10. మహమ్మారిలో శ్రీకృష్ణుడు
ఆత్మజ్ఞానం పొందే
దారిలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి, మూసివున్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన
తాళంచెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి ఒక కీలకమైన ఉపాయం మనల్ని ఇతరుల్లో,
ఇతరుల్ని మనలో చూసుకోవడం. అందరిలో ఉన్నది తానేనని గుర్తు చేస్తూ,
తాను నిరాకారుడినని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో
శ్రీకృష్ణుడు, మనం ఆయనకు సాష్టాంగ పడ్డ విధంగానే ఒక గాడిదకు,
మన శత్రువుకు లేక ఒక దొంగకు కూడా సాష్టాంగ ప్రణామం చేసే స్థాయికి
ఎదగాలని బోధిస్తున్నారు.
ఇంద్రియాలు మనకు
అందించిన సమాచారం యొక్క ఆధారంగా మన మనస్సు మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను, సురక్షితమైనవి, ఆహ్లాదకరమైనవి
లేదా హానికరమైనవి, బాధాకరమైనవిగా విభజిస్తుంది. రాబోయే
ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఈ విభజన ఎంతో అవసరం. ఇతర సాంకేతిక
పరిజ్ఞానంలాగానే మన మనస్సు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది; అది మనపై పెత్తనం చేయడానికి దాని పరిధుల్ని మీరుతుంది. ఇదే అహంకారానికి
జన్మస్థానం.
భగవద్గీతలోని
అమోఘమైన ఉపాయాలు మనస్సుని బానిసగా చేసి ఈ విభజనలను తగ్గిస్తే కలయిక, ఐక్యత కలుగుతాయని చెబుతాయి. మన శరీరం
లాంటి ఏదైనా సంక్లిష్ట నిర్మాణం ఇటువంటి ఐక్యత సాధించకుండా మనుగడ సాగించలేదు.
మనం ఇటువంటి బోధనలను
పాటించినప్పుడు ఇతరుల పట్ల కరుణను, మన గురించిన అవగాహనను పెంచుకుంటాము. ఏ కారణం చేతనైనా మనకు శత్రువు అయిన
ఒకరిని ఎంచుకుని వారిలో భగవంతుడుని చూడటం మొదలు పెట్టడమే ఈ సూత్రాన్ని అనుభవంలోకి
తీసుకు రావడానికి ఉత్తమ మార్గం. వారితో అనేక బాధాకరమైన జ్ఞాపకాలు, భావనలు ముడిపడి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇది కష్టమైన విషయం. కానీ క్రమంగా,
కాలంతో పాటు ఈ బాధంతా కరిగిపోయి సంతోషానికి దారితీస్తుంది. మనందరం ఈ
బోధనలను అనుసరించి ఉంటాము కానీ అవగాహనతో దీనిని తరచుగా అభ్యాసంలో పెట్టాలి.
మన గురించి అవగాహన, ఇతరుల పట్ల కరుణ అనేవి అంతరాత్మ అనే
ఒడ్డును చేరడానికి భగవద్గీత చెప్పిన మార్గంలో ప్రయాణించే మన పడవకు రెండు తెడ్లు
లాంటివి.
ఒకసారి మనం దీన్ని
అర్థం చేసుకుంటే, మనం
శ్రీకృష్ణుడిని కరోనా లాంటి మహమ్మారిలో కూడా చూడగలము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి