128. ప్రతి ముగింపు ఒక ఆరంభమే
"నేను నీకు విజ్ఞాన సహితముగా తత్త్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని తెలుసుకున్నాక ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియు మిగలదు" (7.2) అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇది మనస్సు ఆధారిత వ్యక్తులకు జ్ఞానం, విజ్ఞానం యొక్క మార్గం. అంతకుముందు శ్రీకృష్ణుడు హృదయ ఆధారిత (భక్తి) వ్యక్తులకు 'అన్ని జీవులను తనలో, అన్ని జీవులలో తనను చూస్తూ శ్రీకృష్ణుడుని ప్రతిచోట చూసే' (6.29) ఒక మార్గాన్ని ఇచ్చారు. ఇది తెలుసుకున్నాక తెలుసుకొనవలసినది ఏదియు మిగలదు.
ఆధునిక శాస్త్ర
పరిజ్ఞానం ‘శూన్యం నుండి బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చని' ధృవీకరిస్తోంది. నిరంతరం
విస్తరిస్తున్న ఈ విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ‘బిగ్ బాంగ్’ కారణంగా ఉనికిలోకి వచ్చింది. అంతరిక్ష
సూక్ష్మ కిరణాల నేపధ్యపు రేడియేషన్ (కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్
రేడియేషన్-CMBR) ద్వారా వచ్చిన ఆధారాలతో మనకు తెలిసిన ఈ
విశ్వం కంటే పూర్వం కూడా మరొక విశ్వం ఉండేదని నిరూపిస్తున్నారు. కొంత కాలం తర్వాత ఈ
విశ్వం చాలా పల్చగా విస్తరించుతుంది, అందులోని 'శూన్యం యొక్క శక్తి' వలన మరో విశ్వం ఆవిష్కృతమవుతుందని
శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం సృష్టి, విధ్వంసం
అనే చక్రీయ క్రమాన్ని సూచిస్తోంది.
‘‘యావత్ విశ్వానికీ
తానే లయకారుడు, విలయకారుడు’’
(7.6) అని శ్రీకృష్ణుడు చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఈ నేపథ్యం
ఉపయోగపడుతుంది. ఇది చక్రీయ క్రమాన్ని సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. రెండవది,
ఏకత్వం అనేది సృష్టి-విలయముల కలయిక అనే అంశాన్ని కూడా అర్ధం
చేసుకోవాలి. అన్ని సంస్కృతులూ భగవంతుడిని సృష్టికర్తగా కీర్తిస్తాయి. కానీ
పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు తాను లయకారుడితో పాటు విలయకారుడిననీ స్పష్టం చేస్తున్నారు.
"నాకంటేను పరమ
కారణమైనది ఏదీయును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలె
నాయుందే కూర్పబడి యున్నవి" (7.7) అని శ్రీకృష్ణుడు చెప్పారు. వ్యక్తము
(రత్నాలు) మరియు అవ్యక్తము (సూత్రము) వివరించడానికి 'రత్నాల మాల' ఉదాహరణ
తరచుగా ఉపయోగించబడుతుంది. సూత్రము కనిపించదు కానీ రత్నాలు సూత్రము సహాయం లేకుండా
అందమైన ఆభరణాన్ని ఏర్పరచలేవు. కనిపించని వేళ్ళు లేకుండా చెట్టు నిలబడలేదన్న
వాస్తవాన్ని మనం ఎలా గ్రహిస్తామో ఆలాగే పరమాత్మ లేకుండా ఈ విశ్వానికి మనుగడ లేదని
గ్రహించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి