16. గుణాతీతులవడం




ఏ కర్మకూ కర్త ఉండడని శ్రీకృష్ణుడు అంటారు. నిజానికి కర్మ అనేది ప్రకృతిలోని భాగాలైన సత్వ, రజో, తమో గుణాల మధ్య జరిగే పరస్పర ప్రభావాల పరిణామమే.

దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గుణాలను అధిగమించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తారు. గుణాతీతునిగా అవ్వడం (గుణాలను అధిగమించడం) ఎలాగో, అటువంటి దశను పొందిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలని అర్జునుడు ఆశిస్తాడు.

దంద్వాతీత (ధృవాలను అధిగమించడం), ద్రష్ట (సాక్షి), సమత్వం (సమానత్వం) అనే భగవద్గీతలో నిక్షిప్తమైన లక్షణాల గురించి ఇంతకుముందే వర్ణింపబడినది. ఈ మూడింటి సంయోగమే గుణాతీత అని శ్రీకృష్ణుడు సూచించారు.

శ్రీకృష్ణుడి ప్రకారం గుణాతీత స్థితిని చేరుకున్న వ్యక్తి గుణాలే గుణాలతో ప్రతిస్పందిస్తున్నాయని తెలుసుకుంటాడు కనుక సాక్షిగా ఉంటాడు. అటువంటి స్థితిలో ఏ ఒక గుణం పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడు. మరో గుణం పట్ల విముఖత చూపడు.

గుణాతీతుడైన వ్యక్తి ద్వంద్వాతీతుడు కూడా అయి ఉంటాడు. కష్టసుఖాల యొక్క ధృవాలను అర్థం చేసుకున్నాక అతను రెండిటి పట్ల తటస్థంగా ఉంటాడు. అతడు మిత్రుల పట్ల, శత్రువుల పట్ల తటస్థంగా ఉంటాడు ఎందుకంటే అతనికి మనకు మనమే మిత్రులమని మనకు మనమే శత్రువులమనీ తెలుసు. గుణాతీతుడు పొగడ్తలకు, విమర్శలకు తటస్థంగా ఉంటాడు ఎందుకంటే ఇవి త్రిగుణాల యొక్క ఉత్పన్నాలని అతను గుర్తిస్తాడు.

భౌతిక ప్రపంచం ధ్రువీయము కనుక రెండు వైపులా ఊగిసలాడడం సహజం. ఊగిసలాడే లోలకానికి, ఉయ్యాలకు కూడా ఒక స్థిరమైన బిందువు కావాలి. ధృవాల ఊగిసలాటలో పాల్గొనకుండా కేవలం సాక్షిగా ఉండే అవకాశమున్నటువంటి స్థిర బిందువును చేరుకోమని శ్రీకృష్ణ భగవానుడు సూచిస్తున్నారు.

గుణాతీతుడు మట్టికి, బంగారానికి ఒకే విలువను ఇస్తాడు. అంటే ఒక దానికి ఎక్కువ విలువ మరొక దానికి తక్కువ విలువ అన్న వ్యత్యాసాన్ని చూపడు. ఇతరులు ఇచ్చే విలువ మీద ఆధారపడక, వస్తువులను వస్తువులుగా చూస్తాడు.

'గుణాతీత' అంటే కర్తృత్వ భావనను వదిలివేయడమని శ్రీకృష్ణుడు అంటున్నారు. విషయాలు వాటంతటవే జరుగుతాయని ఇందులో కర్తకు ఏమాత్రం స్థానం లేదని అనుభవపూర్వకంగా మనం గుర్తించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక