3. వర్తమానంలో జీవించడం
‘మనం ఎవరమో’ భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి
తెలిసుకొనటమే కాకుండా, సత్యవంతులై ఉండటం వంటిది. మనం
వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది.
ఒకవేళ తన మిత్రులను, బంధువులను, పెద్దలను,
గురువులను రాజ్యం కోసం చంపితే, ప్రపంచం
దృష్టిలో తన ప్రతిష్ట నాశనము అవుతుందని అని అర్జునుడు భావిస్తున్నాడు. ఇది చాలా తార్కికంగా కనబడుతుంది. భగవద్గీత చెప్పిన ప్రకారం
జీవించాలంటే ఇలాంటి సందిగ్ధాలను
అధిగమించాలి.
అర్జునుడి అసలైన
సందిగ్ధం అతని భవిష్యత్తు గురించి. శ్రీకృష్ణుడు మనకు కర్మ చేసే హక్కు ఉంది కానీ
కర్మఫలంపై అధికారము లేదని బోధిస్తారు ఎందుకంటే కర్మ వర్తమానంలో జరుగుతుంది కానీ
కర్మఫలం అనేది భవిష్యత్తులో వస్తుంది.
అర్జునుడి లాగానే
మనము కూడా కర్మఫలాలను ఆశించి అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆధునిక జీవనం
కొన్నిసార్లు మనం భవిష్య పరిణామాలను నియంత్రించగలమన్న భావనను కలిగిస్తుంది. కానీ
భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని అనేక సంభావనల కలయిక. మన అహంకారమే గతంపై ఆధారపడి, వర్తమానంలో భవిష్యత్తును చూపిస్తూ
ఇటువంటి సందిగ్దాలను సృష్టిస్తుంది. దీనివల్ల మనం వర్తమానంలో జీవించలేని పరిస్థితి
ఏర్పడుతుంది.
అంతరిక్షాన్నే
తీసుకుంటే ఈ సమస్త విశ్వం, నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, గ్రహాలు
యొక్క విశేషత పరిభ్రమణం. ఇది ఒక స్థిరమైన
అక్షము (ఇరుసు), తిరిగే చక్రం ద్వారా ఏర్పడుతుంది. అక్షం
కదలదు కానీ అక్షం (ఇరుసు) లేకుండా చక్రం తిరగడమనేది సాధ్యం కాదు. అలాగే, ప్రతి తుఫానుకి కూడా ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం లేకుండా
తుఫాను గతి పొందలేదు. గమనించాల్సిన విషయమేటంటే కేంద్రం నుంచి ఎంత దూరంగా ఉంటే
అలజడి అంత ఎక్కువగా ఉంటుంది.
మనలో కూడా ఒక
ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది, అదే మన అంతరాత్మ. అనేక లక్షణాలను కలిగిన, అలజడితో కూడుకున్న జీవితం ఈ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతిష్ట
అనేది జీవితంలో మనకు ఎదురయ్యే అలజడులలో ఒకటి. అర్జునుడు కూడా తన ప్రతిష్టను
గురించిన సందిగ్ధంలోనే ఉన్నాడు. అతనిలాగానే మనం కూడా మన అంతరాత్మ లో చూసుకోవడం
బదులు ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాన్ని బట్టి మన ప్రతిష్టను గురించి నిర్ధారించుకుంటాము.
భగవద్గీత మనం
వర్తమానంలో జీవించాలనీ, అంతరాత్మతో
నిరంతరం అనుసంధానమై ఉండాలని చెబుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి