129. పరమాత్ముడు పాచికలు ఆడతారు
విశ్వ సృష్టి సమయంలో
కేవలం శక్తి మాత్రమే ఉండేది. కొంతకాలము తర్వాత పదార్ధం తయారయినది. శాస్త్రీయంగా
చూసినప్పుడు ఉష్ణ్రోగ్రత, ఘనత్వము,
పదార్ధం-ప్రతిపదార్థాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఆది విశ్వం యొక్క
అంతర్భాగంగా ఉన్నవని స్పష్టమవుతుంది. అయితే ఈ వ్యత్యాసాలకు ఉన్న కారణమేమిటి అన్నది
ఇప్పటి వరకూ శాస్త్రీయపరముగా వివరించబడలేదు. ఈ వ్యత్యాసాలే పదార్థ ఆవిర్భావానికి
కారణం. ఈ రోజు మనం మన చుట్టూ చూస్తున్న వైవిధ్యాన్ని సృష్టించడానికి దేవుడు
పాచికలు ఆడారని సైన్స్ అంగీకరిస్తుంది.
ఈ విషయాన్ని
వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు తన అపరా ప్రకృతి ఎనిమిది అంశాల మేళవింపు అని
వివరిస్తున్నారు. ఇందులో అగ్ని, భూమి, జలం, వాయువు, ఆకాశము భౌతికాంశాలు. మనస్సు బుద్ధి అహంకారము జీవాంశాలు (7.4) ఇక్కడ అగ్ని
శక్తికి నిదర్శనం. ఇది విశ్వం ఆరంభం నుండి ఉనికిలో ఉంది. ఈ శక్తి పదార్ధంగా
మారుతుంది. ఇలా మారిన పదార్ధం ఘనపదార్ధంగానూ (భూమి), ద్రవ
పదార్ధంగానూ (జలం) వాయు పదార్ధంగానూ (గాలి) ఉంటుంది. వీటన్నిటినీ ఇముడ్చుకోవటానికి
ఆకాశము కావాలి.
జీవులు వాటి మనుగడకు
బాహ్య పరిస్థితులను సురక్షితము లేదా ప్రమాదకరమైనవిగా విభజించగల సామర్ధ్యము కలిగి
ఉండాలి. మనస్సు అనేది ఆలోచన యొక్క ప్రాథమిక స్థాయి (వ్యవస్థ 1 -త్వరితము మరియు
సహజమైనది). బుద్ధి అనేది ఉన్నత స్థాయి
ఆలోచన (వ్యవస్థ 2 -నెమ్మది మరియు విశ్లేషించేది). పరమాత్మ యొక్క ఉన్నత ప్రకృతిని చేరుకోవడానికి
మనం దాటవలసిన చివరి అవరోధం మన అహంకారం. శ్రీకృష్ణుడు తన ఉన్నత ప్రకృతిని 'జీవన తత్త్వము' అని
చెప్పారు. రత్నాలను అందమైన ఆభూషణముగా మారడానికి సహాయము చేసే అదృశ్య సూత్రములా
(7.7) ఇది విశ్వానికి మద్దతు ఇస్తుంది (7.5).
"వేలకొలది
మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు
ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్త్వమును అనగా నా యథార్థ
స్వరూపమును ఏరుగును" (7.3) అని శ్రీకృష్ణుడు చెప్పారు. అహంకారం అనే
అవరోధానిని దాటడం చాలా కష్టమైన పని అనే విషయాన్నీ ఈ శ్లోకము సూచిస్తుంది.
దీనిని అర్ధము
చేసుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే 13.8 బిలియన్ సంవత్సరాల పరిణామ ప్రయాణంలో మనం
తెలిసి, తెలియకుండా చాలా
ధూళిని సేకరించాము. అహంకారంగా వ్యక్తమయ్యే ఈ ధూళిని గురించి అవగాహన తెచ్చుకొని
దానిని వదిలించుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి