8. వ్యక్తము, అవ్యక్తము
చుక్కానికి జోడించబడ్డ చిన్న యంత్రం (ట్రిం
టాబ్) లోని చిన్న మార్పు పెద్ద ఓడ యొక్క దిశను మారుస్తుంది. అలాగే, భగవద్గీతను అధ్యయనం చేయాలనే చిన్న తపన మన జీవన మార్గాన్ని పూర్తీగా
మార్చగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న సమయాన్ని
భగవద్గీతను అధ్యయనం చేయటానికి ఉపయోగిస్తే మన జీవితంలో పెద్ద మార్పు వస్తుంది.
భగవద్గీత ప్రాథమిక విద్య (కిండర్ గార్టెన్)
నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారి దాకా ఆత్మజ్ఞానం కోసం శాశ్వతమైన పాఠ్య
పుస్తకం. మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్ధమవుతాయి. కానీ, మనం వ్యక్తము, అవ్యక్తం యొక్క దృష్టికోణం నుంచి భగవద్గీతను
సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఇంద్రియాల పరిధిలోకి వచ్చేవి వ్యక్తమైనవి; ఇంద్రియాలకు అతీతమైనవి అవ్యక్తమైనవి.
వ్యక్తమయ్యే వాటి కథ బిగ్ బాంగ్ (బృహత్ ప్రళయం),
నక్షత్రాల పుట్టుక, ఈ నక్షత్రాల్లో వివిధ
రసాయనిక మూలకాల అణువుల నిర్మాణం, నక్షత్రాలు విచ్ఛిత్తికి
గురైనప్పుడు ఈ మూలకాలు చెల్లాచెదురవుతున్న తీరు, గ్రహ మండలం
ఏర్పాటు, భూమ్మీద బౌద్ధిక జీవన ఆరంభం వంటి అనేక అంశాలను
కలిగి ఉంటుంది. ఈ వ్యక్తమైన జీవ రూపాలు, గ్రహాలు, నక్షత్రాలు, చివరికి ఈ విశ్వం కూడా ఒక నిర్దిష్టమైన
కాల పరిమితిని కలిగి ఉన్నాయి అని శాస్త్రీయ సమాజం అంగీకరించిన వాస్తవం. కానీ అంచనా
వేసిన కాల పరిమితుల్లో తేడా రావచ్చు.
వ్యక్తమయ్యే వాటి దృక్కోణంలో మనం పుట్టినప్పటి
నుండీ మరణించే దాకా మనుగడ కలిగి ఉంటామన్నది వాస్తవం. అవ్యక్తమైన వాటి దృక్కోణంలో
చూసినట్లయితే, భగవద్గీత చెప్పే ప్రకారం మనం పుట్టుకకు ముందు,
మరణం తరువాత కూడా మనుగడ కలిగి ఉంటాము. మన మనస్సులో ఈ స్పష్టతను
దృష్టిలో పెట్టుకుంటే, భగవద్గీతలో వివరించినట్లుగా మనం
వ్యక్తము అవ్యక్తముల యొక్క సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకుని అవ్యక్తమైన
లక్ష్యాన్ని (మోక్షాన్ని) గుర్తించి, పొందగలుగుతాము.
అహంకారమే ఈ మార్గంలో ప్రయాణానికి అవరోధంగా
ఉంటుంది. అయితే, బయటి ప్రపంచంలో సుఖదుఃఖాలకు అతీతంగా,
మనలో ఎంత ఆనందం నిండి ఉన్నది అనేది అవ్యక్తమైన అంతరాత్మ వైపు సాగే
ప్రయాణంలో సాధించిన పురోగతికి సూచిక.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి