36. కనిపించేది కర్మఫలం కాకపోవచ్చు
ప్రస్తుత క్షణంలో మనం కోరుకునే కర్మఫలాలు మనకు
మంచివో కాదో అర్థం చేసుకునేంత తెలివితేటలు, సామర్ధ్యం మనకు
సాధారణంగా ఉండవు. విఫలమైన ఒక జంట లాగా, ఒక సమయంలో వారు
ప్రేమించుకుని కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ కొంత సమయం
తర్వాత వారు విడిపోవాలనుకుంటారు. వాస్తవానికి, నేడు మానవజాతి
పశ్చాత్తాప పడటానికి కారణం వారు గతంలో తీవ్రంగా కోరుకున్న కర్మఫలాన్ని పొందిన
తరువాత, కాలక్రమేణా అలా దక్కించుకున్న కర్మఫలం
వినాశకరమైనదిగా మారడం వల్లనే. అలాగే గతంలో ఏదో ఒక సమయంలో వారు కోరుకున్న
కర్మఫలాన్ని పొందకపోవడమే తమకు జరిగిన గొప్ప మేలని చాలామంది అంగీకరిస్తారు.
జీవితకాలంలో పొందిన అనుభవాలు భగవద్గీతలోని
ప్రఖ్యాత శ్లోకం 2.47 ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. మనకు కర్మ చేసే
అధికారం ఉంది కానీ కర్మఫలంపై అధికారం లేదని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పారు.
ఈ అనుభవాలు ఈ శ్లోకాన్ని 'ద్వంద్వం'
మార్గం ద్వారా అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడతాయి. ప్రపంచం
ద్వంద్వమైనది అంటే ప్రతి ఒక్క విషయానికి వ్యతిరేక స్థితి కూడా ఉంటుంది. ఇది
కర్మఫలానికి కూడా వర్తిస్తుంది.
పైన చెప్పిన ఉదాహరణలో, ప్రేమ
యొక్క సంతోషం (సుఖం, విజయం, లాభం) అనే
ధ్రువం కొంత సమయం తరువాత విడాకులు యొక్క బాధ (దుఃఖం, ఓటమి,
నష్టం) అనే ధ్రువంగా మారింది. రెండవ సందర్భంలో దీనికి విరుద్ధంగా
జరిగింది.
ఈ నిత్య ధ్రువాలను తెలుసుకొని వాటిని
అధిగమించమని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. కర్మఫలం పై కోరిక అటువంటి ధ్రువాలలో
ఒకటి. దాని ఉచ్చులో పడకుండా అధిగమించాలి.
సృష్టికర్తకు (చైతన్యం, సృజనాత్మకత)
13.5 బిలియన్ సంవత్సరాలకు పైగా ఈ విశ్వాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాంటిది,
మన కర్మఫల విషయంలో ఆయన ఖచ్చితంగా తడబడరు. మనకు అవసరమైనది లేదా
అర్హమైనది తప్పకుండా పొందుతాము కానీ మనం కోరుకున్నది కాకపోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి