112. లోనున్న శత్రువు పట్ల అప్రమత్తత వహించండి
మనను
ఉద్ధరించుకోవడానికి లేదా అధోగతిపాలు ఆవడానికి మనమే కారణం అవుతామని చెప్పిన తర్వాత
(6.5), శ్రీకృష్ణుడు ఈ
బాధ్యతను నిర్వర్తించడానికి ఒక మార్గాన్ని ఇస్తారు. "తనను తాను జయించినవాడు,
తనకు తానే మిత్రుడు, కానీ తనను తాను
జయింపనివాడు, తనకు తానే శత్రువు" (6.6). తనను తాను
జయించుకోవడమే కీలకం. 'ఆత్మ' అంటే 'స్వయం' అనే పదం, 6.5 మరియు 6.6
శ్లోకాలలో పన్నెండు సార్లు కనిపిస్తుంది. దాని వలన అనేక వివరణలకు సంభావన
కలుగుతుంది. ఒక సాధకుడుకి తరువాత శ్లోకాలలో చెప్పిన వివరణ 'స్వీయ'ను జయించటానికి సంబంధించిన స్పష్టతను అందిస్తుంది.
శ్రీకృష్ణుడు ఇలా
అంటారు, "శీతోష్ణములు,
సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు
ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు
నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని
జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు
అన్యమేదియును ఉండదు” (6.7). పరస్పర భిన్న ధ్రువణాలను అధిగమించాలని అర్థం.
అర్జునుడు అంతకుముందు అనేక యుద్ధాలను
గెలిచాడు. ఆ గెలుపు అతనికి సంతోషాన్ని కలిగించింది. కానీ కురుక్షేత్ర యుద్ధంలో, అతని గురువులు, స్నేహితులు
మరియు బంధువులు అతనికి ప్రత్యర్థులుగా ఉన్నారు. అందువలన అతనికి తన స్వంత వారిని
కోల్పోయే భయం, బాధ కలిగింది. ఇంద్రియాలు ఇంద్రియ విషయములను
కలిసినప్పుడు, అవి అశాశ్వతమైన శీత-ఉష్ణ, సుఖ-దుఃఖాల (శీతోష్ణసుఖదుఃఖ)
యొక్క ధ్రువణాలను సృష్టిస్తాయి. మనం వాటిని సహించడం నేర్చుకోవాలని
శ్రీకృష్ణుడు అంతకుముందు చెప్పారు (2.14). ఈ క్షణికాలను సహించడం స్వీయ నియంత్రణ
తప్ప మరేమీ కాదు.
మనము ప్రతిరోజూ
ప్రశంసలు, విమర్శల
ధ్రువణాల ద్వారా ప్రభావితమవుతాము. ఈ ధృవణాలను ఆపడానికి ఎటువంటి అవకాశము ఉండదు,
ఏ మార్గము లేదు. అందుకే, శ్రీకృష్ణుడు వాటితో
జత చేరకుండా వాటిని అధిగమించమని నొక్కి చెప్పారు.
జీవితాన్ని సఫలం చేసుకోవడం గురించి మన సాధారణ అవగాహన ఏమిటంటే మనం కోరుకున్నది సాధించడం. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రకారం ఇది స్వీయ నియంత్రణను సాధించి మనఃశాంతిని పొందడం. ఆధ్యాత్మిక మార్గంలో మన పురోగతిని పరిశీలించుకోవడానికి ఈ ప్రమాణాన్ని ఉపయోగించుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి