45. జన్మ మృత్యువులనే భ్రాంతిలో కలిగే బంధాలు

 




సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.51).

నిశ్చలమైన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని దీర్ఘకాలంగా మానవాళి నమ్మింది. కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని తరువాత కనుగొనబడింది. అంటే మన అవగాహన అస్తిత్వగత సత్యంతో మేళవించింది. మన ఇంద్రియాల పరిమితుల వల్ల కలిగే భ్రమతో సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. జననం, మరణం గురించిన మన భ్రమ కూడా ఇటువంటిదే.

శ్రీకృష్ణుడు 'దేహి' లేక ఆత్మను గురించి వివరిస్తూ భగవద్గీతను ప్రారంభించారు. అది అన్నింటిలోనూ వ్యాపించినది, జన్మలేనిది, శాశ్వతమైనది, పురాతనమైనది (2.20). కొత్త వస్త్రాలను ధరించడానికి మనం జీర్ణమైన వాటిని విడిచినట్లుగా ఆత్మ భౌతిక శరీరాలను మారుస్తుందని ఆయన చెప్పారు (2.22). సమబుద్ధితో జన్మ బంధాల నుండి విముక్తి పొందుతారని ఆయన చెప్పినప్పుడు, వారు 'దేహి, ఆత్మ' అనే అస్తిత్వగత సత్యంతో తమను తాము జోడించుకోవడాన్ని సూచిస్తుంది. ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్న భ్రమ నుండి బయటపడి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందన్న అస్తిత్వగత సత్యంతో మేళవించడం లాంటిది.

సమాజంలో అధికసంఖ్యకులు నమ్మేదాన్ని మనము కూడా నమ్ముతాము. కానీ సమాజంలో ఎక్కువ మంది మనకు పుట్టుక, మరణాలు ఉన్నాయని నమ్ముతారు. అటువంటి నమ్మకం కలవారు దేహి, ఆత్మ యొక్క అస్తిత్వగత సత్యాన్నీ గురించి మనకు మార్గనిర్దేశం చేయలేరు. మన స్వంత సమబుద్ధి మాత్రమే ఈ మార్గంలో మనకు సహాయపడగలదు.

శ్రీకృష్ణ భగవానుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితిని గురించి ప్రస్తావించారు. సాధారణంగా ఇది స్వర్గంగా, బయట ఎక్కడో ఉన్న పరమపదంగా వర్ణించబడుతుంది. కానీ ఈ గమ్యం మనలోనే ఉందని ఈ శ్లోకం సూచిస్తుంది. ఇది కర్మలను త్యజించకుండా కర్మఫలాలను త్యజించే మార్గం (2.47).


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక