74. శ్రద్ధ ఆనందాన్నిస్తుంది
"దోషదృష్టి
లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి
ముక్తులయ్యెదరు” అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నారు (3.31). శ్రద్ధ
అంటే సాధారణంగా నమ్మకం లేదా విశ్వాసం అని భావిస్తారు కానీ అది వీటిని మించినది.
మనకు సందేహాలు లేని, మన ప్రశ్నలన్నీ సమాప్తమాయ్యే స్థితి.
చాలా కాలం వరకు
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని మానవాళి విశ్వసించింది. విజ్ఞాన శాస్త్రం
అది తప్పు అని, భూమి
సూర్యుని చుట్టూ తిరుగుతున్నదన్న నిజాన్ని నిరూపించింది. కాబట్టి విశ్వాసం బాహ్య
విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే శ్రద్ధ అంతర్గతమైనది.
రెండవది, విశ్వాసం అనేది ఎప్పుడూ వ్యతిరేక
ధృవమైన అవిశ్వాసముతో పాటు కలిసి ఉంటుంది కానీ శ్రద్ధ ఈ రెండింటినీ అధిగమిస్తుంది.
మూడవది, అంధ విశ్వాసం నిజాన్ని వినడానికి గానీ, తెలుసుకోవడానికి గానీ ఇష్టపడదు. కాని శ్రద్ధ దీనికి విరుద్ధంగా
భిన్నత్వములో ఏకత్వాన్ని చూడగలదు. నమ్మకం, విశ్వాసం ఇతరుల
నుంచి అరువు తీసుకోవచ్చు కానీ శ్రద్ధ పూర్తిగా మన స్వంత అనుభవాల వల్ల కలుగుతుంది.
సంపూర్ణాన్ని
సమగ్రంగా గ్రహించాలంటే భిన్న భిన్న కోణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
“భ్రాంతికి లోనైనవారు ఈ బోధనలను పాటించరు,
నాశనమైపోతారు” అని శ్రీకృష్ణుడు మరో మార్గం ద్వారా ఈ విషయాన్ని
అర్థమయ్యేలా చెబుతున్నారు (3.32).
“జ్ఞాని కూడా
తన స్వంత స్వభావం యొక్క ధోరణుల ప్రకారం వ్యవహరిస్తాడు ఎందుకంటే అన్ని జీవులు తమ
స్వభావాలనే పాటిస్తాయి. అణచివేత ఏమి చేయగలదు?” అని
శ్రీకృష్ణుడు చెప్పారు (3.33). భగవద్గీతలోని ఒక మూలోపదేశం
ఏమిటంటే బోధన అనేది అవగాహన ద్వారా వస్తుంది అణచివేయడం ద్వారా కాదు.
మనమందరం కొన్ని ఆహార
పదార్ధాలను ఇష్టపడతాము,
కొన్నింటిని ఇష్టపడము. వాసనలు, శబ్దాలు, అందం విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తి అంటే కొందరికి ఇష్టం ఉంటుంది
మరి కొందరికి ఇష్టముండదు. ఇవాళ ఇష్టము రేపటి అసహ్యంగా మారవచ్చు లేదా దీనికి విరుద్ధంగా
జరుగవచ్చు. ఈ ధోరణులకు అనేక సమర్ధనలు ఉండవచ్చు. కాని శ్రీకృష్ణుడు ఈ ధోరణులను మన
శత్రువులుగా భావించమని, “ప్రతి ఒక్క ఇంద్రియ వస్తువులో రాగం,
ద్వేషం దాగి ఉంటాయి. మనుషులు ఈ రెండిటికీ వశం అవ్వకూడదు ఎందుకంటే ఈ
రెండూ అతనికి మేలు కలిగే మార్గంలో విఘ్నం కలిగించే మహా శత్రువులు” అని చెప్పారు (3.34).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి