22. సంతులనమే పరమానందం
విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి అనిత్యములు కనుక
వాటిని సహింపమని భగవద్గీత ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు చెబుతారు (2.14). సమకాలీన
సమాజంలో దీనిని 'ఇది కూడా గతించిపోతుంది' అని వ్యక్తీకరిస్తారు. అనుభవాత్మక మైన స్థాయిలో మనం దీనిని
అలవర్చుకోగలిగితే ఈ ద్వంద్వాలను అధిగమించి వాటిని సమానంగా స్వీకరించడం
అలవర్చుకుంటాము.
మనకు చూపు, వినికిడి,
వాసన, రుచి, స్పర్శ అనే
ఐదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు కళ్ళు, చెవులు, ముక్కు నాలుక, చర్మం.
సంబంధిత ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించడానికి మెదడులో ఒకో
ఇంద్రియానికి ఒకో ఒక భాగం ఉంటుంది.
ఇంద్రియ సాధనాలకి అనేక పరిమితులు ఉన్నాయి.
ఉదాహరణకి కన్ను ఒక రకమైన పౌనఃపుణ్యం (frequency) గల కాంతిని
మాత్రమే క్రమబద్ధం చేయగలదు. దీన్నే మనం దృశ్యమాన కాంతి (visible light) అంటాము. రెండవది అదీ సెకనుకి 15 కన్న ఎక్కువు చిత్రములు గుర్తించలేదు.
తెరపై చూసినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే వీడియోలు, సినిమాల
సృష్టి వెనక ఉన్న సూత్రం ఇదే. మూడవది, ఏదైనా దృశ్యమును
చూడడానికి కనీసం కొంత కాంతైనా కావాలి. ఇంద్రియాలకున్న ఈ పరిమితులు, 'సత్యము' (శాశ్వతం), 'అసత్యము'
(అశాశ్వతం) ల మధ్య ఉన్న తేడాను గమనించే మన సామర్థ్యానికి అడ్డుపడి
మనం తాడుని చూసి చుట్టుకుని ఉన్న పామని భ్రమ పడేలా చేస్తాయి.
ఈ ఇంద్రియాల పరికరాల యొక్క మెదడులోని భాగాలు
కూడా ఈ పరికరాలకు ఉన్న పరిమితుల వల్ల ప్రభావితం అవుతాయి. ప్రత్యేకించి, మన బాల్యంలో పెంపకం ద్వారా మనకు నేర్పబడ్డ విషయాల వలన మెదడులోని కొన్ని
న్యూరాన్లు ఒక ప్రత్యేక నిర్మాణంలో ఇమడ్చబడతాయి. దీనినే
హార్డ్ వైరింగ్ అంటారు. ఇది ప్రేరేపించబడ్డ అవగాహనను కలిగిస్తుంది. అంటే మనం
దేన్ని చూడాలి అనుకుంటామో దాన్నే చూసేలా చేస్తుంది. 'సత్యము'
ను చూడలేని ఈ అసమర్ధత, 'అసత్యము' వైపుగా ఒరిగే స్వభావం దుఃఖానికి కారణమవుతుంది.
సుఖం, దుఃఖం వంటి ధృవాల
దాడికి గురైనప్పుడు మనం సంతులనంతో ఉండగలిగితే ఇక్కడే, ఇప్పుడే
అమృతానికి (మోక్షానికి) అర్హత సంపాదించుకుంటామని శ్రీకృష్ణుడు అభయం ఇస్తున్నారు
(2.15).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి