పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

138. భ్రాంతులను అధిగమించడం

చిత్రం
  భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని ' జ్ఞాన-విజ్ఞాన-యోగము ' అని అంటారు . జ్ఞాన-విజ్ఞానాన్ని వ్యక్తమైన జగత్తు మరియు అవ్యక్తమైన పరమాత్మ యొక్క అవగాహనగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు హామీలు ఇచ్చారు. మొదటిది , ఒకసారి ' ఇది ' తెలిసిన తర్వాత , తెలియడానికి ఏమీ మిగలదు (7.2). రెండవది , మరణించే సమయంలోనైనా ' ఇది ' అర్థం చేసుకుంటే , వారు నన్ను పొందుతారు (7.29). వ్యక్త రూపంలో ఉన్నది , నశించేది ఎనిమిది విధములుగా   ఉంటుంది (7.4). అవ్యక్తమైన జీవన తత్త్వము ఇంద్రియాల సామర్ధ్యానికి అతీతమైనది. రత్నాల ఆభరణములో కట్టి ఉంచే సూత్రము లాగా వ్యక్త రూపంలో ఉన్న ప్రాణులకు అవసరమైన మద్దతునందిస్తుంది (7.7). వ్యక్తరూపంలో ఉన్నవన్నీ మూడు గుణాల ప్రభావంతో (7.25) , ఆసక్తి , విరక్తి వంటి పరస్పర భిన్న ధృవాలతో (7.27)   ఏర్పడే భ్రాంతికి గురవుతాయి. ఇటుంటి భ్రాంతులనుండి విముక్తి చెందాలంటే మనిషి పరమాత్మ వద్ద ఆశ్రయం పొందాలి. సకల చరాచర విశ్వం (వ్యక్తమైనది) ఓక బిందువు నుండి మొదలైందని విజ్ఞాన శాస్త్రం నిర్ధారించింది. మనమంతా , మన చుట్టూ ఉన్న విశ్వమంతా ఆ మూల బిందువుతో అనుసంధానించబడి ఉంటుంది...

137. 'అ' నుండి 'జ్ఞ' వరకు మంత్రం

చిత్రం
  మనము రెండు రకాల భ్రాంతులకు లోనవుతాము. మూడు గుణాల ప్రభావం చేత ఏర్పడే యోగ మాయ ద్వారా కలిగే భ్రాంతి మొదటిది. అన్ని చర్యలు వివిధ గుణాల మధ్య జరిగే సంపర్కాలు వలన అయినప్పటికీ ఈ భ్రాంతికి లోనైన వారు ఈ చర్యలన్నింటికీ తామే కారణమన్న అహంకారాన్ని కలిగి ఉంటారు. ఆసక్తి , విరక్తి వంటి పరస్పర భిన్న ధృవాలతో ఏర్పడే భ్రాంతి రెండోది. ఈ రకమైన భ్రాంతులకు  లోనైన వారు సిరిసంపదలు పోగేసుకోవటం , వ్యక్తులను ప్రభావితం చేయడం , సుఖ సాధనాల్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రెండు రకాలైన భ్రాంతులు ఒకదానినొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. అహంకారం కోరికలు కలిగి ఉండటాన్ని సమర్ధిస్తుంది. కోరికలు తీరినప్పుడు అవన్నీ మన కృషి ఫలితమేనన్న అహంకారం తలెత్తుతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు , “ నన్ను శరణుపొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను , సమస్త ఆధ్యాత్మమును , సంపూర్ణ కర్మను తెలిసికొందురు (7.29). అధిభూత , అధిదైవ , అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడు అయిన నన్ను అంత్యకాలము నందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు" (7.30). ఇక్కడ వివిధ రకాలైన భ్రాంతుల గురించి ...

136. ద్వంద్వాలతో వచ్చే భ్రమ

చిత్రం
  "జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాది ద్వందముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి" (7.27) అని శ్రీకృష్ణుడు చెప్పారు. జీవితంలో మనం రెండు రకాలైన భ్రమలకు లోనవుతూ ఉంటాము. మూడు గుణాలతో ప్రేరితమైన యోగ మాయ ఒకటైతే , రాగ ద్వేషాలనే పరస్పర భిన్న ధృవాల కారణంగా ఏర్పడే భ్రమ రెండోది. ఈ రెండింటిలో ఏ ఒక్క దాన్ని మనం అధిగమించినా అనివార్యంగా రెండో దాని ప్రభావం నుండి కూడా విముక్తులు అవుతాము. అజ్ఞానమే ఈ భ్రమలకు తొలి పునాది. దాని పర్యవసానంగా ఇక్కట్ల పాలవుతాము. ఈ ఇక్కట్లు మరేమిటో కాదు , సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నంలో అనుభవించే బాధలే. ఒక్కోసారి ఈ బాధలు మనం పని చేసిన వెంటనే ఎదురు కాకపోవచ్చు. కానీ కొంత కాల వ్యవధి తర్వాత ఇటువంటి బాధలు మనల్ని వెంటాడుతాయి. మన భావాలను అణిచివేయడం , దాచిపెట్టడం అనేది ఈ భ్రమల విషయంలో రెండవ స్థాయి. మనం ఎటువంటి భ్రమలకూ లోను కాలేదని బయటి ప్రపంచానికి చెప్పుకోవటానికి , చూపించుకోవటానికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తనను అరువు తెచ్చుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఇతరుల పట్ల చిన్నచూపుతో కూడా వ్యవహరిస్తూ ఉంటాము. శ్రీకృష్ణుడు ఇటువంటి వారిని కపటులుగా పేర్కొన్నార...