పోస్ట్‌లు

జనవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

127. నేర్చుకోవడానికి వినడం నేర్చుకోవాలి

చిత్రం
  త్రీ-మితీయ ( three dimensional) భూభాగాన్ని సూచించడానికి ద్వి-మితీయ ( two dimensional) మ్యాపును సాధారణముగా ఉపయోగిస్తాము. ఇది సరళమైన , ఉపయోగకరమైన , అనుకూలమైన పద్ధతి కానీ దీనికి పరిమితులు ఉన్నాయి. ఈ భూభాగాన్ని సమగ్రంగా వీక్షిస్తే తప్ప మనకు దాని సంపూర్ణత అవగతం కాబోదు. పదాల గురించిన విషయం కూడా అంతే. పదాలు బహుముఖీయ జీవితాన్ని వర్ణించటానికి ఉన్న సాధనాలు. వ్యక్తులు , పరిస్థితులు , ఆలోచనలు , భావనలు , వారి చర్యలను కూడా వర్ణించేవి ఇవే. కానీ పదాలకు కూడా కొన్ని పరిమితులున్నాయి. మొదటి పరిమితి ఏమిటంటే పదములు ధృవణతను కలిగి ఉంటాయి. మనం ఓక విషయాన్ని మంచిది అని వివరిస్తే రెండో విషయం చెడ్డది అన్న అవగాహన కలిగే అవకాశముంటుంది. ఈ ద్వంద్వాత్మకత లేదా ధృవణత్వాన్ని అధిగమించిన స్థితిని వివరించేందుకు తగినన్ని పదాలు లేవు. మరో పరిమితి ఏమిటంటే ఆయా వ్యక్తుల మానసిక స్థాయి , స్థితి , వారున్న పరిస్థితులు , వారికున్న అనుభవాలను బట్టి ఒకే పదం వేర్వేరు వ్యక్తుల్లో భిన్నమైన భావనలు కల్గించవచ్చు. అందువలనే ఇటువంటి పరిస్థితులను అధిగమించటానికి కొన్ని సంస్కృతులు నిశ్శబ్దాన్ని మాధ్యమంగా ఉపయోగిస్తుంటాయి. మూడో పరిమితి పదాలు విన...

126. యోగియే శ్రేష్ఠుడు

చిత్రం
  ‘‘తపస్వి కంటే , జ్ఞాని కంటే చివరకు కర్మి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అందువల్ల ఓ అర్జునా , యోగిలాగా జీవించటానికి ప్రయత్నించు (6.46). యోగులందరిలోనూ ఎవరైతే నాలో లీనమై ఉంటారో , అపరిమితమైన శ్రద్ధతో , భక్తితో నన్ను కొలుస్తారో అటువంటి వారు పరమ శ్రేష్ఠుడు (6.47) అని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు. యోగము అంటే ఐక్యత. యోగి అంటే ఆత్మతో ఐక్యత చెందినవాడు. వివిధ సందర్భాల్లో యోగికి సంబంధించిన వేర్వేరు గుణాల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తారు. ద్వంద్వాతీతుడుగా , గుణాతీతుడుగానూ ఉండటం , గుణాలే అసలైన కర్తలన్న అవగాహన కలిగి ఉండటం , తాను కేవలం సాక్షిని మాత్రమే అని తెలుసుకోగలిగి ఉండటం , మిత్రులు శత్రువుల పట్ల , పొగడ్తలు విమర్శల పట్ల సమత్వ భావమును కలిగి ఉండటం , యజ్ఞం నిర్వహించినట్లు ఎటువంటి ప్రేరణ లేకుండానే కర్మలు నిర్వహించటం (నిష్కామ కర్మ) , కర్మ ఫలాలను త్యజించటం , అన్నిటినీ మించి తనతో తాను సంతృప్తి చెందగలగటం లాంటివి యోగికున్న వివిధ గుణాలని శ్రీకృష్ణుడు వివరిస్తారు. తపస్వి అంటే కఠినమైన క్రమశిక్షణతో త్యాగాలు చేస్తూ ఉన్నతమైనదాన్ని సాధించడానికి తపస్సు చేసే వ్యక్తి. సాధారణ వ్యక్తులు చేయలేని పనులను వారు చేస...

125. అదృష్టానికి మూలాధారము

చిత్రం
  ఎవరైనా శ్రద్ధతో వైరాగ్యాన్ని ఆచరిస్తూ గమ్యాన్ని చేరకముందే మరణిస్తే (6.37) మళ్లీ మొదటి నుండీ ఆరంభించాలా అని అర్జునుడు ప్రశ్నించుతాడు. యోగమును ఆచరిస్తూ మరణించిన వ్యక్తి ఎన్నటికీ నాశనం కాబోడు (6.40). పవిత్రులు , సంపన్నులు అయిన కుటుంబంలోనో (6.41) యోగుల కుటుంబంలోనో పునర్జన్మ ఎత్తుతాడు. ఇటువంటి జన్మ సాధారణంగా అందరికీ దక్కేది కాదు (6.42). పూర్వజన్మలో సమీకరించుకున్న జ్ఞానంతో పరిపూర్ణత సాధించే దిశగా ప్రయాణం ప్రారంభించి (6.43) నిరంతర అభ్యాసంతో (6.44) అనేక జన్మల తర్వాత అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటాడు (6.45) అని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారు. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోవటానికి మట్టి కుండను మించిన ఉదాహరణ లేదు. కుండను తయారు చేసి పక్కన పెట్టినప్పుడు కొంత స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ అదే కుండను ఒక చోట నుండి మరో చోటికి మార్చినప్పుడు కుండ ఆక్రమించిన స్థలం దానితో పాటు వెళ్ళదు. కానీ కుండను ఎక్కడ పెట్టినా అక్కడ కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. రెండోది ఈ కుండలో ఉంచిన వస్తువుల స్వభావాన్ని బట్టి కుండ వాసన లాంటి కొన్ని లక్షణాలు సంతరించుకుంటుంది. కుండ పగిలిన తర్వాత కూడా కొంత సమయం వరకు ఈ సువాసన కొనసాగే అవకా...