19. సృజనాత్మకత సృష్టిస్తుంది
'సత్యము'
(వాస్తవమైనది, శాశ్వతమైనది) మరియు 'అసత్యము' (అవాస్తవమైనది, అశాశ్వతమైనది) గురించి మరింతగా వివరిస్తూ శ్రీకృష్ణుడు నాశనం లేనిది,
అన్నింటా వ్యాపించి ఉన్న 'దాన్ని' గురించి మనలను ఆలోచించమంటారు (2.17).
ఈ సృష్టి యావత్తు
సృష్టికర్త పని అనే సులభమైన అవగాహన కలిగి ఉండటం చాలా సహజం. కానీ శ్రీకృష్ణుడు నిరంతర
పరిణామ శక్తి అయిన 'సృజనాత్మకత'
దిశగా దృష్టి మల్లించాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు 'సృజనాత్మకత' విత్తనాలను మొలకెత్తేలా చేస్తుంది.
మొలకను, విత్తనాన్ని నాశనం చేయొచ్చు. కానీ
నిరంతరం పని చేస్తూ ఉండేది, సర్వత్రా వ్యాపించి ఉన్న 'సృజనాత్మకత' నాశనము చేయబడదు. సృష్టికి కాలపరిమితి
ఉంటుంది కానీ 'సృజనాత్మకత' కాలాతీతమైనది.
భౌతిక స్వరూపాలు పుడుతూ ఉంటాయి, మరణం తర్వాత తమ ఉనికిని
కోల్పోతాయి. కానీ 'సృజనాత్మకత' నాశనం
లేనిది.
'సృజనాత్మకత'
అనేదే నిజమైన కర్త. ఇది భావనలను, ఉద్వేగాలను
సృష్టిస్తుంది. మన దేహం, మనస్సు వంటి భౌతిక స్వరూపాలను
సృష్టిస్తుంది.
జ్ఞానము, జ్ఞాపకశక్తి అనేవి గతానికి
సంబంధించినవి, కర్మఫలము అనేది భవిష్యత్తు లోనిది. 'సృజనాత్మకత' ఎల్లప్పుడూ వర్తమానం లో జరుగుతుంది.
'సృజనాత్మకత'
అనేది బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకుని
ఇంద్రియాల ద్వారా గ్రహింపబడిన ఆహ్లాదకరమైన, బాధాకరమైన అనుభూతులపై
ఆధారపడకుండా స్వతంత్రముగా స్పందించే సామర్థ్యం. మన ఇంద్రియాలు భౌతిక స్వరూపాలకు
చెందిన ఇంద్రియ విషయాలను గుర్తింపగలిగే సామర్ధ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.
వాటిని అధిగమిస్తేనే 'సృజనాత్మకత' ను
తెలుసుకోగలుగుతాము.
మనం 'సృజనాత్మకత' తో
మనల్ని గుర్తించుకోగలిగినప్పుడే మన వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన
జీవనంలో ఆనందాన్ని పొందుతాము. ఒక కర్మ యోగికి ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించటం ద్వారా
ఈ స్థితిని పొందడం చాలా సులభం.
సృజనాత్మకతే మన సహజ
స్వభావం. కానీ మనం సృష్టితో గుర్తించబడడానికి అలవాటు పడి యున్నాము. ఈ తప్పుడు
గుర్తింపు వలననే మనము ‘కర్త’ అన్న భావనకు లోనవుతాము. అహంకారానికి అదే మూలము.
'సృజనాత్మకత'
తో మనల్ని మనం గుర్తించుకుంటే మన చుట్టూ ఉన్న సృజనాత్మకతను చూడగలము.
ఇలా చేయాలంటే శ్రీకృష్ణుడు మనల్ని ఇతరులలో, ఇతరుల్ని మనలో,
చివరికి తనను అన్నిటా, అంతటా చూడాలని ప్రబోధిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి