32. మనశ్శాంతికి పునాది
కర్మయోగంలో బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుందని,
అలా లేని వారి బుద్ధి బహు శాఖలుగా (అనేక భేదాలతో) ఉంటుందని
శ్రీకృష్ణుడు చెప్పారు (2.41).
శ్రీకృష్ణుడు సమత్వమే యోగమని చెప్పారు (2.48
& 2.38). జీవితంలో మనం ఎదుర్కొనే సుఖం-దుఃఖం, గెలుపు-ఓటమి, లాభం -నష్టం వంటి రెండు ధ్రువాల కలయిక
ఇది. కర్మయోగం ఈ ధ్రువాలను అధిగమించే మార్గం. ఇది చివరికి నిశ్చయాత్మక బుద్దిగా
మారుతుంది. మరోవైపు సంతులనం లేని బుద్ధి మన మానసిక అశాంతికి కారణం అవుతుంది.
సుఖం, విజయం, లాభం పొందినప్పుడు మనశ్శాంతి దానికదే కలుగుతుందని మనం అనుకుంటాము. కాని
శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా తీసుకురాబడిన నిశ్చయాత్మక బుద్ధి ద్వంద్వాలను
అధిగమించేందుకు సహాయపడి మనకు మనశ్శాంతిని ఇస్తుందని అంటారు.
అస్థిరమైన బుద్ధి పరిస్థితులు, ఫలితాలు, వ్యక్తులను విభజించి భిన్నంగా
వ్యవహరిస్తుంది. మన కార్యాలయంలో మన క్రింది ఉద్యోగులకు ఒక కొలమానాన్ని, మన పైన ఉండే అధికారులకు మరొక కొలమానాన్ని వర్తింపజేస్తాము. కుటుంబాల్లో
విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వివిధ ప్రమాణాలను ఉపయోగిస్తాము. మనకు
ఇష్టమైన వారి కోసం ఒక నియమం ఇతరుల కోసం మరొక నియమం పాటించడం చూడడం వలన పిల్లలలో 'సమత్వం' అభివృద్ధి చెందడం కష్టమవుతుంది.
రోజువారి జీవితంలో మనం మతం, కులం, జాతీయత, మూఢనమ్మకాల వంటి
కృత్రిమ విభజనలకు లోనవుతాము. ఎదిగే దశలో ఇవన్నీ మన మనస్సులో అచ్చువేయబడి మనల్ని
విభజిస్తూ ఉంటాయి. ఈ కృత్రిమ విభజనలు మనల్ని అన్ని పరిస్థితిలలో ప్రభావితం
చేస్తాయి.
అస్థిరమైన బుద్ధితో మన తప్పులను నిర్ధారించడానికి
ఒక కొలమానం, ఇతరుల తప్పులను నిర్ధారించడానికి మరొక కొలమానం ఉపయోగిస్తాము.
సహాయం కోరుతున్నప్పుడు, సహాయం అందిస్తున్నప్పుడు మనము
వేర్వేరుగా ప్రవర్తిస్తాము.
కర్మయోగ మార్గాన్ని అనుసరించడం ద్వారా
నిశ్చయాత్మక బుద్ధి కలిగి మనశ్శాంతికి పునాది అయిన సమత్వాన్ని తీసుకురాగల యోగ్యతను
పొందుతారని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి