పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

147. భిన్నత్వంలో ఏకత్వం

చిత్రం
  సత్యమూ , వాస్తవము , దేవుడూ ఒక్కటే. భగవత్‌ దర్శనం చేసుకున్న వాళ్లు ఆయన్ను వేర్వేరు భాషల్లో , వేర్వేరు పదాలతో , పేర్లతో పిలుస్తారు , కొలుస్తారు. క్రిస్మస్‌ పర్వదినాన జీసస్‌ క్రైస్ట్‌ యొక్క బోధనను గుర్తు చేసుకొని బైబిల్‌ గ్రంధం కూడా గీతోపదేశాన్ని ప్రతిధ్వనిస్తోందని అర్ధం చేసుకోవచ్చు. సమత్వము అనేది భగవద్గితకు పునాది. సకల విషయాలను , మనుషులును (బంధువులు , కుటుంబ సభ్యులు , మిత్రులు , శత్రువులు) మనోభావాలను (పొగడ్తలు , విమర్శలు) అన్నిటినీ సమదృష్టితో చూడాలన్నది శ్రీకృష్ణ పరమాత్ముని బోధన. ఏసు క్రీస్తు కూడా ' ఇతరులు మనపట్ల ఏ విధంగా వ్యవహరించాలని కోరుకుంటామో అదే విధంగా మనము కూడా ఇతరుల పట్ల వ్యవహరించాలి ' అని చెప్పారు. మన యజమాని మన పట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నామో మనం కూడా మనకంటే దిగువన ఉన్న వారి పట్ల కూడా అదే విధంగా వ్యవహరించాలి. మన ఇరుగుపొరుగు వారు మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో మనం కూడా వారితో అలానే వ్యవహరించాలి. ఈ చిన్నపాటి దృక్ఫధం మనల్ని సమత్వ దృష్టిని అలవర్చుకుని శిఖరాగ్రానికి చేర్చటంలో సహాయపడుతుంది. అదేవిధంగా బైబిల్‌ గ్రంధంలో (మాథ్యూ 25:29) ' నిండుగా ఉన్న వాడికి స...

146. ఫోటాన్ మీద స్వారీ

చిత్రం
  మనిషికి ప్రతి ఉదయమూ ఓ కొత్త జీవితమే , సరికొత్త జననమే. ఈ విషయాన్ని వివరిస్తూ సృష్టికర్త   అయిన బ్రహ్మకు కూడా పగలు , రాత్రి ఉంటాయనీ అయితే వాటి వ్యవధి భిన్నంగా ఉంటుందని (8.17) శ్రీకృష్ణుడు చెప్తున్నారు. తెల్లవారుతూనే బ్రహ్మ సృష్టించిందంతా కనిపిస్తుంది. బ్రహ్మకు చీకటి పడేనాటికి మాయమవుతుంది (8.18). ఇది ఒక చక్రీయ ప్రక్రియ (8.19). గమనార్హం ఏమిటంటే కాలానుగుణంగా నడిచేదంతా చక్రీయమే. అవ్యక్తమైన దానికంటే ఉన్నతమైన మరో అవ్యక్త , శాశ్వతమైన , పరమపదమైన , కాలచక్రం ప్రభావానికి అతీతమైన అవస్థ ఉంటుంది (8.20). విత్తనాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ శ్లోకాన్ని మరింత తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. విత్తనంలో అవ్యక్తరూపంలో ఉన్న మహా వృక్షం దాగి ఉంటుంది. విత్తనం నుండి చెట్టు , చెట్టు నుండి విత్తనం అన్న వలయం నిరంతరముగా సాగుతూనే ఉంటుంది. వాటన్నింటి వెనుక ఈ వలయాన్ని నడిపించే ఒక సృజనాత్మక శక్తి కూడా ఉంటుంది. కాలచక్రం పరిధి బయట ఉన్న ఈ సృజనాత్మక శక్తిని గుర్తించాలని శ్రీకృష్ణ పరమాత్ముడు సూచిస్తున్నారు.   కాలచక్ర ప్రభావానికి అతీతమైనదాన్ని గుర్తించటం , అర్థం చేసుకోవటం మన మెదడు సామర్ధ్యానికి మించిన పని. ఈ సంక...

145. పునర్జన్మ గురించి పునరాలోచన

చిత్రం
నాలో లీనమైన నా భక్తులకు పునర్జన్మ ఉండదనీ (8.16) , పరమాత్మలో లీనం కానీ వారి జీవితం నిత్య దు:ఖదాయకంగా ఉంటుందని (8.15) శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. అందువలన పునర్జన్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అవసరం. పునర్జన్మ అంటే మరణించిన తర్వాత మళ్లీ పుట్టడం అని సాధారణ అర్ధముగా చెప్పుకుంటాము. మరో విధముగా చుస్తే ఇది మన చుట్టూ ఉన్న కొత్త పరిస్థితి యొక్క పుట్టుకగా కూడా అర్థం చేసుకోవచ్చు. రోజువారీ జీవితంలో మన చుట్టూ అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో మన ఇంద్రియాలు గ్రహించే తీరును బట్టి , మనం స్పందించే తీరును బట్టి తలెత్తే పర్యవసానాలు అనేక సరికొత్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇటువంటి చక్రీయ ప్రక్రియనే శ్రీకృష్ణుడు దు:ఖ వలయమని అంటారు. కానీ పరమాత్మను చేరుకున్న వారికి ఈ ఇంద్రియ స్పందనలు సముద్రంలో కలిసిన నదిలాగా మాయమవుతాయి. అందువల్ల మన ద్వారా కొత్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉండదు . అయితే అస్థిత్వము వాటిని సృష్టించడం కొనసాగించవచ్చు. బాహ్య పరిస్థితులపై మనకు నియంత్రణ ఉండదు. కానీ మనలను మనము నియంత్రించు - కున్నప్పుడు ఆయా పరిస్థితులు మన మీద ఏ ప్రభావము చూపించలేక శక్తిహీనులుగా మారతాయి. మనం కేవ...