43. తటస్థంగా ఉండడం

 




మన యొక్క, ఇతరుల యొక్క పనులు, నిర్ణయాలు, మంచివి లేదా చెడ్డవనే విభజనలు చుట్టూ మనం జీవితాలను గడుపుతాము. "సమత్వబుద్ధి యుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.50). అంటే ఒకసారి మనము ఈ సమత్వయోగాన్ని చేరుకున్న తర్వాత ఈ విభజనలను వదిలేస్తాము. అభిప్రాయాలకు తావు ఇవ్వము.

మన మనస్సు అనేక రంగుటద్దాలతో కప్పబడి ఉంటుంది. ఎదిగే సమయంలో మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నియంత్రణ ద్వారా అలాగే మనముంటున్న దేశం యొక్క చట్టం ద్వారా మనలో ఇవన్నీ ముద్రింప-బడుతాయి. మనము ఈ రంగుటద్దాల ద్వారానే విషయాలను చూస్తూ ఉంటాము, పనులను చేస్తూ ఉంటాము. వాటిని మంచి లేదా చెడుగా విభజిస్తాము. యోగం ఈ రంగులన్నింటినీ పోగొట్టి అన్ని విషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఇది రెమ్మలకు బదులుగా మూలాలను నాశనం చేయడం, మన స్వంత అభిప్రాయమును జోడించడానికి ప్రయత్నించకుండా పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం వంటిది.

ఈ విభజన తత్త్వముకారణంగా మనము పాక్షిక సమాచారమును మాత్రమే సేకరిస్తాము తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన కీలకమైన సమాచారాన్ని కోల్పోతాము. తప్పుగా అన్వయించబడిన లేదా పాక్షిక సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు, చేయబడ్డ పనులు అనివార్యంగా విఫలమవుతాయి.

తటస్థంగా ఉండడం అంటే ఒక విద్యార్థి ఒక సమస్యకు అనుకూలంగా మరియు ప్రతికూలంగా ఏకకాలంలో వాదించాల్సిన చర్చ లాంటిది. చట్టంలో చెప్పినట్లు, మనం నిర్ణయాలు తీసుకునే ముందు రెండు పక్షాల వారి వాదనలు వినడం లాంటిది. ఇది అన్ని జీవులలో తనను, అన్ని జీవులను తనలోనూ చూడడం వంటిది. అంతిమంగా సర్వత్ర శ్రీకృష్ణమయమే (6.29).

పరిస్థితి నుండి మనల్ని మనం వేరు చేసుకుని, దాని యొక్క రెండు పక్షాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఇది. ఈ సామర్ద్యం వికసించాక దారుమ బొమ్మలాగా మధ్యలో మనల్ని మనం కేంద్రీకరించుకోవడం మొదలు పెడతాం.

ఎవరైనా కొంచం సేపటికైనా యోగ స్థితిని (సమతుల్యత) పొందినప్పుడు కూడా, ఆ సమయంలో వారి ద్వారా చేయబడే పని సమంజసంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను గణాంక కోణంలో చూస్తే ఇది ఒక వ్యక్తి సమతుల్యతలో ఉన్న సమయం యొక్క శాతమే. ఈ యాత్ర దానిని వంద శాతానికి పెంచడానికే!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక