111. మనతో మన స్నేహం
"మనుజులు ఈ
సంసారసాగరమునుండి తమను తామే ఉద్ధరించుకోనవలెను. తమకుతామే అధోగతి పాలు కారాదు. ఏలనన
లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు” (6.5) అని శ్రీకృష్ణుడు అంటారు. స్నేహం లాగే ఈ
అస్తిత్వగత శ్లోకానికి విభిన్న వ్యాఖ్యానాలు సంభవం అవుతాయి.
మొదటిది, ఇది ప్రతి వ్యక్తికి తమను తాము ఉద్ధరించుకొనే
బాధ్యత వారి మీదే ఉందని చెబుతుంది. కుటుంబం, స్నేహితులు,
సహోద్యోగులు, పరిస్థితులు, దేశం మొదలైన వారిని మన వైఫల్యానికి నిందించే ధోరణి మన అందరికి ఉంటుంది.
అదేవిధంగా కర్మలు నుండి ఆశించిన కర్మఫలం పొందనప్పుడు లేదా చెడుగా చిహ్నించబడ్డ
కర్మలు చేసినప్పుడు మనము మనల్ని నిందించుకుంటూ ఉంటాము. ఫలితంగా జీవితాంతం ఇతరులపై
కక్ష తీర్చుకోవడంలో నిమగ్నమై ఉంటాము లేదా మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము.
పరిస్థితులు ఏమైనప్పటికీ ఈ శ్లోకం మనల్ని మనం ఉద్ధరించుకోవాలని చెబుతుంది.
సాష్టాంగ ప్రణామం, ప్రశ్నించడం మరియు సేవ అనే మూడు గుణాలను
మనం పెంపొందించుకున్నప్పుడు గురువు మనకు సహాయం చేస్తారని శ్రీకృష్ణుడు అంతకుముందు
హామీ ఇచ్చియున్నారు (3.34).
రెండవది, ఇది మన పరిపక్వత, అపరిపక్వతలను స్వీకరించి మన పశ్చాతాపములను గుర్తించి వాటిని అధిగమించడం.
ఇవి మన అందము, కళంకితమైన గతం, మన విద్య,
ఆర్థిక స్థితి, మనం ఎదుర్కొన్న ఆహ్లాదకరమైన
మరియు ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు.
మూడవది, మనం మనతో స్నేహం చేసుకున్నప్పుడు
నిరాశ, క్రోధం మరియు మత్తు పదార్ధాలు లేదా తెరల (screen)
పట్ల వ్యసనానికి ప్రధాన కారణమైన ఒంటరితనానికి చోటు ఉండదు. ముఖ్యంగా
వృద్ధాప్యానికి చేరువులో ఉన్నప్పుడు ఇది మనల్ని ఇతరులుపై ఆధారపడకుండా ఆనందంగా
జీవించేందుకు సహాయపడుతుంది.
చివరగా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా
మరియు ఆధ్యాత్మికంగా మన అవగాహన పెంచుకోవడం ద్వారా సమతుల్య జీవితాన్ని గడపడమే ఈ
స్నేహానికి మరొక పేరు. తద్వారా మన జీవితం ఆనందమయం అవుతుంది.
మనతో మన స్నేహం యొక్క
సహజ పరిణామం ఏమిటంటే పక్షపాతాలు, తీర్పులను విడిచిపెట్టి ప్రపంచానికి స్నేహితులం అవుతాము. ప్రపంచము అంతా
కూడా మనతో స్నేహము చేస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి