూ ఉంటాము. మన కోరికలు నెరవేర్చుకోడానికి , అధికారం , పేరు ప్రతిష్టలు పొందడానికి భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాము. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ‘ఎల్ల వేళలా నన్ను స్మరించు ' అని ప్రబోధిస్తున్నారు. కానీ సర్వకాల సర్వావస్థలయందు భగవత్‌ సన్నిధానాన్ని ఆశ్రయించటం గురించి మనకు తిలియదు. ఈ సంక్లిష్టతకు సంబంధించిన మూలాలు భక్తియోగములో ఉన్నాయి. ఇది ' అన్ని జీవులలో తనను చూడడం ; తనలో అన్ని జీవులని చూస్తూ భగవంతుని ప్రతిచోటా చూడడం ' ( 6.29 & 6.30). ఈ అస్తిత్వగత సత్యాన్ని గ్రహి...

142. ముగింపుకు ముందు ప్రారంభించాలి

చిత్రం
  స్వీయ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మరణానికి ముందు పరమాత్ముడైన నిన్ను తెలుసుకోవటం ఎలాగా అని అర్జనుడు ప్రశ్నించాడు ( 8.2). ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ‘‘ఆత్మ శరీరాన్ని వదిలే ఆఖరి క్షణంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నాలో లీనమవుతారు. ఇందులో ఏమాత్రము కుడా సందేహము లేదు" ( 8.5) అని చెప్పారు. మరణ సమయంలో ఎవరైనా పరమాత్మను స్మరించితే ఆయనను పొందుతారనే నిశ్చయాత్మకమైన హామీ ఇది. జీవితాంతం సకల పాపాలకూ పాల్పడి , దానవుల మార్గాన్ని అనుసరించిన దుర్మార్గుడిలా ఉండి , భ్రాంతికి లోనయ్యి రకరకాల లాలసల కోసం తపన చెందిన వారు కూడా మరణశయ్యపై ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకుంటే సరిపోతుంది అన్న అభిప్రాయానికి ఈ శ్లోకం తావిస్తుంది. ఇటువంటి పొరపాటు అభిప్రాయానికి తావు లేకుండా శ్రీకృష్ణుడు ‘‘జీవిత కాలంలో ఏ విధంగా మనిషి మనుగడ సాగించాడో ఆఖరి క్షణాల్లోనూ దాన్నే తల్చుకుంటాడు’’ అని స్పష్టం చేస్తున్నారు ( 8.6). ముందుగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనం ఎప్పుడు మరణిస్తామో ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. మరణం అన్నది ఎంత ఆకస్మిక సంఘటన అంటే ఫలానా సమయానికి మనం భగవన్నామ స్మరణలో ఉండొచ్చన్న ఆలోచన యొక్క ఆచరణ సాధ్యం కాదు. ఇ...