44. సంతులిత నిర్ణయాలు తీసుకోవడం
మనమందరం వివిధ అంశాల
ఆధారంగా మన కోసం, మన
కుటుంబం, సమాజం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటాము. ఈ నిర్ణయ
సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లమని చెబుతూ, 'యోగః
కర్మసు కౌశలం', అంటే యోగస్థితిలో చేసే ప్రతి కర్మ సామరస్యంగా
ఉంటుందని శ్రీకృష్ణుడు ఉద్బోధించారు (2.50). ఇది పువ్వు యొక్క అందం, వెలువడే సువాసన వంటి సామరస్యాన్ని అనుభవించడానికి కర్తృత్వాన్ని, అహంకారాన్ని వదిలివేయడం.
మన నిర్ణయాలన్నీ
మనకు మరియు మన కుటుంబానికి సుఖాన్ని పొందడం లేదా దుఃఖాన్ని నివారించడం కోసం
తీసుకుంటాము. తదుపరి స్థాయిలో మనము సమతుల్య నిర్ణయాలు తీసుకుంటాము, ప్రత్యేకించి మనం సంస్థలకు, సమాజానికి బాధ్యత వహిస్తున్నప్పుడు కానీ ఈ స్థాయిలో కర్తృత్వం ఇంకా మిగిలి
ఉంటుంది.
శ్రీకృష్ణుడు
కర్తృత్వానికి తావులేని అంతిమ స్థాయి గురించి మాట్లాడుతున్నారు. అటువంటి స్థాయికి
చేరిన వ్యక్తి ఏది చేసినా అది సామరస్యంగా ఉంటుంది. అంతటా వ్యాపించిన చైతన్యమే
వారికి కర్తగా మారుతుంది.
తమ బాధ్యతలను
నిర్వహించడానికి ఈ దశ నిర్ణయాధికారులందరికీ అనివార్యమైనది. కనుకనే ఇండియన్
అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS - భారతీయ పరిపాలనా సేవ) 'యోగః కర్మసు కౌశలమ్' ను నీతి వాక్యముగా స్వీకరించింది.
ఇది భావోద్వేగాలు, పక్షపాతాలు, జ్ఞాపకాల
ప్రభావంలో పడకుండా ఉండడం. ఎందుకంటే వాటి ప్రభావములో పడితే ఇవి వాస్తవాలను గ్రహించే
మన సామర్థ్యాన్ని నాశనము చేస్తాయి, తద్వారా తప్పుడు
నిర్ణయాలకు దారితీస్తాయి. ఇది సహచరుల నుండి, సమాజం నుండి
ఉత్పన్నమయ్యే ధ్రువాల బారిన పడినప్పుడు ఎంత త్వరగా తటస్థ దశలోకి రావాల్సిన
అవసరముందో అని చెప్పే అంశం.
చట్టాన్ని అమలు
చేయడం లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఆహ్లాదకరమైన విషయం కాదు. తటస్థంగా ఉండటం మనకు
ప్రశంసలను, విమర్శలను
సమంగా పరిగణించడంలో సహాయపడుతుంది.
తటస్థ స్థితిలో దృఢంగా ఉన్న వారందరికీ శక్తి, తెలివితేటలు, కరుణ అందుబాటులో ఉంటాయి. ఇటువంటి సాధనాలు అందుబాటులో ఉంటే భౌతిక ప్రపంచలో కూడా కార్యసాధకులవుతారు. సూర్యుడికి దగ్గరగానూ లేక దూరంగా లేకుండా తటస్థంగా ఉండటం వల్లనే భూమి మీద జీవనం సాధ్యమవుతుంది ఎందుకంటే జీవాన్ని ఇచ్చే నీరు ద్రవ రూపంలో ఉండడానికి ఈ తటస్థత దోహదపడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి