132. దుర్గతి దుర్గతిని తెస్తుంది


 మూడు గుణాలకు అతీతమైన జీవన తత్త్వమే తన పరా ప్రకృతి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించారు. అపరా ప్రకృతి అనేది అగ్ని, భూమి, నీరు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారమనే ఎనిమిది విధముల కలిగి ఉంది. ఇవన్నీ  గుణాల ప్రభావానికి లోబడి పని చేస్తాయనీ గుర్తుచేస్తున్నారు. పరా ప్రకృతి అవ్యక్తమైనది, శాశ్వతమైనది, నాశనము లేనిది, కొలవలేనిది అయితే అపరా ప్రకృతి పరిమిత మోతాదులో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు.

సులభంగా అర్థం చేసుకోవడానికి, మనిషిని వ్యక్తముగా మరియు ఇంద్రియాలకు అతీతుడైన పరమాత్మని అవ్యక్తముగా తీసుకోవచ్చు. పరస్పర చర్య యొక్క మొదటి స్థాయి మనిషికి-మనిషికి మధ్య ఉంటుంది. ఇది వ్యక్తంతో మన గుర్తింపు యొక్క ఫలితం. తదుపరి స్థాయిలో మనిషికి పరమాత్మకి మధ్య ఉండే పరస్పర సంబంధం అని గుర్తించాలి. మనిషి-మనిషి స్థాయిలో వస్తువులు, వనరులు ఒక చెరువులో నీటి వలె పరిమితముగా ఉంటాయి. అయితే పరమాత్మ స్థాయిలో వనరులు, సౌకర్యాలు సముద్రంలో నీరు లాగా అనంతముగా ఉంటాయి. విభజించడానికి, పోల్చడానికి శిక్షణ పొందిన మనస్సు సిరిసంపదులు, అధికారం, పేరు ప్రతిష్టల విషయాలలో మన వద్ద ఉన్నవాటిని, ఇతరులకు ఉన్నవాటిని నిరంతరం పోల్చుతూ ఉంటుంది. మనకు లేనివి సమకూర్చుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ఉదాహరణకు ముఖ్యమంత్రి లేదా ప్రధాన కార్యనిర్వహణాధికారి పదవి ఒకటే ఉంటుంది. ఈ పదవిని సొంతం చేసుకోవటానికి చాలా మంది ఉవ్వళ్లూరుతుంటారు. పోటీపడుతుంటారు. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ మనకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

ఈ స్థాయిలో విషయాలు ధ్రువీయముగా ఉంటాయి. మనము సుఖము దుఃఖము, లాభము నష్టము మరియు విజయము అపజయములు అనే ధ్రువాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాము. లాభము, విజయములను పొందినప్పుడు అహంకారంతో ఉర్రూగుతాము. నష్టపోయినప్పుడు ఆ నష్టానికి మరెవరో లేదా ఏదో ఒక పరిస్థితి కారణమని నిందిస్తూ ఉంటాము. ఈ విధముగా తానే కర్తనని ప్రతి ఒక్కరూ భ్రమలో ఉంటారు. దీని వలన కర్మఫలాలు తాము కోరుకున్న విధంగా లేనప్పుడు భయాందోళనలకు గురవుతూ ఉంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో భాగస్వాములు అయినవారిని దానవుల బాటను అనుసరించి నీచమైన పనులు చేసే దుర్మార్గులని శ్రీకృష్ణుడు పేర్కొన్నారు (7.15). బలవంతముగా లాక్కోవాలనుకునే దుర్మార్గుడికి అలాగే లాక్కోవాలనుకునే దుర్మార్గుడు ఖచ్చితముగా కలుస్తాడు. ఈ కలయికే మనము మన చుట్టుపక్కల చూసే దుర్గతి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక