61. అనిశ్చిత మనస్సుకు నిశ్చితత
భగవద్గీతలోని మూడవ అధ్యాయం 'కర్మ యోగము' అని పిలువబడుతుంది. ఇది 2.71 శ్లోకం
యొక్క విశదీకరణ. ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వతమైన స్థితిని సాధించడానికి నిర్మమ,
నిరహంకార మార్గమని చెప్పారు.
“మీరు బుద్ధిని ఉన్నతమైనదిగా భావిస్తే, నన్ను ఈ భయంకర కార్యమైన యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తున్నారు (3.1)?
ప్రసంగంతో నన్ను కలవరపెట్టకుండా నా క్షేమం కోసం అన్నిటికంటే ఏది
మంచిదో నాకు నిశ్చయంగా చెప్పండి” అని అర్జునుడు అడుగుతాడు (3.2).
భావోద్వేగానికి లోనై సరైన సాక్ష్యాధారాలు
లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ధారణలకు రావడం, అంచనాలు వేయడం వదిలి వేయమని శ్రీకృష్ణుడు అంతకు ముందే సూచించారు (2.50).
యుద్ధంలో తన బంధువులను చంపడం వలన ఎలాంటి మేలు జరగదని అర్జునుడు యుద్ధం నుంచి
వైదొలగాలని ప్రయత్నిస్తాడు (1.31). తదనంతరం, అనేక విధాలుగా
అతను తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుత ప్రశ్న కూడా
అవగాహన కోసం అన్వేషణ కాకుండా స్వీయ సమర్ధనలో భాగంగా కనిపిస్తుంది.
మన పరిస్థితి అర్జునుడి కంటే భిన్నంగా లేదు
ఎందుకంటే మనం మన స్పృహలోకి రాకముందే మతం, జాతి, కుటుంబ స్థితి, కులం, జాతీయత,
లింగం మొదలైన వాటి ఆధారంగా గుర్తించబడతాము. జీవితాంతం వాటిని
సమర్థించుకోవడానికి పోరాడుతూనే ఉంటాము.
రెండవది, అర్జునుడు
శ్రీకృష్ణుడి నుండి నిశ్చయత కోసం ఎదురు చూస్తూన్నాడు. అశాశ్వతం, అనిశ్చయత అనేవి లోక రీతుల ప్రమాణం అయినప్పటికీ మనమందరం మనకు హాయినిచ్చే
నిశ్చయత కోసం ఎదురు చూస్తాము. హేతుబద్ధమైన నిర్ణయాల కోసం ఆధారాలను సేకరించేందుకు
అనిశ్చయతతో వేచి ఉండడానికి ధైర్యం, ఓర్పు కావాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి