21. సృజనాత్మకతను నాశనము చేయలేము



అంతరాత్మను అర్థం చేసుకునే తృష్ణతో ఉన్న మానవాళికి రెండు రకాల జ్ఞానులు మార్గదర్శకత్వం చేశారు. రెండు మార్గాల గమ్యం ఒకటే అయినప్పటికీ ఒకరు సానుకూల పక్షం నుంచి, మరొకరు ప్రతికూల పక్షం నుంచి ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఆరంభించే స్థలం మరియు మార్గము వేర్వేరుగా ఉండవచ్చు. ఏ మార్గంలో వెళ్తాము అన్నది మన స్వభావం పై ఆధారపడి ఉంటుంది.

సానుకూల దృక్పథంతో సాగే మార్గదర్శనము నాశనము లేనిది, శాశ్వతమైనది, స్థిరమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్న 'దాన్ని', దానికి 'ఇంకేమి కలపలేని' సంపూర్ణముగా వర్ణిస్తుంది. 'సృజనాత్మకత' దీనికి రూపకం.

ప్రతికూల దృక్పధంతో సాగే మార్గదర్శనము నాశనం చేయలేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్న 'దాన్ని', దాని నుండి 'ఇంకేమి తీయలేని' ఖాళీగా వర్ణిస్తుంది. 'శూన్యం' దీనికి రూపకం.

'సృజనాత్మకత', 'శూన్యం' అనేవి రెండూ సృష్టికరణ, భౌతిక వ్యక్తీకరణల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 'సృజనాత్మకత' సృష్టికి దారి తీస్తుందని అర్థం చేసుకోవడం సులభం.

మరొకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ సమస్త సృష్టి 'శూన్యం' నుంచి పుట్టిందనీ, విశ్వాన్ని ఉనికిలోకి తీసుకురాగలిగిన శక్తి శూన్యానికి ఉందని నిర్ధారణకు వచ్చింది. చిన్న పరమాణువు నుంచి శక్తివంతమైన విశ్వం దాకా శూన్యం అంతటా వ్యాపించి ఉంటుంది.

ఈ సందర్భములో శ్రీకృష్ణుడు ఇలా అంటారు, “ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు” (2.23). ఈ శ్లోకం భగవద్గీత యొక్క తరచుగా ఉల్లేఖించబడిన  శ్లోకము.

'శూన్యాన్ని' గాని 'సృజనాత్మకత'ను కానీ ఏ ఆయుధమైన నాశనం చేయలేదు; 'సృజనాత్మకత' యొక్క భౌతిక వ్యక్తీకరణను మాత్రమే మార్చగలదు. అలాగే అగ్ని సృజనాత్మకతను కానీ, శూన్యాన్ని కానీ నాశనం చేయలేదు; దాని సామర్థ్యం, శక్తి కట్టెను బూడిదగా మార్చడం వరకే పరిమితం; ఈ రెండు భౌతిక స్వరూపాలే. నీరు కూడా వీటిని కరిగించలేదు. అలాగే వాయువుకి కూడా సృజనాత్మకత లేక శూన్యాన్ని ఆరిపోవునట్లు చేసే నైపుణ్యాలు గాని, శక్తి గానీ లేదు.

సృజనాత్మకత సృష్టిని ఉనికిలోకి తెస్తుంది. కానీ సృష్టికి సృజనాత్మకతను ప్రభావితం చేసే శక్తి లేదు. ఇక్కడ దిశ ముఖ్యమైనది. ఆకాశంలో మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి ఆకాశాన్ని ప్రభావితం చేయలేవు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక