63. మిధ్యాచారి





కర్మకి మనం కర్త కాకపోతే నిజమైన కర్త ఎవరు?” అనే ప్రశ్న మన అందరిని వేధిస్తుంది. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానమిస్తారు, “ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందులో ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలనన, మనష్యులందరును ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును” (3.5).

ఎలక్ట్రాన్', 'ప్రోటాన్', 'న్యూట్రాన్' అనే మూడు పరమాణు కణాలు ఈ భౌతిక ప్రపంచానికి మూలము. అదేవిధంగా సత్వ, తమో, రజో అనే మూడు గుణాలు మనల్ని కర్మలు చేసేలా ప్రేరేపిస్తాయి. అందుకే అవే నిజమైన కర్తలు.

శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు, “బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు” (3.6).

కుటుంబ, సామాజిక స్థాయిలో చిన్నప్పటి నుంచి మనం మంచి ప్రవర్తనకు పొగడ్తలను, చెడు ప్రవర్తనకు శిక్షను పొందుతూ పెరుగుతాము. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మంచి ప్రవర్తనగలవారిగా కనిపించటానికి మనం మన మాటల్ని, చేష్టల్ని నిగ్రహించుకొంటాము కానీ మన మనస్సు ద్వేషం, పశ్చాత్తాపం, అన్యాయ భావనతో నిండిపోతుంది. ఫలితంగా మన అంతర్గత, బాహ్య స్వభావాల మధ్య సమన్వయం లేకుండా విభజిత వ్యక్తిత్వానికి (split personality) దారి తీస్తుంది. అందుకనే ఇలాంటి అణచివేతకు శ్రీకృష్ణుడు ఎప్పుడూ అనుకూలంగా లేరు; దీన్నే ఆయన మిథ్య అంటారు. విమర్శలను, ప్రశంసలను సమానంగా పరిగణించే సమత్వం పొందమని ప్రేరేపిస్తారు. తద్వారా ద్వంద్వత్వం అదృశ్యమవుతుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరూ ఈ దుస్థితిలో జీవించాలని కోరుకోరు. కానీ దాని నుండి ఎలా బయటపడాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు అనాసక్తులై కర్మ యొక్క అవయవాలను కర్మయోగములో నిమగ్నం చేయడమనే తక్షణ పరిష్కారాన్ని చూపిస్తారు (3.7).

'అనాసక్తి' అన్నదే గమనార్హము. ఇది గుణాలే నిజమైన కర్త అని గ్రహించి, తాను 'కర్త' అనే భావం వదిలివేసి, కర్మలను చేయడం; కర్మఫలంతో సంబంధం లేకుండా కర్మలను చేయడం; ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాల (నియంత్రక భాగం) ను వేరు చేయడం. 'ఆసక్తి', 'విరక్తి' విడిపోయినప్పుడు షరతులు లేని ప్రేమ ఉద్భవిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

37. అదే అర్జునుడు అదే బాణం

140. కర్మ అంటే ఏమిటి

141. శక్తి, పదార్థాల పొందిక