పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

103. పాప పుణ్యాల యొక్క మూలాలు

చిత్రం
“ పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని , వారి కర్మలను గాని , కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అనగా గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచుండును” అని శ్రీకృష్ణుడు చెబుతారు ( 5.14).      పరమేశ్వరుడు సృజనకారుడు కాదు కానీ సృజనాత్మకత అనే అవగాహనతో ఈ శ్లోకమును సులభముగా అర్ధము చేసుకోవచ్చు. సృష్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కుండను సృష్టించే కుమ్మరి లాంటిది. కుండ అనే సృష్టి సృష్టికర్త (కుమ్మరి) నుంచి వేరు చేయబడి తన ప్రయాణాన్ని స్వతంత్రంగా సాగిస్తుంది. నాట్యాన్ని సృష్టించే నర్తకుడు మరొక ఉదాహరణ. నర్తకుడు లేనప్పుడు నాట్యమే (సృష్టి) ఉండదు. దైవం కూడా నర్తకుని వంటి వారు. సమస్త విశ్వం ఆయనపై ఆధారపడి ఉంది కానీ ఆయన ఎవరిపై ఆధారపడరు. అందుకే నాట్యం చేసే శివుడిని ' నటరాజు ' గాను , మురళీ గానము వినిపించే శ్రీకృష్ణుడిని ' మురారి ' గాను వర్ణిస్తారు. దైవం ఒక రసాయనక చర్యలో ఉత్ప్రేరకం వంటిది. ఉత్ప్రేరకం రసాయనిక చర్యను ప్రభావితం చేస్తుంది కానీ ఉత్ప్రేరకం ఎలాంటి మార్పుకు లోనుకాదు. “ సర్వ వ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాపకర్మలలో దేనికీ భాగస్వామి కాడు....

102. ఫలితానికి ప్రాధాన్యత లేదు

చిత్రం
“ కర్మయోగులు సంగమును వదిలివేసి కేవలము ఇంద్రియములు , మనస్సు , బుద్ధి , శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు ( 5.11). వర్తమానంలో ఒకరు కర్మతో సంగాన్ని వదిలి పెట్టినా కూడా అతని గత కర్మబంధనాలను నిర్మూలించుకోవాలని దీనికి అర్థం. అందుకే అతడు కర్మలను చేస్తూ ఉంటాడు. ' అనాసక్తి ' అవస్థకు చేరుకున్న తర్వాత లౌకిక జగతిలో తన పొందవలసినది ఏమీ ఉండదు కనుక అన్ని కర్మలూ అంతఃకరణ శుద్ధికి దారితీస్తాయి అని కూడా అర్థం చేసుకోవచ్చు. " నిష్కామ కర్మయోగి (యుక్త) కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు (అయుక్త) ఫలేఛ్చతో కర్మలనాచారించి వాటికి బద్ధుడగును” అని శ్రీకృష్ణుడు చెబుతారు ( 5.12). భగవద్గీతకు మూల స్తంభం వంటి ఒక ఉపదేశం ఏమిటంటే మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలాలపై అధికారం లేదు ( 2.47). కర్మఫలాలను వదిలివేయడం అంటే వచ్చే ఫలితము , పరిణామం ఏదైనా ; అది అద్భుతమైనదైనా , భయానకమైనదైనా సమత్వ బుద్ధితో ఆమోదించేందుకు సిద్ధంగా ఉండటం. ఇంతకు ముందు ' అయుక్త ' కు బుద్ధి , భావం రెండూ ఉండవని ఫలితంగా అతనికి ప్రశాంతత లేక ఆన...

101. తామర ఆకును అనుకరించడం

చిత్రం
జీవితంతో సహా , ప్రతి భౌతిక వ్యవస్థ అనేక అంశాలు , స్పందనలను సంగ్రహించి అనేక ఫలితాలను వెలువరిస్తుంది. మనం మన మాటల యొక్క , చేతల యొక్క ఫలితాలను నిరంతరం అంచనా వేసుకుంటూ మంచి , చెడు అని నిర్ధారిస్తూ ఉంటాము. ఇతరుల ప్రవర్తనను గురించి , మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఇలాగే నిర్ధారిస్తూ ఉంటాము. పరిణామ క్రమంలో పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేయడానికి ఈ సమర్థత మనకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఇటువంటి నిర్ధారణలకు వైజ్ఞానిక ప్రమాణాలు లేకపోవడం వల్ల మనం ఈ నిర్ధారణల కోసం అజ్ఞానంతో కూడుకున్న ఊహలు , అభిప్రాయాలు , విశ్వాసాలు , నమ్మకాలు మీద ఆధార పడతాము. మన నమ్మక వ్యవస్థకి అనుగుణంగా పనులు జరిగితే సంతోషిస్తాము , లోకపోతే దుఃఖిస్తాము. “మనస్సును వశమునందు ఉంచుకొన్నవాడు , జితేంద్రియుడు , అంతఃకరణ శుద్ధి గలవాడు , సర్వప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు” అని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు అంటారు (5.7). ఇది మన కర్మలు ఎప్పుడు కలుషితం కావో అన్న దాని గురించి భగవంతుడు మనకు ఇచ్చిన హామీ. “ద్వేషము , కోరికలు లేని వ్యక్తి ఏ కర్మ చేసినా అది కలుషితం కా...

100. స్పందన, ప్రతిస్పందన

చిత్రం
  జీవితం అనేది రెండు విధాల ప్రక్రియలను కలిగి ఉంటుంది. మనం ఇంద్రియముల ద్వారా అనేక స్పందనలను స్వీకరించి ప్రతిస్పందిస్తూ ఉంటాము. ఈ విషయము గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు , “ తత్త్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు , వినుచు , స్పృశించుచు , ఆఘ్రాణించుచు , భుజించుచు , నడుచుచు , నిద్రించుచు , శ్వాసక్రియలను నడుపుచు , భాషించుచు , త్యజించుచు , గ్రహించుచు , కనులను తెరుచుచు , మూయుచు ఉన్నను , ఇంద్రియములు తమ తమ విషయములందు వర్తించుచున్నవనియు , తానేమి చేయుట లేదనియు భావించును” (5.8 , 5.9). ఈ అస్తిగత శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్యాన్ని తెలిసిన వ్యక్తి యొక్క శిఖర స్థాయి అనుభూతిని వర్ణిస్తున్నారు. మన రోజువారి జీవితంలో మన గురించి వచ్చే పొగడ్తలు , విమర్శల వల్ల జనించే ఉద్వేగాలకు గురి అవుతూ ఉంటాము. తన గానమాధుర్యాన్ని మెచ్చుకున్న నక్క పొగడ్తలను విని నోట్లోని మాంసం ముక్కను విడిచిన కాకిలాగా పొగడ్తలు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. అలాగే విమర్శించినప్పుడు విమర్శ యొక్క స్థాయిని , విమర్శకుడి యొక్క బలాన్ని బట్టి మన స్పందన మౌనం నుంచి మాటలు లేక భౌతిక చేష్టల దాకా ఉండవచ్చు. ఈ ఉద్వేగాలకు కారణమైన ప్రశంసలు , విమర్శలన...