పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

131. మాయను అధిగమించడం

చిత్రం
  శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకృతి నుండి జన్మించిన మూడు గుణాలు , వాటి స్వభావాల గురించి వివరించి ఉన్నారు. ఈ గుణాలే వేర్వేరు పద్ధతుల్లో అన్ని కర్మలకు కర్తలని కూడా బోధించియున్నారు (3.5). వాస్తవానికి కర్మలన్నియూ ఈ గుణాలచే నిర్వర్తించబడును (3. 2 7). కర్మలు అనేవి గుణాల మధ్య జరిగే పరస్పర చర్యలు తప్ప మరేమీ కాదు. సత్వగుణవంతులు జ్ఞాన పిపాసులు. రజోగుణవంతులు కార్యోన్ముఖులు. తమో గుణము అజ్ఞానానికి మరియు సోమరితనానికి దారితీస్తుంది. ఈ విషయం గురించి శ్రీకృష్ణుడు మరింత వివరణ ఇస్తూ ‘‘సత్వ , తమో , రజో గుణాలు మరియు వాటి వ్యక్తీకరణలన్నీ నానుండే ఉద్భవిస్తాయి. అవి నాలో ఉన్నప్పటికీ నేను వాటిలో లేను’’ (7.12) అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటానికి ఆకాశాన్ని , మేఘాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి కాని ఆకాశం మేఘాలలో ఉండదు.   కానీ ఆకాశం లేకుండా మేఘాల మనుగడ సాధ్యము కాదు. సముద్రంలో అలలు ఉంటాయి కానీ సముద్రం అలల్లో ఉండదు. మనలను సమ్మోహితులను చేయగల సామర్ధ్యం గుణాలకు ఉందని గతంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు హెచ్చరించియున్నారు (3.29). మూడు గుణాలచే సమ్మోహితులైన వ్యక్తులు ‘నేను గుణాతీతుడనని ...

130. అజ్ఞేయమును తెలుసుకోవడం

చిత్రం
  శ్రీకృష్ణుడు తన పరా ప్రకృతిని విశ్వానికి మద్దతునిచ్చే ' జీవన తత్త్వము ' గా వర్ణించారు (7.5). ఈ సందర్భములో అందమైన ఆభరణాన్ని రూపొందించడానికి రత్నాలకు సహాయపడే సూత్రము యొక్క ఉదాహరణను ఇచ్చారు. ఇదే తరహా వివరణతో మరికొన్ని వ్యాఖ్యానాలకు దారితీసే ఉదాహరణలు కూడా శ్రీకృష్ణుడు వివరిస్తారు. ' జీవన తత్త్వము ' గురించి వివరిస్తూ , శ్రీకృష్ణుడు , " చాలామంది అనేక రకాలుగా వర్ణించినప్పటికీ ' ఇది ' ఎవరికీ తెలియదు" (2.29) అని చెప్పారు. ' ఎవరికీ ' అంటే ఇంద్రియాలు ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సూచిస్తుంది . ' జీవన తత్త్వము ' ఇంద్రియాలకు అతీతమైనది అని అర్ధము చేసుకోవాలి. శ్రీకృష్ణుడు ' జీవన తత్త్వము ' గురించి వివరించే క్రింది శ్లోకాలను అర్థం చేసుకోవడానికి ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. " ఓ అర్జునా! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే , వేదములన్నింటి లోను ఓంకారమును , ఆకాశమునందు శబ్దమును , పురుషుల యందు పౌరుషమును నేనే" (7.8) అని శ్రీకృష్ణుడు చెప్పారు. ' రస ' ను సాధారణంగా రుచి అని వ్యాఖ్...

129. పరమాత్ముడు పాచికలు ఆడతారు

చిత్రం
  విశ్వ సృష్టి సమయంలో కేవలం శక్తి మాత్రమే ఉండేది. కొంతకాలము తర్వాత పదార్ధం తయారయినది. శాస్త్రీయంగా చూసినప్పుడు ఉష్ణ్రోగ్రత , ఘనత్వము , పదార్ధం-ప్రతిపదార్థాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఆది విశ్వం యొక్క అంతర్భాగంగా ఉన్నవని స్పష్టమవుతుంది. అయితే ఈ వ్యత్యాసాలకు ఉన్న కారణమేమిటి అన్నది ఇప్పటి వరకూ శాస్త్రీయపరముగా వివరించబడలేదు. ఈ వ్యత్యాసాలే పదార్థ ఆవిర్భావానికి కారణం. ఈ రోజు మనం మన చుట్టూ చూస్తున్న వైవిధ్యాన్ని సృష్టించడానికి దేవుడు పాచికలు ఆడారని సైన్స్ అంగీకరిస్తుంది. ఈ విషయాన్ని వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు తన అపరా ప్రకృతి ఎనిమిది అంశాల మేళవింపు అని వివరిస్తున్నారు. ఇందులో అగ్ని , భూమి , జలం , వాయువు , ఆకాశము భౌతికాంశాలు. మనస్సు బుద్ధి అహంకారము జీవాంశాలు (7.4) ఇక్కడ అగ్ని శక్తికి నిదర్శనం. ఇది విశ్వం ఆరంభం నుండి ఉనికిలో ఉంది. ఈ శక్తి పదార్ధంగా మారుతుంది. ఇలా మారిన పదార్ధం ఘనపదార్ధంగానూ (భూమి) , ద్రవ పదార్ధంగానూ (జలం) వాయు పదార్ధంగానూ (గాలి) ఉంటుంది. వీటన్నిటినీ ఇముడ్చుకోవటానికి ఆకాశము కావాలి. జీవులు వాటి మనుగడకు బాహ్య పరిస్థితులను సురక్షితము లేదా ప్రమాదకరమైనవిగా విభజించగల సామర్...

128. ప్రతి ముగింపు ఒక ఆరంభమే

చిత్రం
  "నేను నీకు విజ్ఞాన సహితముగా తత్త్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని తెలుసుకున్నాక ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియు మిగలదు" (7.2) అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇది మనస్సు ఆధారిత వ్యక్తులకు జ్ఞానం , విజ్ఞానం యొక్క మార్గం. అంతకుముందు శ్రీకృష్ణుడు హృదయ ఆధారిత (భక్తి) వ్యక్తులకు ' అన్ని జీవులను తనలో , అన్ని జీవులలో తనను చూస్తూ శ్రీకృష్ణుడుని ప్రతిచోట చూసే ' ( 6.29) ఒక మార్గాన్ని ఇచ్చారు. ఇది తెలుసుకున్నాక తెలుసుకొనవలసినది ఏదియు మిగలదు. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ‘శూన్యం నుండి బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చని ' ధృవీకరిస్తోంది. నిరంతరం విస్తరిస్తున్న ఈ విశ్వం 13.8 బిలియన్‌ సంవత్సరాల క్రితం జరిగిన ‘ బిగ్‌ బాంగ్‌ ’ కారణంగా ఉనికిలోకి వచ్చింది. అంతరిక్ష సూక్ష్మ కిరణాల నేపధ్యపు రేడియేషన్‌ (కాస్మిక్‌ మైక్రోవేవ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ రేడియేషన్‌ -CMBR) ద్వారా వచ్చిన ఆధారాలతో మనకు తెలిసిన ఈ విశ్వం కంటే పూర్వం కూడా మరొక విశ్వం ఉండేదని నిరూపిస్తున్నారు. కొంత కాలం తర్వాత ఈ విశ్వం చాలా పల్చగా విస్తరించుతుంది , అందులోని ' శూన్యం యొక్క శక్తి ' వలన మరో విశ్వం ఆవిష్కృతమవుతుందని శ...