30. నీళ్లు, ఇసుక, రాతిపై వ్రాత
సాంఖ్యమును (అవగాహన)
గురించి వివరించాక (2.11-2.38), శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి
వివరిస్తారు (2.39). దీన్ని ఆచరించడం ద్వారా మనము కర్మబంధాల నుండి విముక్తి
పొందవచ్చు.
సాంఖ్యయోగం గురించి
వ్యాఖ్యానించే టప్పుడు శ్రీకృష్ణుడు తను ఒక నాశనము లేని చైతన్యమని విశదీకరిస్తారు.
శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా అదే విషయాన్ని వివరించడం మొదలుపెడతారు. కాబట్టి
కర్మబంధనాలను, యోగాన్ని ఈ
సందర్భంలో అర్థం చేసుకోవాల్సి ఉంది.
యోగం అంటే కలయిక.
దీనిని అనేక సందర్భాల్లో ఉపయోగిస్తారు. విజయం లేక అపజయంతో సంగం లేని సమభావాన్ని
శ్రీకృష్ణుడు యోగం అంటారు (2.48). సుఖదుఃఖాల పట్ల, గెలుపు ఓటముల పట్ల, లాభనష్టాల పట్ల సమభావాన్ని
కొనసాగించమని శ్రీకృష్ణుడు అంతకుముందే బోధించియున్నారు (2.38). 'కర్మబంధం', మనం చేస్తున్న కర్మల వలన గాని లేక అకర్మల
ద్వారా గాని, మన లోపల నుండి లేక బయట నుండి వచ్చే
ప్రతిస్పందనల వలన గాని మనకు కలిగే ఆనందకరమైన లేక బాధాకరమైన గుర్తులు లేక గాయపు
మచ్చలని సూచిస్తుంది.
సాంకేతికంగా వీటినే
నాడీ నమూనాలు లేక న్యూరాన్ల పొందిక (neural
patterns) అనవచ్చు. ఈ పొందికలు అపస్మారక స్థాయి నుండి అంటే మనకు
తెలియకుండానే మన ప్రవర్తనను ప్రభావితం చేసాయి. అందుకే యోగం ద్వారా కర్మబంధాల నుండి
మనల్ని మనం విడిపించుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతారు.
మన సహజ స్వభావం
ప్రకారం, మనకు సుఖాన్ని
లేక లాభాన్ని కలిగించే కర్మలను చేయడానికి ఉత్సాహం చూపిస్తాము. అలాగే బాధ లేక నష్టం
కలిగించే పనుల పట్ల విముఖతను పెంపొందించుకుంటాము. ఈ అభిప్రాయాలు ఎంత లోతుగా ఉంటే
ఆయా పనుల పట్ల అంత తీవ్రమైన సుముఖత లేక విముఖత ఉంటుంది.
ఈ అభిప్రాయాలు యొక్క
బలాన్ని ఒక రాతి మీద, ఇసుక
మీద, నీటి మీద వ్రాతతో పోల్చవచ్చు. రాతిపై చిహ్నాలు లోతుగా
ఉండి చాలాకాలం ప్రభావితం చేస్తాయి. ఇసుక పైన గుర్తులు అంతకంటే తక్కువ కాలంలో
చెరిగిపోతాయి. నీటిపై వ్రాసినవి వెంటనే చెరిగిపోతాయి.
కర్మయోగం మనలను
కర్మబంధాలనుండి విముక్తులును చేస్తుందని శ్రీకృష్ణుడు అన్నప్పుడు నీటిపై వ్రాతలతో
పోలుస్తున్నారు. కర్మయోగం మనల్ని ఎంత సరళంగా చేస్తుందంటే ఏ విషయమూ మనల్ని
ప్రభావితం చేయలేదు; బాధ
పెట్టలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి