124. కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదు


 

మనం జీవించే విధానం ఏదైనా గాని ఏకత్వములో స్థాపించుకొనడము ద్వారానే పరమానందాన్ని పొందగలమని శ్రీకృష్ణుడు చెప్తున్నారు (6.31). ఏకత్వాన్ని సాధించడానికి మనం చేసే ప్రయత్నాల్లో ప్రధానంగా మూడు రకాలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏకత్వాన్ని భిన్న సంస్కృతులు వేర్వేరు పేర్లతో పిలుస్తాయి. తరచూ ఆయా సంస్కృతుల బోధనలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు ఉండి ఈ సమస్యను మరింత జఠిలం చేస్తాయి. రెండవది, మన మనస్సు విభజించడానికి శిక్షణ పొందింది. ఈ విభజన తత్త్వము మనను ఏకత్వాన్ని పొందడాన్ని నిరోధిస్తుంది. మనకు తెలియని దాన్ని తిరస్కరించటానికి అలవాటు పడ్డాము. ఈ ఏకత్వము కోసం చేసే సాధన మనకు పూర్తిగా కొత్తది అవడం వలన తిరస్కరించడానికి మొగ్గు చూపుతాము. ఈ కష్టాల గురించి ఆలోచిస్తూ అర్జునుడు మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలి అని అడుగుతాడు.

"నిస్సందేహంగా, మనస్సు చంచలమైనది. దానిని వశపరుచుకోవటం చాలా కష్టం, కానీ అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దానిని వశపరుచుకోవటం  సాధ్యం (6.35). క్రమశిక్షణ లేని వారు యోగ సాధన చేయలేరు కానీ నిరంతర సాధన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు" (6.36) అని శ్రీకృష్ణుడు చెప్పారు. చంచలమైన మనస్సును అదుపులో పెట్టడానికి (6.26) దృఢ నిశ్చయంతో నిరంతర అభ్యాసము (6.23) చేయాలని శ్రీకృష్ణుడు అంతకుముందు సలహా ఇచ్చారు.

వైరాగ్యం అనేది రాగమునకు వ్యతిరేక ధ్రువం. ప్రతిరోజూ జీవితం రాగము మరియు వైరాగ్యముల సందర్భాలను ఇస్తుంది, కానీ మన మనస్సు కోరికలను వెంటాడే రాగమును మాత్రమే గ్రహిస్తుంది. ఉదాహరణకు, మనము ఒక సంబంధంలో నిరాశ చెందినప్పుడు మనము మన భాగస్వామిని నిందిస్తాము. భాగస్వామిలో తప్పుల వలన సంబంధం పాడైపోయిందని కొత్త సంబంధం కోసం చూస్తాము. ఒక సంబంధం (రాగం) లో దాని ధ్రువ వ్యతిరేకమైన నిరాశ (వైరాగ్యం) దాగి ఉంటుందన్న విషయాన్నీ గ్రహించలేకపోతాము. గతంలో మనకు వైరాగ్యం కలిగించిన పరిస్థితులను మననం చేసుకోవటం ద్వారా ఈ అవగాహన తెచ్చుకోవచ్చు. వర్తమాన క్షణములో ఈ వైరాగ్యం కలిగించే పరిస్థితులు పునరావృతం అవుతున్నప్పుడు ఈ అవగాహన ఉపయోగపడుతుంది. వైరాగ్యం యొక్క అభ్యాసం అనేది మనం బయటి ప్రపంచము నుండి లేదా ఇతర వ్యక్తులు, వస్తువుల నుండి ఆనందాన్ని పొందలేము అనే గ్రహింపు యొక్క లోతైన అవగాహన తప్ప మరొకటి కాదు.

మృత్యువు శాశ్వతమైనది, శక్తివంతమైనది మరియు సమానత్వానికి అధిపతి. అనేక సంస్కృతులు మనస్సును నియంత్రించి ఏకత్వాన్ని సాధించడానికి మృత్యువును ఉపయోగిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక