140. కర్మ అంటే ఏమిటి
'కర్మ అంటే
ఏమిటి' అనేది అర్జునుడి తదుపరి ప్రశ్న. ఇది ఒక వ్యక్తి తనను
ఆశ్రయించడం ద్వారా విముక్తి కోసం ప్రయత్నించినప్పుడు ‘అఖిలం-కర్మ’ (కర్మ, అకర్మ మరియు వికర్మ యొక్క అన్ని అంశాలు)
తెలుసుకుంటాడన్న శ్రీకృష్ణుడి హామీకి ప్రతిస్పందనగా అడిగిన ప్రశ్న (7.29).
"సృష్టికి కారణమైన విశ్వశక్తి యొక్క త్యాగము లేదా వేరు
అవ్వడానికి (భూత-భావ-ఉద్భవ-కరో విసర్గః) కర్మ అంటారు" అని శ్రీకృష్ణుడు
సమాధానమిస్తారు (8.3). ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటం
కష్టతరమైనది. దీన్ని వివరించేందుకు చేసే ప్రయత్నాలు దీన్ని అర్థం చేసుకోవడానికి
ప్రత్నించేవారికి మరిన్ని సంక్లిష్టతలు తెచ్చిపెట్టె అవకాశము ఉంది. కర్మ అంటే
గొప్ప పని అనీ, సృష్టి అనీ, యజ్ఞం అని
సాధారణంగా చెప్తుంటారు. కానీ కర్మ అంటే శ్రీకృష్ణుడు చెప్పిన నిర్వచనాన్ని,
అర్థాన్నీ ఈ అవగాహన సంపూర్ణంగా గ్రహించలేదు.
'కర్మ'కు సంబంధించి శ్రీకృష్ణుడి సమాధానం 'అస్తిత్వం'
స్థాయిలో ఉండగా, మనం దానిని 'చేయడం' స్థాయిలో అర్థం చేసుకుంటాము. అందుకే 'మనం చేసేది' 'కర్మ' అనే మన
అవగాహనతో కర్మను అర్ధం చేసుకోలేము ఎందుకంటే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో
వేర్వేరు పనులు చేస్తూ ఉంటారు. అయితే ఏ నిర్వచనం అయినా ప్రతి కాలానికి వర్తించాలి. ఇది మానవులు ఉనికిలో లేని సమయం కావచ్చు, వర్తమానం
లేదా భవిష్యత్తు కావచ్చు.
శ్రీకృష్ణ
పరమాత్ముడు ‘విసర్గ’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు అంటే త్యాగం లేదా వేరు అవ్వడం అని అర్థము. కర్మ అంటే సృష్టికారక సామర్ధ్యం కలిగిన
శక్తిని మళ్లించటము. దీన్ని అర్థం చేసుకోవటానికి మనం పెద్దమొత్తంలో విద్యుత్‌ను
సరఫరా చేసే హై ఓల్టేజి ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇందులో
కొంత విద్యుత్ శక్తిని మరో లైన్‌లోకి మళ్లించడము కర్మ. ఆలా మళ్లింపబడిన విద్యుత్
శక్తి వివిధ విద్యుత్ ఉపకరణాలను వెలిగించటమే అటువంటి కర్మ యొక్క కర్మఫలం.
ఈ ఉదాహరణ మన
అస్తిత్వానికి కూడా వర్తింప చేసుకుంటే అనంత శక్తి నుండి మనకు కావల్సిన శక్తిని
సమకూర్చుకోవటమే కర్మ. అయితే ఈ విధంగా ఆ శక్తిని వేరు చేసేది ఎవరు అనే ప్రశ్న
ఉదయిస్తుంది. విద్యుత్ వోల్టేజి వ్యత్యాసం వల్ల విద్యుత్ ప్రవహించినట్లు వేర్వేరు
మోతాదుల్లో ఉండే మూడు గుణాల వ్యత్యాసం వలన శ్రద్ధ అనే కేబుల్ ద్వారా ఈ శక్తి
ప్రవహిస్తుంది. ఇదంతా గుణాల కలయిక వలన సహజ సిద్దంగా జరుగుతుంది. కానీ భ్రాంతికి
లోనై ఈ విసర్గముతో మనల్ని మనం అనుసంధానించుకుంటూ ఉంటాము. తద్వారా మనమే కర్తలమన్న
భావనకు లోనవుతూ ఉంటాము. రెండో విషయం ఏమిటంటే ఓ సారి మనం ఈ శక్తిని సమకూర్చుకున్న
తర్వాత దానిపై మనకు ఎటువంటి నియంత్రణా ఉండదు. అంటే కర్మ ఫలంపై ఎటువంటి నియంత్రణా
ఉండదు. (2.47).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి