12. మనసును నియంత్రించడం

 



           అర్జునుడు మనస్సును గాలితో పోలుస్తూ, సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ, వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు.

జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా లేదా సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామ క్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి, అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది.

మనస్సుకున్న ఈ సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి ఉపయోగిస్తే దానినే జాగరూకత అని కూడా అంటారు. ఈ సామర్ధ్యం ద్వారా మన ఆలోచనలు, భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని ఆలోచన యొక్క మరియు నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు.

నేటి ఆధునిక యుగంలో, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించడానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసం) ద్వారా, కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే 'ఫీడ్ బ్యాక్ లూప్స్' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనుక, ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. ఇది మెదడులో కొత్త శక్తిని నింపడం లాంటిది.

వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడం దాని వ్యతిరేక ధ్రువమైన 'రాగం'ని అర్థం చేసుకోవడం ద్వారా సులభం అవుతుంది. 'రాగం' అంటే భౌతిక ప్రపంచంలో అందం, ఆస్తులు, అభివృద్ధి వంటి సుఖాల కోసం విస్తృతంగా పాకులాడడం. ద్వంద్వాల యొక్క సూత్రం ప్రకారం ప్రతి 'రాగ భావము' వైరాగ్యంతో ముగుస్తుంది కానీ మన దృష్టి ఎల్లప్పుడు 'రాగం' పైనే ఉంటుంది. అందుకే వైరాగ్యాన్ని విస్మరిస్తాము.

స్టోయిసిజం (stoicism) వంటి కొన్ని తత్వాలు వైరాగ్యానికి శిఖరం అయిన మరణం యొక్క ఉపయోగాన్ని సమర్ధిస్తాయి. దీన్ని 'మెమెంటో మోరి' అంటారు అంటే మరణాన్ని మళ్లీ మళ్లీ దర్శించడం లేక అనుభూతి చెందడం. ఈ పద్ధతిలో వారు చావుకి గుర్తుగా పనిచేసే చోటిలో లేక ఇంట్లో ఒక ప్రముఖ స్థానంలో ఏదైనా చిహ్నాన్ని ఉంచి దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ మృత్యువు పైన ధ్యాస నిలబడేలా చేస్తారు. భారతీయ వేదాంతం దీనినే 'స్మశాన వైరాగ్యం' అంటుంది.

మనం వైరాగ్యాన్ని సాధన చేయడం మొదలు పెడితే అది మనస్సుని స్థిరపడేలా చేస్తుందని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నారు.

గత లాక్ డౌన్ సమయాలు మనకు వైరాగ్య క్షణాలను దర్శింప చేశాయి. వీటిని మనస్సును సమతుల్యతలో ఉంచి శాంతి, ఆనందాలను పొందడానికి ఉపయోగించుకోవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక