13. సాక్షి అవడం




భగవద్గీతని ఒక్క పదంలో వివరించాలంటే 'ద్రష్ట' (సాక్షి) అని చెప్పవచ్చు. ఈ వివరణ అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది అన్ని పనులను మనమే చేస్తామని, పరిస్థితులను నియంత్రిస్తామని అనుకుంటూ ఉంటాము కనుక నిజాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి వయసు 60 సంవత్సరాలు. అప్పటికే అతడు మంచి జీవితాన్ని గడిపి అన్ని రకాల విలాసాలను అనుభవించాడు. ఒక యోధుడిగా అతడు యుద్ధ క్షేత్రంలో అనేక సార్లు విజయాన్ని చవి చూశాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అతడు తానే కర్తనని (అహం కర్త - అహంకారం-అహంకారి), తన బంధుమిత్రుల చావుకు తానే కారకుడు అవుతాడని భావించడం వలన యుద్ధ క్షేత్రంలో విషాదానికి లోనయ్యాడు. అతడు 'కర్త' కాదని, శ్రీకృష్ణ భగవానుడు అతనితో చెప్పే ప్రయత్నమే భగవద్గీత. 'ఒకవేళ నేను కర్తను కాకపోతే మరి ఏమిటి?' అనేది సహజ ప్రశ్న. భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి అతను కర్త కాదు సాక్షిఅని చెబుతారు.

60 ఏళ్ల జీవితంలోని మంచి, చెడు అనుభవాల వల్ల అర్జునుడు తాను కేవలం ఒక 'సాక్షి' ని మాత్రమే కానీ 'కర్త' ను కాదు అన్న భావనను గ్రహించుకోలేకపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రమ కోర్చి చేసిన వివరణ అర్జునుడికి ఈ నిజాన్ని గ్రహింప చేస్తుంది. చాలా సంస్కృతులు మనం కేవలం ఒక 'సాక్షి' మాత్రమేనని చెప్పినా కూడా ఆధ్యాత్మిక ప్రయాణపు ఆరంభ దశలో ఉన్న వాళ్ళు ఈ భావనను అర్ధం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతారు.

సాక్షి అనేది ఒక అంతర్గత స్థితి; భౌతిక ప్రపంచంలో వ్యక్తీకరించబడేది కాదు. రోజువారీ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, పరిణామాల నుండి ఓ అడుగు వెనక్కు వేసి అంతర్గత స్థిరత్వాన్ని కలిగి ఉండే సామర్ధ్యమే ఈ సాక్షి భావం. సుఖదుఃఖాలు కలిగించే గుణం వస్తువుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలను తన శక్తి మేరకు ఆచరించడమే సాక్షిభావం. ఇది మన భావోద్వేగాలను సాక్షిగా గమనించుకుంటూ వాటిని అధీనంలో ఉంచుకునే సామర్ధ్యమే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక