7. నిమిత్తమాత్రులు




  భగవద్గీత యుద్ధక్షేత్రంలో పుట్టింది. గత కోవిడ్ - 19 రోజులు కూడా ఈ కురుక్షేత్ర యుద్ధం లాగే ఉండేవి. భగవద్గీతలోని 'నిమిత్తమాత్రులు' అనే పదము ఈ పరిస్థితులను చక్కగా సంగ్రహిస్తుంది. నిమిత్తమాత్రులు అంటే ఆ భగవంతుని చేతుల్లో ఒక పరికరంలా ఉండడం.

అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క వాస్తవికతను యథార్ధంగా చూడాలనుకున్నాడు. ఒక అంధునికి ఏనుగును పూర్తిగా చూడడానికి కళ్ళు అవసరమైనట్లే అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు వాస్తవికతను గ్రహించడానికి అదనపు ఇంద్రియం అవసరమయ్యింది.

తన విశ్వరూపాన్ని చూడడానికి శ్రీకృష్ణ భగవానుడు అతనికి దివ్య దృష్టిని ప్రసాదించారు. తన వాస్తవికతను చూపించడంతో పాటు శ్రీకృష్ణుడు అతనికి భవిష్యత్ దర్శనప్రాప్తిని కూడా కలిగించారు. తత్ఫలితంగా అర్జునుడు అనేక మంది యోధులు మృత్యుముఖంలోకి ప్రవేశించడాన్ని చూశాడు.

ఈ యోధులంతా త్వరలోనే చనిపోతారని, ఆ ప్రక్రియలో నీవొక పరికరానివి మాత్రమేననీ శ్రీకృష్ణుడు చెబుతారు అంటే అర్జునుడు కర్త కాదని చెబుతున్నారు. విజయమే అహంకారానికి అతి పెద్ద ప్రోత్సాహకం కనుక అర్జునుడు విజేతగా తిరిగి వస్తే అతడు అహంకారం కోరలు నుండి తప్పించుకోవడానికి ఈ విధముగా బోధిస్తున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధ క్షేత్రాన్ని వదిలి వెళ్ళనివ్వరు. 'నిమిత్తమాత్రులు'గా ఉండడం అంటే ఆత్మ జ్ఞానంతో, అహంకార రహితులుగా ఉండటం.

కోవిడ్-19 సమయంలో ఒక సామాన్యు వ్యక్తికైనా లేదా చికిత్సకులకైనా లేదా శాసకులకైనా, అర్జునుడి ఇబ్బందుల వంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అటువంటి పరిస్థితిలో ఏ చికిత్స కనపడక, మనందరం నిమిత్తమాత్రులుగా ఉంటూ మనకు ఇవ్వబడిన పాత్రను వీలైనంత బాగా పోషిస్తూ ఉండటమే నిమిత్తమాత్రత. ఈ చిన్న అవగాహన అనేక విషయాలలో వరం కావచ్చు ఎందుకంటే జీవితాన్ని అనుభూతి చెందుతూ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప భగవద్గీత స్పష్టంగా అర్థం కాదు.

ఉదాహరణకు, ఒక చిన్న బొగ్గు ముక్క అమితమైన ఒత్తిడిలో వజ్రంగా మారుతుంది; బంగారం కాలితేనే స్వచ్చమవుతుంది. ఇటువంటి పరీక్షా సమయాలు నిమిత్తమాత్రులుగా ఉండటమన్న వాస్తవికతను గుర్తించడానికి, అవగాహన కలగడానికి వేదికలవంటివి. ఈ అవగాహనకు మనల్ని శరణాగతి పథంలో అంతరాత్మ వైపు తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక