15. సమత్వం
సమత్వం (సమానత్వం)
అనేది భగవద్గీతలో అనేకచోట్ల కనిపించే కీలకమైన అంశం. శ్రీకృష్ణ భగవానుడు సమత్వ
భావనను, సమత్వ దృష్టిని,
సమత్వ బుద్ధిని అనేక చోట్ల ప్రస్తావిస్తారు. సమత్వాన్ని అర్థం
చేసుకోవడం సులభం కానీ అంతర్లీనము చేసికొని ఆచరణలో పెట్టడం అనేది కష్టమైన విషయం.
ఒక్క మాటలో చెప్పాలంటే మనలోని సమత్వం యొక్క స్థాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం
సాధించే పురోగతికి సూచిక.
ఆధునిక సమాజాలు సమత్వాన్ని
పౌరులందరూ చట్టం ముందు సమానమే అని అంగీకరించాయి. జ్ఞాని వేట జంతువూను వేటగాడిని; బాధని సంతోషాన్ని; లాభాన్ని నష్టాన్ని సమానంగా చూస్తాడంటూ శ్రీకృష్ణుడు సమత్వానికి అనేక
ఉదాహరణలు ఇస్తారు.
మన పెంపకం వలన, సమాజం వలన ధర్మం, కులము, మతము, జాతి, వర్గం వంటి అనేక కృత్రిమమైన విభజనలకు మనం లోనవుతాము. ఈ విభజనలన్నింటినీ
అధిగమించి ఇద్దరు మనుషుల్ని సమానంగా చూడడమే సమత్వం వైపు తొలి అడుగు. ఇది బాహ్య
ప్రవర్తన కన్నా చాలా లోతైనది.
సమత్వం వైపు
పురోగతిలో తదుపరి స్థాయి మనకు దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సమత్వ దృష్టి, భావంతో చూడడం. ఇందుకు ఉదాహరణలు మన
పిల్లలు అంతగా రాణించని సందర్భాల్లో మన మిత్రుల పిల్లలు రాణిస్తూ ఉంటే
సంతోషించగలగటం; అత్తను అమ్మను సమానంగా చూడడం; కూతురిని కోడల్ని సమానంగా చూడడం వంటివి.
ఇతరులను మనతో
సమానంగా చూసే సామర్థ్యం సమత్వము యొక్క పతాక స్థాయి. మనకు దక్కాల్సిన పదోన్నతి, కీర్తి, ప్రతిష్ట,
ఆస్తులు, ఇతరులకు దక్కినప్పుడు సమత్వ భావంతో
వ్యవహరించగల సామర్ధ్యమిది. ఇతరుల బలహీనతల్ని మనలో, మన
సామర్థ్యాలను ఇతరుల్లో చూడగలిగినుప్పుడే ఇది సాధ్యమవుతుంది.
శ్రీకృష్ణుడు మనల్ని
ఇతరుల్లో, ఇతరుల్ని మనలో
చూడమని సలహా ఇస్తారు. చివరికి శ్రీకృష్ణుడిని అందరిలోనూ, అన్నింటిలోనూ
చూడమంటారు. ఇది రెండూ లేవని చెప్పే అద్వైతమే.
విభజనకు శిక్షణ
ఇవ్వబడిన మన మనస్సు సమత్వము యొక్క అత్యున్నత స్థాయిని పొందడానికి అతిపెద్ద అవరోధం.
మనపై అది ఆధిపత్యం చెలాయించేందుకు అనుమతించే బదులు మనం మనస్సును లొంగదీసు
కోగలగాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి