148. వివేకముతో శక్తి ఉపయోగం
ఒకసారి ఇద్దరు బద్ధ శత్రువులు దేవుడిని ప్రార్థించారు.
దేవుడు ఒక వ్యక్తి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి రెండో వ్యక్తి కోరికల
గురించి దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు రెండవ వ్యక్తి వద్దకు వెళితే అతను మొదటి
వ్యక్తిని మొదట ఆశీర్వదించమని దేవుడిని అభ్యర్థించాడు. మొదటివాడు రెండోవాడు కోరిన
దానికంటే రెట్టింపు కావాలని దేవుడిని కోరుకున్నాడు. ఈ విధంగా, శత్రుత్వంతో అంధుడైన రెండోవాడు ఒక కన్ను కోల్పోవాలని ప్రార్థిస్తాడు,
తద్వారా మొదటివాడు రెండు కళ్ళు కోల్పోతాడు; ఒక
కాలును పోగొట్టుకోవడం వల్ల మరొకరు రెండు కాళ్లను కోల్పోతాడు. ద్వేషంతో తన సమయము,
శక్తిని ఉపయోగించినప్పుడు ఒకరినొకరు నష్టపరుచు కోవడం అనే ఆట
కొనసాగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు కర్మలను త్యజించకుండా ద్వేషాన్ని త్యజించమని
చెప్పారు (5.3). ఈ కథ నుండి మరొక పాఠం ఏమిటంటే, మన స్థాయిలో
పరిమితంగా ఉండే సమయాన్ని, శక్తిని వివేక పూర్వకంగా ఉపయోగించు
కోవాలని అర్ధం చేసుకోవడం.
ఈ విషయం గురించి వివరిస్తూ పరమాత్ముడు రెండే
శాశ్వత మార్గాలున్నాయని, మొదటిది వెనక్కి తిరిగి రాని
ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణించటం, రెండోది పదేపదే చీకటి
లోకాలకు తిరిగి ప్రయాణించే మార్గం (8.23 & 8.26).
ప్రకాశవంతమైన మార్గం అనేది మన శక్తిని బ్రహ్మను చేరుకోవడానికి అంతర్గత ప్రయాణం
వైపు మళ్లించే మార్గం (8.24). మన శక్తిని బయట ప్రపంచంలో ఒకరినొకరు
నష్టపరుచుకోవడానికి ఉపయోగించే మార్గమే చీకటి మార్గం (8.25). శ్రీకృష్ణుడు ఈ
మార్గాల యొక్క వివిధ పేర్లను, లక్షణాలను వివరిస్తారు. చీకటి
మార్గము సుఖ-దుఃఖము, జనన-మరణ ధృవణాల మధ్య ఊగిసలాడే లోలకం
లాంటిది. అయితే, ఈ ద్వంద్వాలను దాటి లోలకం యొక్క
శిఖరస్థాయిని చేరుకోవడమే ప్రకాశవంతమైన మార్గం. ఈ మార్గము ద్వారా పరమాత్మను
చేరుకుంటాము.
ఈ రెండు మార్గాల గురించి అర్థం చేసుకున్నప్పుడు
మనం భ్రమలకు లోనయ్యే పరిస్థితులు ఉండవని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (8.27). ఇది
సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. రెండు మార్గాల గురించిన సత్యాన్ని తెలిసినవాడు
వేదాల పఠనం ద్వారా, త్యాగాలు లేదా తపస్సుల ద్వారా వచ్చే
పుణ్యఫలాల కంటే ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారు.
నిశ్చితముగా అటువం టి యోగి పరమాత్మని చేరుకుంటాడు (8.28).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి